Mahesh Babu Movie: సాధారణంగా గత కొన్ని దశాబ్దాల నుంచి హీరోలు ఆధ్యాత్మిక చిత్రాలలో కూడా నటిస్తూ తమకంటూ ఒక మంచి పేరు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రాముడు, కృష్ణుడు అంటే మనకు సీనియర్ ఎన్టీఆర్ (Sr.NTR) ఎలా అయితే గుర్తుకొస్తారో.. శ్రీ వెంకటేశ్వర స్వామిని తలుచుకోగానే సుమన్ (Suman) గుర్తుకొస్తారు. ఇక పరమశివుడి పాత్రలో చిరంజీవి (Chiranjeevi ), అన్నమయ్య పాత్రలో నాగార్జున (Nagarjuna ) ఇలా కొంతమంది ఆ పాత్రలకు పెట్టింది పేరుగా తమ అద్భుతమైన నటనతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఇకపోతే మహేష్ బాబు (Maheshbabu) ని శ్రీకృష్ణుడి రూపంలో చూడాలని కోరుకునే అమ్మాయిలు కూడా ఎంతోమంది ఉన్నారు. అలాంటిది ఇప్పుడు మహేష్ బాబు ఏకంగా పరమశివుడిగా కనిపించి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నారు. మరి అది ఎక్కడ ? ఏ సినిమా? అసలేం జరుగుతోంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ఖలేజా రీ రిలీజ్..
అసలు విషయంలోకి వెళ్తే.. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం అంటే 2010 లో త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో మహేష్ బాబు, అనుష్క(Anushka ), ప్రకాష్ రాజ్(Prakash Raj) ప్రధాన పాత్రలలో విడుదలైన చిత్రం ఖలేజా(Khaleja ). మణిశర్మ (Manisharma)సంగీత దర్శకుడిగా పనిచేశారు. దైవం మనుష్య రూపేనా అనే భావన చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఒక శక్తివంతుడైన వ్యాపారవేత చేతిలో పడి నలిగిపోతున్న పేదలను ఒక టాక్సీ డ్రైవర్ కాపాడటమే మూలంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఎందుకో తెలియదు ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఫ్లాప్ ను మూట కట్టుకుంది. కానీ టీవీల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఈ సినిమా ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. అయితే ఏ కారణాల వల్ల ఈ సినిమా అప్పుడు డిజాస్టర్ గా మిగిలిందో ఆయన అభిమానులకి కూడా అంతుచిక్కడం లేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాను రీ రిలీజ్ లో సూపర్ హిట్ చేయాలని అభిమానులు కంకణం కట్టుకున్నట్లు అనిపిస్తోంది.
also read:Alekhya Sister’s: తొలిసారి ఆడియన్స్ ముందుకొచ్చిన అలేఖ్య.. మళ్లీ అవే మాటలు… ఇక ఎవ్వడూ కాపాడలేడు
పరమశివుడిగా దర్శనమిచ్చిన మహేష్ బాబు..
అసలు విషయంలోకి వెళ్తే.. ఖలేజా సినిమాను ఈరోజు రీ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా థియేటర్లు ఖలేజా మూవీ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి.ఖలేజా రీ రిలీజ్ హంగామా చూస్తే ఏకంగా హైదరాబాద్, ఏలూరు, నల్లజర్ల, వైజాగ్ తేడా లేకుండా ఖలేజా రీ రిలీజ్ ఊచకోత సృష్టిస్తోంది. 15 ఏళ్ల క్రితం ఆ సినిమాను డిజాస్టర్ చేసి తప్పు చేశామని ఇప్పుడు సూపర్ హిట్ చేస్తున్నారు తెలుగు సినీ ప్రేమికులు. ఇకపోతే ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం ఏమిటంటే డల్లాస్ లో కూడా ఈ సినిమాను చాలా ప్రత్యేకంగా రూపొందించారు. ఇక్కడ టైటిల్ కార్డ్స్ లో ఏకంగా మహేష్ బాబు ఆ పరమేశ్వరుడి రూపంలో చూపించి అందరికీ గూస్ బంప్స్ తెప్పించారు. ఒక్కసారిగా మహేష్ బాబును పరమేశ్వరుడి రూపంలో చూసేసరికి అభిమానులు థియేటర్లలో ఈలలు , చప్పట్లతో సందడి చేసేస్తున్నారు. మొత్తానికి అయితే మహేష్ బాబును పరమశివుడి రూపంలో చూపించి, మరో కొత్త అవతారానికి నాంది పలికారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
— Sai Kiran (@sk_kiran16) May 30, 2025