Bengaluru Rathotsavam: తరలు, తిరునాళ్లలో తరచుగా అపశ్రుతి జరిగి భక్తులు చనిపోవడంతో పాటు గాయపడుతూ ఉంటారు. తాజాగా బెంగళూరులోనూ ఇలాంటి ఘోరమే జరిగింది. హుస్కూరులో జరిగిన మద్దూరమ్మ ఆలయ రథోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. భారీ రథాలు కూలడంతో ఓ భక్తుడు అక్కడికక్కడే చనిపోగా, సుమారు 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుడిని లోహిత్ గా గుర్తించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే?
హుస్కూరు మద్దూరమ్మ ఆలయ జాతరలో భాగంగా ప్రతి ఏటా రథోత్సవాలు నిర్వహిస్తారు. ఈ వేడుక చూసేందుక కర్నాటక నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా తిరునాళ్లను ఘనంగా జరిపించేందుక ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది 5 పెద్ద రథాలు పోటీలో పాల్గొన్నాయి. వాటిలో ఒక్కోటి 120 నుంచి 170 అడుగుల వరకు ఉన్నాయి. వాటిని లాగేందుకు పదుల సంఖ్యలో ఆవులు, దూడలను కట్టారు. రథాలను లాగుతున్న సమయంలో భారీగా గాలులు వీచాయి. వీటి ధాటికి రెండు భారీ రథలు కుప్పకూలాయి. దొడ్డనాగమంగళ, రాయసంద్ర నుంచి వచ్చిన ఈ రథాలు నేలకొరగడంతో ఓ భక్తడు అక్కడిక్కడే చనిపోయాడు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడే ఉండటంతో ఎక్కడి వాళ్లు అక్కడే పరుగులు తీశారు. ఈ తొక్కిసలాటలో మరికొంత మంది గాయపడ్డారు. రథాలు కూలిపడంతో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి.
ਵੱਡਾ ਹਾਦਸਾ: 100 ਫੁੱਟ ਉੱਚਾ ਰੱਥ ਡਿੱਗਿਆ ;ਸ਼ਨੀਵਾਰ ਨੂੰ ਬੈਂਗਲੁਰੂ ਦੇ ਬਾਹਰਵਾਰ ਇਤਿਹਾਸਕ ਮਦੁਰੱਮਾ ਮੰਦਿਰ ਤਿਉਹਾਰ ਦੌਰਾਨ ਵਾਪਰਿਆ ਹਾਦਸਾhttps://t.co/r0IMLQLwtB via @YouTube pic.twitter.com/QIWvNg0oxB
— Babushahi.com (@Babushahikhabar) March 23, 2025
మెరగైన వైద్యం అందించాలని ప్రభుత్వం ఆదేశం
రథాలు కూలి గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై కర్నాటక ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేసింది. స్థానిక అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంది. బాధితులకు మెరుగైన వైద్యసాయం అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. మరోవైపు ఈఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. వారతావరణ పరిస్థితులను అంచనా వేయకుండానే రథాలు నిర్మించడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
https://www.instagram.com/bangalore_malayalees/reel/C5ar328PGXv/
గత ఏడాది జాతరలోనూ రథం ప్రమాదం
వాస్తవానికి ఇక్కడ రథం ప్రమాదం జరిగడం ఇదే తొలిసారి కాదు. గత ఏప్రిల్ లో 120 అడుగుల ఎత్తైన రథం కూలిపోయింది. అప్పటి ఘటనలో ఎవరూ చనిపోలేదు. కానీ, పలువురు గాయపడ్డారు. ఈసారి ఏకంగా రెండు రథాలు కూలడంతో పరిస్థితి గందరగోళంగా మారింది.
రథాల పోటీ మొదలైనప్పటి నుంచే ప్రమాదాలు
దశాబ్దాలుగా హుస్కూర్ లో తిరునాళ్లు జరుగుతున్నాయి. ఆరు రోజుల పాటు ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. రెండు లక్షలకు పైగా భక్తులు పాల్గొంటారు. ఒకప్పుడు ఇక్కడ సాధారణ రథాలనే నిర్మించే వారు. కానీ 2021లో ఆలయ అధికారులు ‘ఉత్తమ రథం’ను గుర్తించి బహుమతిని ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఒకదానికి మించి మరొకదాన్ని నిర్మించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత నగదు బహుమతులు ఇవ్వడం మానేశారు. కానీ, ఎత్తైన రథాల నిర్మాణం మాత్రం ఆగలేదు. ఈ సీజన్ లో ఏకంగా 180 అడుగుల ఎత్తైన రథాన్ని తయారు చేశారు.
రథాల ఎత్తుపై పరిమితి విధించినప్పటికీ..
వాస్తవానికి ఈ ఏడాది రథాల ఎత్తు 80 అడుగులకు మించి ఉండకూడదని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, కేవలం జాతరకు 15 రోజుల ముందే ఈ ఆర్డర్స్ వచ్చాయి. కానీ, అప్పటికే రథాల తయారీ పనులు మొదలయ్యాయి. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ గ్రామస్తులు ఒప్పుకోలేదు. వచ్చే ఏడాది నుంచి ఈ నిబంధనలకు కట్టుబడి ఉంటామని తేల్చి చెప్పారు. అంతలోనే ఈ ప్రమాదం జరగడంతో తీవ్ర విషాదం నెలకొన్నది.
Read Also: సిమెంట్ వాడకుండానే ఇల్లు కట్టేశారు.. ఎలాగో తెలిస్తే దిమ్మతిరుగుద్ది!