Ilayaraja: తెలుగు, తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఎంతమంది సంగీత దర్శకులు ఉన్నా కూడా ఇళయరాజాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇళయరాజా మ్యూజిక్ గురించి మాటల్లో చెప్పలేము. త్రివిక్రమ్ వంటి దర్శకులు కూడా ‘అమ్మాయిలు లేకుండా రొమాంటిక్ గాను, డబ్బులు లేకుండా రిచ్ గాను’ ఎన్నో సాయంత్రాలను తీర్చిదిద్దిన ఇళయరాజా గారికి రుణపడి ఉంటాను అని ఒక సందర్భంలో అన్నారు. ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ సాంగ్స్ ను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందించారు ఇళయరాజా. ఇప్పటికీ కూడా ఇళయరాజా పాటలు వింటుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.
ఎన్నో కాంట్రవర్సీలు
ఇళయరాజా బాలు కాంబినేషన్ లో వచ్చిన పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో ఇళయరాజా మ్యూజిక్ ఎక్కడైనా వినాలన్నా కూడా కొద్దిపాటి భయం పట్టుకుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇళయరాజా మ్యూజిక్ ని ఎక్కడైనా ఉపయోగిస్తే వెంటనే కాపీరైట్ వేస్తున్నారు. చాలామంది దీని గురించి ట్రోల్ కూడా చేయడం మొదలుపెట్టారు. ఒక సందర్భంలో బాలును కూడా తన పాటలు కన్సర్ట్ పాడకూడదు అంటూ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మంజుమల్ బాయ్స్ సినిమా విడుదలైనప్పుడు కూడా ఇళయరాజా వివాదం కొద్దిపాటి నడిచింది. ఆ సినిమాపై గుణ సినిమాలోని పాటలు వాడినందుకు కాపీరైట్ వేశారు. వాస్తవానికి ఆ ఆ పాటకు మరింత వ్యాల్యూ పెంచిన సినిమా మంజుమల్ బాయ్స్. ఇక ప్రస్తుతం షష్టిపూర్తి అనే సినిమాకు సంగీతం అందిస్తున్నారు ఇళయరాజా.
లోకంలో నన్ను మించినవాడు లేడు
రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలో నటిస్తున్న షష్టిపూర్తి సినిమాకి ఇళయరాజా సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూ ఒకటి రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇంటర్వ్యూ కు సంబంధించిన ప్రోమోలో ఇళయరాజా మాటలు సంచలనంగా ఉన్నాయి. ఈ లోకంలో నన్ను మించిన మ్యూజిక్ డైరెక్టర్ ఇంకొకరు లేరు అంటూ చెప్పుకొచ్చారు. ఇంతకుముందు కూడా పుట్టలేదు. ఇకపై కూడా పుట్టరు అంటూ మాట్లాడారు ఇళయరాజా. ప్రస్తుతం ఈ కామెంట్స్ వింటున్న చాలామందికి ఇళయరాజా మీద ద్వేషం పుట్టుకొస్తుంది. ఎందుకంటే ఏ ఒక్కరితో కూడా ఈ సమాజం, సృష్టి, టాలెంట్ ఆగిపోదు. ఒకరు పోయిన తర్వాత మరొకరు పుడుతూనే తెలుగు సినిమా సంగీతాన్ని సినిమా పరిశ్రమను ముందుకు నడిపిస్తూనే ఉంటారు. మనము గొప్ప అనుకోవడంలో తప్పులేదు మనమే గొప్ప అనుకోవడమే తప్పు. దీనిని బట్టి ఇళయరాజా పాటలను విపరీతంగా విన్న శ్రోతలు కూడా రాజాపై కొద్దిపాటి ద్వేషాన్ని పెంచుకోవడం మొదలు పెడుతున్నారు.
Also Read : Janasena Atthi Satyanayana: నాకు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం… నన్ను దిల్ రాజు ఇరికించాడు