Akshay Kumar: ఈరోజుల్లో ఏ భాషా పరిశ్రమలో అయినా స్టార్ హీరోలు తీసుకునే రెమ్యునరేషన్స్ హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఏకంగా వందల కోట్లలో రెమ్యునరేషన్స్ తీసుకుంటూ నిర్మాతలకు స్టార్ హీరోలు భారంగా మారుతున్నారని చాలామంది ఇండస్ట్రీ నిపుణులు చాలాసార్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినా కూడా వారి వైఖరి మారడం లేదు. ఇదే సమయంలో ఒక హీరో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సినిమా తీశాడు అంటే అది నమ్మడం చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ తాజాగా బాలీవుడ్‌లో అదే జరిగిందట. బీ టౌన్‌లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న అక్షయ్ కుమార్.. ఒక ఫ్లాప్ అయిన సినిమా కోసం రెమ్యునరేషన్ ఏమీ తీసుకోలేదని తాజాగా ‘సలార్’ నటుడు బయటపెట్టాడు.
నిర్మాతగా ఫ్లాప్
మలయాళ స్టార్ హీరో అయిన పృథ్విరాజ్ సుకుమారన్ కేవలం మాలీవుడ్‌కే పరిమితం కాకుండా ఇప్పటికే చాలా భాషా పరిశ్రమలను చుట్టేశాడు. అందులో బాలీవుడ్ కూడా ఒకటి. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు అందరిలో అక్షయ్ కుమార్‌తో పృథ్విరాజ్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే ఇప్పటివరకు అక్షయ్ కుమార్ నటించిన పలు సినిమాల్లో తను గెస్ట్ రోల్‌లో కూడా కనిపించాడు. ఇదిలా ఉండగా కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు పృథ్విరాజ్ సుకుమారన్. 2023లో అక్షయ్ కుమార్ హీరోగా ‘సెల్ఫీ’ అనే హిందీ చిత్రాన్ని నిర్మించాడు. ఆ మూవీ అట్టర్ ఫ్లాప్ అవ్వడంపై తాజాగా స్పందించాడు పృథ్విరాజ్.
సినిమా ఆడలేదు
‘‘నేను అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో ఒక సినిమా నిర్మించాను. దానికోసం ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఒకవేళ సినిమాకు లాభాలు వస్తేనే నా రెమ్యునరేషన్ తీసుకుంటాను అని ఆయన ముందే చెప్పేశారు. సినిమా బాగా ఆడలేదు. ఆయన రెమ్యునరేషన్ తీసుకోలేదు’’ అని చెప్పుకొచ్చాడు పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). 2022, 2023లో లైన్‌గా అక్షయ్ కుమార్‌కు అరడజనుకు పైగా ఫ్లాపులే ఎదురయ్యాయి. అందులో ‘సెల్ఫీ’ (Selfiee) కూడా ఒకటి. పృథ్విరాజ్ సుకుమారన్ మలయాళ సూపర్ హిట్ చిత్రమైన ‘డ్రైవింగ్ లైసెన్స్’కు ఇది రీమేక్. మలయాళంలో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అందుకోవడంతో హిందీలో కూడా అదే జరుగుతుందని నమ్మారు కానీ బాలీవుడ్ ప్రేక్షకులను ఈ మూవీ మెప్పించలేకపోయింది.
Also Read: టాలీవుడ్‌ను చూసి జలసీ ఫీల్ అవుతున్న విక్రమ్.. ఎందుకంటే.?
రిలీజ్ ఫిక్స్
చాలాకాలం తర్వాత ‘ఓఎమ్‌జీ 2’ సినిమాతో హిట్ కొట్టాడు అక్షయ్ కుమార్. అలా ఒక్క మూవీ హిట్ అవ్వగానే మళ్లీ నాలుగు సినిమాలు ఫ్లాపే అయ్యాయి. ప్రస్తుతం ఈ హీరో చేతిలో భారీ లైనప్ ఉంది. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘కేసరి 2’ గురించి తాజాగా అధికారిక ప్రకటన బయటికొచ్చింది. ఇందులో అక్షయ్‌కు జోడీగా అనన్య పాండే నటించనుంది. ఏప్రిల్ 18న సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. ఇప్పటివరకు ‘కేసరి 2’ గురించి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకుండా ఏకంగా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు మేకర్స్. ఇక దీంతో పాటు ‘భూత్ బంగ్లా’ అనే హారర్ కామెడీ మూవీతో కూడా బిజీగా ఉన్నాడు అక్షయ్ కుమార్.