Mohammad Amir Linked With Ambani-Owned MI London : ది హండ్రెడ్ లీగ్ 2026 టోర్నమెంట్ (The HUNDRED League 2026 Tournament) నేపథ్యంలో సన్ రైజర్స్ లీడ్స్ ఓనర్ కావ్య పాప (Kavya Maran) చేసిన తప్పే.. ఇప్పుడు అంబానీ ఫ్యామిలీ (Ambani) కూడా చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్లేయర్లను కొనుగోలు చేయకూడదని పదేపదే ఇండియన్ ఫ్యాన్స్ మొత్తుకున్నప్పటికీ.. వీళ్లు మాత్రం వినడం లేదంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ది 100 లీగ్ టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేయగా… తాజాగా మరో పాకిస్తాన్ ఆటగాడిని అంబానీ ఫ్యామిలీ కొనుగోలు చేసింది. ఇటీవల బ్రిటిష్ పౌరసత్వం అందుకున్న మహమ్మద్ అమీర్ ను (Pakistan fast bowler Mohammad Amir) ముంబై యాజమాన్యం (MI London ) కొనుగోలు చేసినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో అంబానీ ఫ్యామిలీ పై కూడా దేశద్రోహి ముద్ర వేస్తున్నారు క్రికెట్ అభిమానులు.
ది హండ్రెడ్ లీగ్ టోర్నమెంట్ నేపథ్యంలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో రిలయన్స్ గ్రూప్ నకు సంబంధించిన ముంబై ఇండియన్స్ లండన్ జట్టు కూడా ఉంది. దీనిని అంబానీనే డీల్ చేస్తున్నారు. అటు కావ్య పాపకు సంబంధించిన సన్ రైజర్స్ లీడ్స్ ఉన్న సంగతి తెలిసిందే. లక్నో ఓనర్ సంజీవ్ కూడా మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ జట్టును నడిపిస్తున్నారు. ఇలా మొత్తం మూడు ఇండియాకు సంబంధించిన జట్లే ది 100 లీగ్ టోర్నమెంటులో కొనసాగుతున్నాయి. ఇలాంటి క్రమంలో మొన్న జరిగిన వేలం సందర్భంగా పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేశారు కావ్య పాప. దీంతో కావ్య పాపపై దేశద్రోహి ముద్రవేశారు ఇండియన్ ఫ్యాన్స్. బీసీసీఐ రూల్స్ ప్రకారం ఐపిఎల్ టోర్నమెంట్ లో మాత్రమే పాకిస్తాన్ ప్లేయర్లను తీసుకోకూడదు. ఆ ఒక్క లూప్ హోల్ ను పట్టుకున్న కావ్య పాప.. అబ్రార్ అహ్మద్ ను ఏరి కోరి కొనేసింది.
దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు అదే తప్పిదాన్ని రిలయన్స్ గ్రూప్ అంబానీ కూడా చేశాడు. ఇటీవల బ్రిటిష్ పౌరసత్వాన్ని అందుకున్న మహమ్మద్ అమీర్ ను MI లండన్ జట్టులోకి తీసుకున్నారు. మొన్నటి వరకు పాకిస్తాన్ దేశస్థుడుగా ఉన్న అతడు… బ్రిటన్ పౌరసత్వాన్ని అందుకున్నాడు. దీంతో పాకిస్తాన్ దేశంతో అతనికి సంబంధాలు తెగిపోయాయి. ఈ లెక్క ప్రకారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో కూడా మహమ్మద్ అమీర్ ఆడే అవకాశం ఉంటుంది. దాన్ని ఆసరాగా చేసుకున్న అంబానీ… ఇప్పుడు ది 100 లీగ్ టోర్నమెంట్ నేపథ్యంలో తమ జట్టు కోసం కొనుగోలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది.