AP Viral Video: ఇటీవల కొందరు యువకులు మద్యం మత్తులో చేసే పనులకు తెగ చిరాకు పడుతోంది సమాజం. రహదారులకు అడ్డంగా ఉండి మరీ, వాహనదారులను అడ్డంగించడం, ఆ తర్వాత దాడులు చేయడం, ఇలాంటి ఘటనలు ఇటీవల అధికమయ్యాయి. అయితే పోలీస్ ట్రీట్ మెంట్ తో కాస్త ఆ ప్రభావం తగ్గిందని చెప్పవచ్చు. కానీ యువకుల మత్తు వదిలిందని అనుకునే లోగానే, ఇప్పుడు ఓ యువతి మద్యం మత్తులో చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
ఆ యువతి దెబ్బకు ఒక్క 20 నిమిషాలు ట్రాఫిక్ జామ్. మద్యం మత్తులో అమ్మాయైతే ఏమి? అబ్బాయైతే ఏమి? మత్తు మాత్రం ఇద్దరికీ ఒక్కటే. అందుకేనేమో ఈ యువతి చేసిన హంగామాకు అక్కడ అందరూ నోరెళ్లబెట్టారు. అంతేకాదు ఇక మహిళలు అయితే, గప్ చుప్ అంటూ సైలెంట్ గా, ఇలాంటి వాళ్లు రోడ్ల మీదికి ఎందుకు అంటూ గుసగుసలాడుకున్నారు. ఈ ఘటన ఏపీలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసలు విషయం ఏమిటంటే..
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా గుర్తింపు పొందిన ఓ మద్యం షాప్ లో మద్యం తాగిన ఓ యువతి మద్యం మత్తులో రోడ్డుపై పడిపోయింది. ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటన భీమవరం – పాలకొల్లు ప్రధాన రహదారిపై జరిగింది. స్థానికుల కథనం ప్రకారం, 20 నుండి 25 ఏళ్ల మధ్య వయసున్న ఆ యువతి ఒంటరిగా షాప్ నుండి బయటకు వచ్చి, అతిగా తాగిన మత్తులో నడవలేక రోడ్డుపై కూర్చుంది.
కొద్దిసేపటికి ఆ యువతి పూర్తిగా స్పృహ కోల్పోయి రోడ్డుపైనే పడిపోయింది. ఈ దృశ్యం చూసిన వాహనదారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ముఖ్యంగా ఆమె ఏ స్థితిలో ఉందో తెలియని పరిస్థితిలో పడిపోయిందని కొంత మంది చెప్పుకొచ్చారు. దీంతో ప్రధాన రహదారి పై దాదాపు 20 నిమిషాలపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు కొందరు యువకులు తీసి వెంటనే సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేయడంతో, కాసేపులోనే ఈ ఘటన వైరల్ అయింది. యువకులే కాదు నేను సైతం అంటూ ఈ యువతి మద్యం మత్తులో చిత్తు చేసిందని కొన్ని మీమ్స్ కూడా చక్కర్లు కొట్టాయి.
Also Read: Gold Hunting: ఏపీలోని ఆ సముద్ర తీరంలో బంగారం.. తుఫాన్ టైమ్‌లోనే ఎందుకు?
పోలీసుల ప్రవేశం..
అరగంటకే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. యువతిని అక్కడి నుంచి పంపించి వేసే ప్రయత్నం చేశారు. ముందు ప్రాథమికంగా ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించిన పోలీసులు అనంతరం కుటుంబ సభ్యులను సమాచారమిచ్చారు. పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
మద్యం మత్తులో నడి రోడ్డుపై యువతి హల్ చల్
భీమవరం పాలకొల్లు హైవేపై ఫుల్లుగా మద్యం తాగి వాహనాలకు అడ్డుగా పడుకున్న యువతి.
దాదాపు 20 నిమిషాలపాటు రోడ్డుకు అడ్డంగా పడుకుని వాహనదారులకు ఆటంకం కలిగించిన యువతి.
చివరికి యువతిని పక్కకి తీసుకెళ్లిన పోలీసులు. pic.twitter.com/uSfZFNqA2m— ChotaNews App (@ChotaNewsApp) May 28, 2025
సోషల్ మీడియాలో స్పందన
ఈ ఘటనపై నెటిజన్లు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. కొందరు యువతిని విమర్శించగా, మరికొందరు ఆమె పరిస్థితికి బాధ పడ్డారు. తాగితే ఇలాంటిదే, కానీ మహిళగా ఇటువంటి మానసిక స్థితిలో ఉండటం దారుణమంటూ పలువురు కామెంట్లు చేశారు. ఈ ఘటనపై కొన్ని మహిళా సంఘాలు స్పందించాయి.
యువతుల మానసిక స్థితిని అర్థం చేసుకుని వారికి సరైన మార్గనిర్దేశనం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి. మద్యం షాపుల నియంత్రణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ ఘటన భీమవరం వంటి పట్టణాల్లో మద్యం వినియోగం, యువతలో మారుతున్న జీవనశైలి, సామాజిక బాధ్యతలపై చర్చకు దారి తీసింది. కుటుంబ సభ్యులు, సమాజం, పోలీస్ శాఖ, ప్రభుత్వానికి ఇలాంటి ఘటనలు పెద్ద హెచ్చరికలుగా మారుతున్నాయి.