BIG TV LIVE Originals: జపాన్ ప్రజలు చెట్లను ఎంతో ఇష్టపడుతారు. వాటిని ఎప్పుడూ నరికివేయరు. ఒకవేళ అక్కడి నుంచి తప్పకుండా చెట్లను తొలగించాల్సి వస్తే, వాటిని వేరే చోటుకి తరలిస్తారు. చెట్లను సురక్షితంగా ఉంచేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. జపాన్ ప్రజలు ఎందుకు చెట్లను నరికేందుకు ఇష్టపడరు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
చెట్లను ఎందుకు తరలిస్తారు?
సాధారణంగా ప్రజలు ఇళ్ళు నిర్మించుకునే సమయంలో లేదంటే రోడ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టేప్పుడు చెట్లను నరికివేస్తారు. కానీ, జపాన్ లో ప్రజలు చెట్లను చాలా ప్రేమగా చూసుకుంటారు. చెట్లను తమ మిత్రులుగా భావిస్తారు. చెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నరకకూడదని భావిస్తారు. అందుకే చెట్లను నరకకుండా వాటిని రీ ప్లాంటేషన్ చేస్తారు. వాటి ప్రాణాలు తీయకుండా కాపాడుతారు.
జపాన్ ప్రజలు చెట్లను ఎందుకు నరకరంటే?
చెట్ల పట్ల ఎక్కువ ప్రేమ ఉన్న కారణంగా జపనీస్ వాటిని నరికేందుకు ఇష్టపడరు. అందుకే, జాగ్రత్తగా వేరొకచోటుకి తరలిస్తారు. ఇంతకీ ఆ చెట్లను ఎలా తరలిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ జాగ్రత్తగా తవ్వడం: ఆయా పనులకు అడ్డుగా ఉన్న చెట్లను వేరొక చోటుకి తీసుకెళ్లేందుకు చెట్టు చుట్టూ తవ్వుతారు. ఇందుకోసం పెద్ద యంత్రాలను ఉపయోగిస్తారు. చెట్ల వేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతినకుండా జాగ్రత్త పడుతారు. ఎందుకంటే వేర్లను చెట్ల పాదాలుగా భావిస్తారు.
⦿ చెట్లను ఎత్తడం: చెట్ల చుట్టూ తవ్విన తర్వాత పెద్ద క్రేన్ల సాయంతో సున్నితంగా వాటిని పైకి లేపుతుంది. ఒక తాడు సాయంతో చెట్లును నెమ్మదిగా తరలిస్తారు.
⦿ కొత్త చోటులో పాతడం: ఒక దగ్గర నుంచి తవ్వి జాగ్రత్తగా తెచ్చిన చెట్లును మరొక చోట పాతిపెడతారు. వాటికి తగిన నీళ్లు, అవసరమైన పోషకాలను అందిస్తారు. ఆ చెట్టు బలంగా ఎదిగేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.
జపాన్ లో ఎందుకు అలా చేస్తారు?
జపాన్‌లో ప్రజలు ప్రకృతిని ఎంతో ఇష్టపడుతారు. వారికి షింటో అనే ప్రత్యేక ఆలోచన ఉంటుంది. అది చెట్లు, నదులు, పర్వతాలకు ఆత్మలు ఉన్నాయని చెబుతుంది. చెట్లను కదిలించడం వల్ల వారు ఈ ఆత్మల పట్ల శ్రద్ధ చూపుతున్నట్లు భావిస్తారు. అదే సమయంలో, అక్కడి ప్రజలు చెట్లను తమ పెద్దలుగా భావిస్తారు. వాటిని నరకడం అంటే నేరుగా వాటి ఊపిరి తీసినట్లే భావిస్తారు. చెట్లు మనకు స్వచ్ఛమైన గాలి, నీడను ఇస్తాయి. అంతేకాదు, భూ గ్రహానికి కూడా ఎంతో మేలు చేచేయడం వల్ల, వాటిని నరికేందుకు ఇష్టపడరు.
అందరూ చెట్లను వేరే చోటుకు తరలిస్తారా?
నిజానికి చెట్ల తరలింపు ప్రక్రియ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. చాలా సమయం పడుతుంది. కాబట్టి, ప్రతి చెట్టును కాకుండా, అత్యంత పురాతనమైన చెట్లను, అత్యంత ప్రత్యేకమైన చెట్లను మాత్రమే నరకకుండా వేరొకచోటుకు తరలిస్తారు. చెట్ల మీద తమకు ఉన్న ప్రేమను చాటుకుంటారు.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: కోటీశ్వరులు కావాలా? అయితే, యూఏఈ లాటరీ టికెట్ల గురించి తెలుసుకోవాల్సిందే!