Dil Raju : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ మొదలు పెట్టిన దిల్ రాజు దిల్ సినిమాతో ప్రొడ్యూసర్ గా మారాడు. వివి వినాయక దర్శకత్వంలో నితిన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఈ సినిమా తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వరుసగా ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. మంచి టాలెంటెడ్ దర్శకులు ఈ బ్యానర్ నుంచి బయటకు వచ్చారు. ఈ బ్యానర్లో ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం, బృందావనం అంటే ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. ఒక స్టేజ్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే, ఏమీ ఆలోచించకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా థియేటర్ కు వెళ్లిపోవచ్చు అని నమ్మకం కూడా వచ్చేసింది.
నా సినిమాను నేను పైరసీ చేస్తానా.?
భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన సినిమా గేమ్ చేంజెర్. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండేవి. ఈ సినిమా విడుదలైన రోజే పైరసీ కు గురి అయింది. అయితే ఈ తరుణంలో ఒక మాజీ నిర్మాత ఈ సినిమాను కావాలనే నిర్మాత పైరసీ చేశాడు అంటూ అప్పట్లో వ్యాఖ్యలు చేశారు. అదే విషయాన్ని దిల్ రాజు ప్రస్తావిస్తూ.. సినిమా పైరసీ జరిగితే ముందు నిర్మాత నష్టపోతాడు, తర్వాత డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ నష్టపోతారు. ఎందుకు ఇంత దిగజారిన మాటలు మాట్లాడుతున్నారు, మీడియాలోకి రావడానికా.? అది అనవసరం కదా. ఒకపక్క పైరసీను ఆపడానికి నేను ఫైట్ చేస్తున్నాను అంటూ తన ఆవేదనను రీసెంట్గా ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు దిల్ రాజు.
డిజాస్టర్ గేమ్ చేంజర్
శంకర్ సినిమా అంటే ఒకప్పుడు భారీ అంచనాలు ఉండేవి. తన కాన్సెప్ట్ లు అన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండేవి. రోబో సినిమా తర్వాత ఇప్పటివరకు శంకర్ కెరియర్ లో ఆ రేంజ్ హిట్ పడలేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన గేమ్ చేంజర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమా ఫెయిల్ అవ్వడానికి చాలామంది చాలా కారణాలు చెప్పారు. అయితే ఈ సినిమా దాదాపు 7 గంటల 50 నిమిషాలు షూట్ చేసినట్లు రీసెంట్గా ఎడిటర్ తెలిపారు. ఇక్కడితో శంకర్ మీద నెగిటివిటీ ఇంకా పెరిగింది. రీసెంట్ టైమ్స్ లో శంకర్ చేసిన రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశనే మిగిల్చాయి. మళ్లీ శంకర్ కం బ్యాక్ ఇస్తాడా లేదా అనేది చాలామందికి సందేహం కలిగించే విషయం.
Also Read : Bandla Ganesh : బండ్ల గణేష్ హాట్ కామెంట్స్, ఆ ప్రొడ్యూసర్ నే అంటున్నారా.?