Thudarum OTT Date : ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటులలో మోహన్ లాల్ ఒకరు. కమల్ హాసన్ వంటి నటులు కూడా ప్రశంసించే నటుడు మోహన్ లాల్. తెలుగు ప్రేక్షకులకు మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించే అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఇక దృశ్యం వంటి సినిమాలను మలయాళం లో చూసి తెలుగు ప్రేక్షకులు కూడా తన యాక్టింగ్ కు ఫిదా అయిపోయారు. ఇక జనతా గ్యారేజ్ సినిమా విషయానికి వస్తే ఆ సినిమాలో తన నటన అద్భుతం అని చెప్పాలి. రీసెంట్ గా మోహన్ లాల్ నటించిన సినిమా తుడరుమ్. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించిన ఈ సినిమా ఓటిటి విడుదలకు సిద్ధమవుతుంది.
తుడరుమ్ కథ
మధ్య తరగతి ట్యాక్సీ డ్రైవర్ అయిన షణ్ముగం అలియాస్ బెంజ్ తన బ్లాక్ అంబాసిడర్ కార్‌ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. అతను తన భార్య లలిత, కొడుకు పవన్, కూతరులతో సంతోషంగా జీవనం సాగిస్తుంటాడు. ఓ రోజు అనుకోకుండా అతని కారు యాక్సిడెంట్‌కు గురవుతుంది. దీంతో దానిని రిపేర్ కోసం ఇవగా, మెకానిక్ ఆ కారును చట్టవిరుద్ధమైన పనులకు వాడుకుంటాడు. దీంతో అతని కారును ఎలాగైనా తిరిగిపొందేందుకు బెంజ్ ఎస్ఐ బెన్ని ను కలుస్తాడు. ఈ కేసును సీఐ జార్జ్ మాథెన్ టేకప్ చేస్తాడు. ఆ తర్వాత పోలీసులతో బెంజ్‌కు ఎలాంటి ఘటనలు ఎదురయ్యాయి..? అసలు పోలీసులు బెంజ్ దగ్గర ఏదైనా దాచిపెట్టారా..? బెంజ్ అతని కారును తిరిగి పొందుతాడా..? అనేది సినిమా కథ.
ఓటిటి డేట్
ఈ సినిమాను మే 30న జియో హాట్ స్టార్ లో విడుదల కానుంది. మామూలుగా థియేటర్ లోనే చాలా మలయాళం సినిమాలను చూస్తుంటారు తెలుగు ప్రేక్షకులు. అక్కడ మిస్ అయినవాళ్లు ఇప్పుడు హాట్స్టార్ లో చూడొచ్చు. ఎన్నో మలయాళం సినిమాలను ఆదరించిన తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి.