BigTV English

Gold Hunting: ఏపీలోని ఆ సముద్ర తీరంలో బంగారం.. తుఫాన్ టైమ్‌లోనే ఎందుకు?

Gold Hunting: ఏపీలోని ఆ సముద్ర తీరంలో బంగారం.. తుఫాన్ టైమ్‌లోనే ఎందుకు?

Gold Hunting: ఏపీలో వర్షాలు వరాలజల్లు కురిపిస్తున్నాయి. ఓ వైపు వజ్రాలు, బంగారం దొరుకుతోందన్న ప్రచారం ముమ్మరంగా సాగుతున్న వేళ రాయలసీమలో మాత్రం కాస్త సందడిగా ఉంది. అయితే ఇక్కడ కూడా అలాంటి తీరే కనిపిస్తోంది. ఇది కాస్త డిఫరెంట్ అయినప్పటికీ, ఏపీ ప్రజలు మాత్రం ఇప్పుడు ఇక్కడికి పరుగులు పెడుతున్నారు. దీని గురించి స్థానిక ప్రజలు వింతవింతగా చెప్పుకోవడం మరో విశేషం. ఇంతకు ఇక్కడి స్పెషాలిటీ ఏమిటి? అసలు ఇక్కడ దొరుకుతున్న అమూల్యమైన వస్తువులు ఏమిటి? ఇక్కడి ప్రజలు ఏమంటున్నారో తెలుసుకుందాం.


తుఫాన్ వస్తే బంగారమే..
ఎక్కడైనా తుఫాన్ వస్తే బంగారం బయటపడే పరిస్థితి మీకు తెలుసా.. కానీ ఇక్కడ మాత్రం తుఫాన్ వచ్చిందా.. ఇక వేట ఖాయం. వేట అంటే ఇదేదో చేపల వేట అనుకోవద్దు.. చేసేది తీరం వద్దనే అయినప్పటికీ, ఈ వేట వేరు. ఇక్కడ వేటాడితే బంగారం, వెండి, రాగి దొరకడం ఖాయమట. అందుకే ఇక్కడి ప్రజలకు తుఫాన్ వస్తే కాసుల పంటే.

అసలు విషయంలోకి వెళితే..
సాధారణంగా తుఫానులు తాకిన తర్వాత మత్స్యకారులు తమ పడవలను సరిచేసుకుని మళ్లీ చేపల వేటకు సిద్ధమవుతారు. కానీ ఏపీలోని కాకినాడ జిల్లా ఉప్పాడ గ్రామంలో మాత్రం ఒక ప్రత్యేక ఆచారం ఉంది. సముద్రం శాంతించిన వెంటనే మత్స్యకారులు పడవలో చేపల వేటకు వెళ్లకుండా, బీచ్‌లోని ఇసుకలో బంగారం కోసం జల్లెడ పట్టే దృశ్యం ఇక్కడ కనిపిస్తోంది. ఈ ప్రాచీన సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోందట. అందుకే ఇక్కడ సందడి కనిపిస్తోంది.


బంగారం కోసం ఇసుక జల్లెడ పట్టే ఆచారం
తుఫాను తరువాత సముద్రం వెనక్కి నెమ్మదిగా కదులుతుంది. అదే సమయంలో బీచ్ మీదికి కొత్తగా తవ్వబడిన ఇసుక వస్తుంది. ప్రజల నమ్మకం ఏమిటంటే, ఈ కొత్త ఇసుకలో బంగారు రేకులు, నగ్గెట్లు, పాత ఆభరణాలు దొరుకుతాయని కొందరు చెబుతుంటార. శతాబ్దాల క్రితం నుండి సముద్రంలో గల విలువైన వస్తువులు కొత్త ఇసుకలో కనిపిస్తాయని ఇక్కడి ప్రజల నమ్మకం. తాము చిన్నప్పటినుండి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నామని, ఇన్నేళ్లలో దాదాపు పదిసార్లు బంగారం, రాగి వస్తువులు దొరికాయని అక్కడి ప్రజలు అంటున్నారు.

ప్రతి తుఫాను తర్వాత మళ్లీ ప్రారంభమయ్యే వేట
తుఫాను శాంతించిన తర్వాత మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా బీచ్‌పై ఈ వేట మొదలుపెడతారు. ఒకప్పుడు సుమారు 300 మంది పురుషులు, మహిళలు జల్లెడ పట్టేవారట. కానీ ఇప్పుడు ఆ సంఖ్య తగ్గిపోయిందని, అయినా కొంతమంది ఇప్పటికీ నమ్మకంతో బంగారానికి వెతుకులాట చేస్తూనే ఉన్నారు. బీచ్ సందర్శనకు వచ్చిన పర్యాటకులు ఈ దృశ్యాన్ని ఆసక్తిగా చూస్తుంటారు. ఇసుకలో జల్లెడ పట్టే మహిళలు, మెరిసే వస్తువుల కోసం వెతుకుతున్న పురుషులు.. ఇలా ఒక ప్రత్యక్ష ప్రదర్శనలా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చెవిపోగులు, పాత నాణేలు, చిన్న నగ్గెట్లు దొరుకుతాయని స్థానికులు చెబుతున్నారు.

Also Read: Snake Trees: ఈ చెట్ల కింద కూర్చున్నారా? పైన పాము గ్యారంటీ.. తస్మాత్ జాగ్రత్త!

వ్యతిరేకత కూడా..
ఇంకొంతమంది గ్రామస్థులు మాత్రం ఈ ఆచారాన్ని వ్యతిరేకిస్తున్నారు. సముద్ర తీరంలో ఇసుక తవ్వడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని, ఇది గ్రామానికి దురదృష్టాన్ని తెస్తుందని నమ్ముతున్నారు. సముద్రాన్ని ఓ పవిత్ర శక్తిగా భావించే కొందరు, బంగారం కోసం తవ్వడం పుణ్యం కాదని హెచ్చరిస్తున్నారు.

వాస్తవం ఏమిటి?
సాధారణంగా తుఫానుల తరువాత సముద్రం లోతుల్లో ఉన్న వస్తువులు ఒడ్డున కొట్టుకురావడం సహజం. ఇదే సమయంలో కొన్ని పాత బంగారు నాణేలు, రాగి వస్తువులు కనిపించవచ్చు. కానీ పెద్ద ఎత్తున బంగారం దొరకడం మాత్రం అపోహే అని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ వేటలో వ్యక్తిగతంగా లాభపడే అవకాశం తక్కువే అయినా, కొంతమందికి ఇది ఆనందం, ఆశ, సంపద కలిగించే కలల వేటగా మారింది.

ఉప్పాడలో జీవితం..
ఉప్పాడ గ్రామం మత్స్యకార జీవనంతో నిండిన ఒక చిన్న గ్రామం. సముద్రం వారికి జీవనాధారం మాత్రమే కాదు, భవిష్యత్తు కూడా. తుఫాను తరువాత చేపల వేటకు ముందు బంగారం కోసం వేట చేయడం, అది ఆశ, భయం, భవిష్యత్తుపై నమ్మకం.. ఇవన్నీ కలిసిన ఒక విచిత్రమైన కదలిక. మొత్తం మీద ఇక్కడ ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ, పర్యాటకులు మాత్రం వీరు చేసే తవ్వకాలను చూసి తెగ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదిఏమైనా ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో చెప్పలేం అన్నట్లుగా, ఏ ఇసుక రేణువులో ఏముంటుందో చెప్పడం కష్టమే కదా. మీకు టైమ్ ఉంటే, ఓసారి ఇక్కడికి వెళ్లిరండి.. అదృష్టాన్ని పరీక్షించుకోండి.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×