Borecore Trend: సోషల్ మీడియా ప్రపంచంలో రోజుకో కొత్త ట్రెండ్ పుట్టుకొస్తూ ఉంటుంది. గ్లామర్, యాక్షన్, డ్రామా, కాంట్రవర్సీలు ఉంటేనే జనాలు చూస్తారనే నమ్మకాన్ని బద్దలు కొడుతూ.. ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది ‘బోర్‌కోర్’ (Borecore) అనే సరికొత్త కంటెంట్ జోనర్. చదవడానికి విడ్డూరంగా ఉన్నాప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది నెటిజన్లు ఈ సరికొత్త ట్రెండ్‌కు బానిసలవుతున్నారు. ఏమాత్రం హడావుడి లేకుండా, అత్యంత బోరింగ్ విషయాలను షేర్ చేస్తూ ఒక వ్యక్తి ఇప్పుడు గ్లోబల్ సెలబ్రిటీగా మారిపోయాడు.
సాధారణంగా రీల్స్, షార్ట్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, డ్యాన్స్‌లు, పడరాని పాట్లు చూసి బోర్ కొట్టిన నెటిజన్లకు ఈ బోర్‌కోర్ ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తోంది. రోజూ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం చేసే అత్యంత సాధారణ పనులను ఎలాంటి ఎడిటింగ్, ఫిల్టర్లు లేకుండా చూపించడమే ఈ కంటెంట్ ముఖ్య ఉద్దేశం. ఉదాహరణకు.. గోడకు వేసిన పెయింట్ ఎలా ఆరుతోంది? పంపు నుంచి నీటి చుక్కలు ఎలా పడుతున్నాయి? గడియారం ముల్లు ఎలా తిరుగుతోంది? లాంటి పరమ బోరింగ్ విషయాలను గంటల తరబడి రికార్డ్ చేసి వదులుతున్నారు. వినడానికి వింతగా ఉన్నా నెటిజన్లు వీటికి బ్రహ్మరథం పడుతున్నారు.
ఈ సరికొత్త కంటెంట్ కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాడు ఒక విలక్షణ క్రియేటర్. అతను తన కంటెంట్‌ను సాధారణ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కాకుండా, ప్రత్యేకంగా ఈ తరహా కంటెంట్ కోసమే డిజైన్ చేయబడిన ‘లోన్లీఫ్యాన్స్’ (LonelyFans) అనే ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేస్తున్నాడు. ప్రపంచంలో బోర్ కొట్టే విషయాలను, ముచ్చట్లను వినడానికి ఇష్టపడే ‘డల్ అండ్ బోర్ లవర్స్’ అంతా ఈ ప్లాట్‌ఫామ్‌లో మెంబర్స్ కావడం విశేషం. అతను లైవ్‌లోకి వచ్చి కేవలం ఒక తెల్లటి కాగితం వైపు గంటల తరబడి చూస్తూ కూర్చున్నా, లేదా పాత కాలపు రేడియోలో వచ్చే ‘ఖస్సు ఖస్సు’ శబ్దాలను రికార్డ్ చేసి వినిపించినా.. లక్షల మంది లైవ్‌లో వాచ్ చేస్తూ కనెక్ట్ అవుతున్నారు.
ఈ క్రేజీ ట్రెండ్ ఇంతలా వైరల్ కావడానికి ప్రధాన కారణం ‘డిజిటల్ డిటాక్స్’ అని సైకాలజిస్టులు చెబుతున్నారు. రోజంతా ఇంటర్నెట్‌లో వేగంగా మారిపోయే కంటెంట్, లౌడ్ మ్యూజిక్ చూసి అలసిపోయిన మైండ్‌కు ఈ బోరింగ్ కంటెంట్ ఒక మెడిటేషన్‌లా పనిచేస్తోంది. ఏ విధమైన కలరింగ్, బిల్డప్ లేకపోవడమే ఇందులో ఉన్న అసలైన మ్యాజిక్. యాంగ్జైటీ, స్ట్రెస్‌తో బాధపడే నేటి జనరేషన్‌కు ఈ ‘బోర్‌కోర్’ కంటెంట్ ఒక థెరపీలా ఉపయోగపడుతోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ స్పీడ్‌కు భిన్నంగా సాగే ఈ లైఫ్ స్టైల్ కంటెంట్ భవిష్యత్తులో డిజిటల్ మీడియాను ఏలడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి ‘బోరింగ్’ అనే పదానికి కొత్త డెఫినేషన్ ఇస్తూ, దాన్నే ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్ మోడల్‌గా మార్చేసిన ఈ క్రియేటర్ ఐడియాకు హాట్సాఫ్ చెప్పాల్సిందే!