E-Paper
Advertisement

నదిలోకి దిగి మొసలి పళ్లు తోమిన బాలుడు.. నీ గుండెకు ఓ దండం రా అయ్యా!

నదిలోకి దిగి మొసలి పళ్లు తోమిన బాలుడు.. నీ గుండెకు ఓ దండం రా అయ్యా!
Advertisement

Unbelievable Moment:  సోషల్ మీడియాలో ఇటీవల ఓ వీడియో అందరినీ షాక్ కు గురి చేస్తుంది. ఓ బాలుడు ఎలాంటి భయం లేకుండా నదిలోకి వెళ్లి బ్రష్ తో ఓ మొసలి పళ్లు తోమడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ అసలు ఏం జరిగిందటే..

వైరల్ అవుతున్న వీడియోలో ఏం ఉందంటే?

కొలంబియాకు చెందిన హిమర్ అనే బాలుడు, తన చేతిలో టూత్‌ బ్రష్ పట్టుకుని నదిలో ఉన్న ఒక మొసలి పళ్లను శుభ్రం చేస్తూ కనిపిస్తున్నాడు. సాధారణంగా మొసళ్లు చాలా ప్రమాదకరమైన జంతువులు. అవి మనుషులకు దగ్గరగా రావడమే కాకుండా, దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న పిల్లవాడు మొసలికి అంత దగ్గరగా వెళ్లి, అది నోరు తెరిచి ఉండగా పళ్లను తోమడం చూడటం చాలా అరుదైన విషయం.

Advertisement

ఈ వైరల్ వీడియోలో బాలుడు మొసలిని పిలుస్తూ నెమ్మదిగా నీళ్లలోకి దిగుతాడు. కాసేపట్లోనే మొసలి ఆ బాలుడి దగ్గరికి వస్తుంది. అతడు ఎలాంటి భయం లేకుండా, బ్రష్‌ తో మొసలి పళ్లను నెమ్మదిగా శుభ్రం చేస్తాడు. ఆ మొసలి కూడా ప్రశాంతంగా ఉండి అతనికి సహకరిస్తున్నట్టు కనిపిస్తుంది. మరో ఈ తతంగాన్ని అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోను చూసి నెటిజన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా జంతువుల స్వభావం ఇలా ఉండదు కాబట్టి, ఈ సీన్ మరింత విచిత్రంగా అనిపిస్తోంది.

ఈ వీడియోను చూసి నెటిజన్స్ ఏమంటున్నారంటే?

Advertisement

ఈ వీడియోపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ బాలుడు చిన్నప్పటి నుంచి ఆ మొసలితో స్నేహం చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. అందుకే, అది అతడికి ఎలాంటి హాని తలపెట్టలేదంటున్నారు. మరికొందరు అయితే ఇది చాలా ప్రమాదకరమైన పని, ఇలా చేయడం సరికాదని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

నిపుణుల హెచ్చరికలు

ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగాకనిపిస్తాయి. మనుషులు, క్రూర జంతువుల మధ్య ఇంతటి నమ్మకం, స్నేహం కనిపించడం చాలా అరుదైన విషయం. అయితే, ఇలాంటి ప్రయత్నాలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే జంతువుల ప్రవర్తన ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం అంటున్నారు. మొత్తంగా హిమర్ అనే ఈ బాలుడి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. నెటిజన్లలో పెద్ద చర్చకు దారితీస్తోంది.

Read Also: వెహికల్ మీద కులం పేరు రాస్తున్నారా? అయితే, ఇక దబిడి దిబిడే!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×