BIG TV LIVE Originals: చాలా మంది త్వరగా కోటీశ్వరులు కావాలనే ఉద్దేశంతో లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తారు. వారిలో కొంత మందిని అదృష్టం వరిస్తుంది. మరికొంత మంది ధనవంతులు కావాలనే ఆశతో లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూనే ఉంటారు. అరబ్ కంట్రీ యూఏఈలోనూ పలు రకాల లాటరీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ది యూఏఈ లాటరీ, ఎమిరేట్స్ డ్రా, బిగ్ టికెట్, దుబాయ్ డ్యూటీ ఫ్రీ పేరుతో వీటిని అమ్ముతున్నారు. ఇవి చాలా సురక్షితం అని చెప్తోంది అక్కడి ప్రభుత్వం.
⦿ ది యూఏఈ లాటరీ
ఇది యూఏఈలో అందుబాటులోకి వచ్చిన సరికొత్త లాటరీ. దీనిని 2024లో ది గేమ్ LLC అనే కంపెనీ ప్రారంభించింది. దీనిని లక్కీ డే అని పిలుస్తారు. ఈ లాటరీ టికెట్లు పెద్ద మొత్తంలో డబ్బులను ఆఫర్ చేస్తుంది. www.theuaelottery.ae వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో మాత్రమే ఈ టికెట్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీని ధర రూ.1,140. వారానికి 6, నెలకి 1 చొప్పున లాటరీలు తీస్తారు. ఈ సంస్థ అందించే అతి పెద్ద ఆఫర్ రూ. 228 కోట్లు. చిన్న బహుమతి రూ. 2.28 కోట్లు. రూ. 2,280 బహుమతులు కూడా ఉన్నాయి. ఈ లాటరీ టికెట్స్ ను ఇండియన్స్ కూడా కొనుగోలు చేయవచ్చు. కానీ, యుఏఈలో ఉండాలి. వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. ఒకవేళ యూఏఈ పర్యటనకు వెళ్లిన వాళ్లు అయితే, పాస్ పోర్టు చూపించి కొనుగోలు చేయాలి.
⦿ ఎమిరేట్స్ డ్రా
2024 వరకు యూఏఈలో ఇది పెద్ద లాటరీ. ఇప్పుడు MEGA7, EASY6, FAST5 లాంటి లాటరీ టికెటన్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ లాటరీ టికెట్లను ఇతర దేశాలలోనూ అమ్ముతోంది. www.emiratesdraw.comలో లేదంటే ఎమిరేట్స్ డ్రా యాప్ ద్వారా టికెట్స్ కొనుగోలు చెయ్యొచ్చు. ఈ టికెట్స్ ధర రూ.342 నుంచి రూ.1,140 ఉంటుంది. ముందుగా ఈ సైట్ లోకి లాగిన్ టికెట్ ను కొనుగోలు చేయండి. MEGA7 బహుమతి రూ.228 కోట్లు. ఇతర బహుమతులు రూ.2.28 కోట్లు, రూ.1,140 బహుమతులు ఉంటాయి. వీటిని ఇండియన్స్ ఇక్కడి నుంచి కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది.
⦿ బిగ్ టికెట్
బిగ్ టికెట్ అనేది అబుదాబి విమానాశ్రయంలో అందుబాటులో ఉంటుంది. ఇది చాలా సరదాగా ఉంటుంది. ఈ టికెట్ డబ్బు, ఫ్యాన్సీ కార్లను బహుమతిగా అందిస్తుంది. www.bigticket.ae వెబ్ సైట్ లేదంటే అబుదాబి, అల్ ఐన్ విమానాశ్రయాలలో ఆన్ లైన్‌లో టిక్కెట్లను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఒక టికెట్ ధర రూ.11,400 ఉంటుంది. పెద్ద బహుమతి రూ.34.2 కోట్లు ఉంటుంది. ఇతర బహుమతులు రూ.2.28 కోట్లు, రూ.11.4 లక్షలు లేదంటే విలువైన కార్లు బహుమతిగా పొందే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ప్రత్యేక డ్రాల్లో రూ.171 కోట్లు బహుమతిగా ఇస్తారు. వీటిని యూఏఈకి వెళ్లిన ఇండియన్స్ పాస్ పోర్టు చూపించి కొనుగోలు చేయాలి. లాటరీ గెలిస్తే డబ్బు మీ బ్యాంకుకు వస్తుంది.
⦿ దుబాయ్ డ్యూటీ ఫ్రీ
దుబాయ్ డ్యూటీ ఫ్రీ అనేది దుబాయ్ విమానాశ్రయంలో లభించే లాటరీ. డబ్బు, కార్లు, మోటార్ సైకిళ్లను గెలుచుకునే అవకాశం ఉంది. www.dubaidutyfree.com లో వీటిని కొనుగోలు చేయవచ్చు. మిలీనియం మిలియనీర్ టికెట్ ధర రూ.22,800. ఫైనెస్ట్ సర్ ప్రైజ్ టికెట్ ధర రూ.11,400. మిలీనియం మిలియనీర్ బహుమతి రూ.8.35 కోట్లు ఉంటుంది. ది ఫైనెస్ట్ సర్ ప్రైజ్ లో సుమారు రూ. 22.8 లక్షల విలువైన పోర్స్చే లాంటి కార్లు లభిస్తాయి. రూ.1.14 లక్షల విలువైన మోటార్ సైకిళ్లను అందిస్తుంది. ప్రత్యేక డ్రాలు రూ.16.7 కోట్ల నగదు బహుమతిని అందిస్తుంది. యూఏఈకి వెళ్లిన భారతీయులు పాస్ పోర్టు చూపించి కొనుగోలు చేయవచ్చు. లాటరీ గెలిస్తే డబ్బులు నేరుగా అకౌంట్ లోకి వస్తాయి. కార్లు గెలిస్తే ఇంటికి డెలివరీ ఇస్తారు.
కొనుగోలు చేసే ముందు జాగ్రత్త!
కొన్నిసార్లు నకిలీ వెబ్ సైట్స్ ద్వారా సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. ఎమిరేట్స్ లాటరీ పేరుతో నకిలీ లాటరీలను అంటగట్టే ప్రయత్నం చేస్తారు. మీరు గెలిచారని మెసేజ్ లు పంపిస్తారు. వాటిని నమ్మకూడదు. అధికారిక వెబ్ సైట్ లు www.theuaelottery.ae (UAE లాటరీ), www.emiratesdraw.com (ఎమిరేట్స్ డ్రా), www.bigticket.ae (బిగ్ టికెట్), www.dubaidutyfree.com (దుబాయ్ డ్యూటీ ఫ్రీ) సైట్లను మాత్రమే నమ్మాలి.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.