E-Paper
Advertisement

Viral Video: పట్టాలపై షాకింగ్ ఘటన.. రైలు ఢీకొట్టకుండానే.. మహిళకు తీవ్రగాయాలు

Viral Video: పట్టాలపై షాకింగ్ ఘటన.. రైలు ఢీకొట్టకుండానే.. మహిళకు తీవ్రగాయాలు
Advertisement

Viral Video: బిహార్ లోని గయా జిల్లాలో ఆశ్చర్యకర రీతిలో ప్రమాదం చోటు చేసుకుంది. పహర్ పూర్ రైల్వే స్టేషన్ లో రైలు ప్రత్యక్షంగా ఢీకొట్టనప్పటికీ ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. రైలు వేగంగా ఢీకొట్టడంతో పట్టాల పక్కనే ఉన్న చెక్క దుంగ ఎగిరొచ్చి మహిళను బలంగా తాకింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వీడియోలో ఏముందంటే?

వైరల్ వీడియోను గమనిస్తే.. స్టేషన్ లోని రెండు రైల్వే ట్రాక్ లకు మధ్య ఉన్న ప్రదేశంలో పెద్ద ఎత్తున కట్టెలు పెట్టి ఉన్నాయి. ఈ క్రమంలో ఫ్లాట్ ఫామ్ మీద నుంచి పట్టాలపైకి వచ్చిన మహిళ.. అవతలి వైపున ఉన్న ఫ్టాట్ ఫామ్ మీదకు వెళ్లాలని భావించింది. ఈ క్రమంలో రెండో ఫ్లాట్ ఫామ్ మీద రైలు వెళ్తుండటంతో కొద్దిసేపు ట్రాకుల మధ్య ఉన్న గ్యాప్ లో నిలబడింది. తర్వాత ఆ రైలు వెళ్లిపోవడంతో బాధితురాలు ముందుకు కదిలింది.

Advertisement

ఒక్కసారిగా అంతా షాక్..

బాధితురాలు రెండో నెంబర్ ట్రాక్ గుండా ఫ్లాట్ ఫామ్ వద్దకు వెళ్తున్న క్రమంలోనే మెుదటి ట్రాక్ మీదకి రైలు దూసుకొచ్చింది. ఈ క్రమంలో ట్రాక్ కు ఆనుకొని చెక్క దుంగలు పెట్టడంతో రైలు వాటిని బలంగా ఢీకొట్టింది. దీంతో అందులోని ఒక దుంగ ఎగిరొచ్చి.. అవతలి ట్రాక్ మీద ఉన్న బాధితురాలిని బలంగా ఢీకొట్టింది. దీంతో  ఆమె అమాంతం గాల్లోకి ఎగిరి కిందపడిపోయింది. ఈ దృశ్యాలు చూసి స్టేషన్ లోని ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి తలకు బలమైన గాయం అయ్యిందని.. ప్రస్తుతం అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

Advertisement

Also Read: Drivers Strike: ప్రజలకు బిగ్ అలర్ట్.. రేపు ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్ల సమ్మె.. జాగ్రత్త పడకుంటే కష్టమే!

నెటిజన్ల స్పందన..

ప్రమాద వీడియోను చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విచిత్రమైన ప్రమాదాన్ని తామెప్పుడూ చూడలేదని పేర్కొంటున్నారు. రైల్వే ట్రాక్ మధ్యలో అలా దుంగలు పెట్టడాన్ని పలువురు ప్రశ్నించారు. రైల్వే సిబ్బంది అలా ఎలా వదిలేశారని నిలదీశారు. మరికొందరు మాత్రం ఈ ప్రమాదంలో మహిళ తప్పు కూడా ఉందని అభిప్రాయపడ్డారు. ఫ్లాట్ ఫామ్ వంతెనను వినియోగించకుండా నేరుగా పట్టాల మీద నుంచి దాటి వెళ్లడం ప్రమాదకరమని పేర్కొంటున్నారు.

Also Read: Viral Video: పార్సిల్ డెలివరీకి.. బైక్ బుక్ చేసిన మహిళ.. బాక్స్‌లోది చూసి అవాక్కైన రైడర్!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×