E-Paper
Advertisement

Viral Video: వైద్య అధికారి చిలక్కొట్టుడు.. మహిళా బంధువుల చితక్కొట్టుడు.. నెట్టింట వీడియో వైరల్!

Viral Video: వైద్య అధికారి చిలక్కొట్టుడు.. మహిళా బంధువుల చితక్కొట్టుడు.. నెట్టింట వీడియో వైరల్!
Advertisement

గత కొంతకాలంగా మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధిస్తున్న వైద్యాధికారిపై ఆమె కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఆయన కార్యాలయంలో కూర్చొని ఉండగానే వచ్చి పిచ్చి కొట్టుడు కొట్టారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాందేడ్‌ లో జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

కౌతా ప్రాంతంలోని మున్సిపల్ ఆసుపత్రిలోని ఒక వైద్య అధికారిని అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగిపై చాలా రోజులుగా వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని సదరు మహిళ తన కుటుంబ సభ్యులకు చెప్పింది. తాజాగా ఆమె కుటుంబ సభ్యులు ఆఫీస్ కు వెళ్లి ఆయనను నిలదీశారు. పద్దతి బాగా లేదని హెచ్చరించారు. వారి పట్ల సదరు అధికారి అడ్డగోలుగా మాట్లాడ్డంతో, ఆమె కుటుంబ సభ్యులు వీపు విమానం మోత మోగించారు. సదరు వైద్యుడు తన కార్యాలయంలో కూర్చుని ఉండగా, కొంత మంది పురుషులు, మరికొంత మంది మహిళలు ఆయన డెస్క్ చుట్టూ నిలబడి ఉన్నారు. ఓ మహిళ తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆరోపించింది. ఆమె పక్కనే ఉన్న ఓ వ్యక్తి.. అతడి చెంప చెల్లుమనిపించాడు. ఆ తర్వాత అందరూ కలిసి ఆయనను సీటు నుంచి పక్కకు లాగి చితక బాదారు. విపరీతంగా కొట్టారు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో

Advertisement

వాస్తవానికి ఈ ఘటన వారం రోజుల క్రితం జరిగింది. కానీ, తాజాగా ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ క్లిప్ వైరల్ అయిన తర్వాత, మహిళా ఫిర్యాదుల పరిష్కార కమిటీ ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో పరిశీలించింది. అదే సమయంలో సదరు మహిళా ఉద్యోగిని విచారించారు. ఆమె చెప్పిన విషయాలను రికార్డు చేసుకున్నారు. అటు వైద్య అధికారిని కూడా విచారించనున్నట్లు చెప్పారు. పూర్తి స్థాయిలో ఈ ఘటనపై విచారణ జరిపి..నివేదిక సిద్ధం అయిన తర్వాత, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెళ్లడించారు.

Advertisement

Read Also: ఒడిలో నిద్రిస్తున్న చిన్నారి మాయం.. 6 నెలలు తర్వాత ఊహించనిది జరిగింది, కన్నీళ్లు పెట్టించే ఘటన!

హైదరాబాద్  లేడీ అటెండర్ కిరాతం

అటు హైదరాబాద్‌లో  మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. నర్సరీ చదువుతున్న నాలుగేళ్ల బాలికపై.. ఆ స్కూల్  మహిళా అటెండర్ దారుణంగా దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది.  బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం బయటకు వచ్చింది. ఆన్‌లైన్‌లో వైరల్ అయిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో బాలికను కొట్టి నేలపైకి తోస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత సదరు మహిళా అటెండర్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: 300 టన్నుల బంగారంతో సొరంగంలోకి వెళ్లి మాయమైన రైలు, 80 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నారు!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×