E-Paper
Advertisement

Garuda Purana Part 06: యమలోక ప్రయాణంలో ఆత్మ చేరుకునే ఆరో పట్టణం క్రౌంచపురం –  ఆత్మ ప్రయాణం అత్యంత కఠినం, వేదనాభరితమట

Garuda Purana Part 06: యమలోక ప్రయాణంలో ఆత్మ చేరుకునే ఆరో పట్టణం క్రౌంచపురం –  ఆత్మ ప్రయాణం అత్యంత కఠినం, వేదనాభరితమట
Advertisement

Garuda Purana Part 06: నరకలోక ప్రయాణంలో ఆత్మ చేరుకునే ఆరో పట్టణం క్రౌంచపురమట. ఇక్కడి నుంచి ఆత్మ ప్రయాణం అత్యంత కఠినంగానూ.. మరియే వేదనాభరితంగానూ సాగుతుందట. ఆత్మ క్రౌంచపురానికి చేరుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది. ఎలాంటి బాధలు అనుభవిస్తుంది.. క్రౌంచపురలో అనుభవించే శిక్షలు ఎలా ఉంటాయి లాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం, ముఖ్యంగా గరుడ పురాణంలో వివరించిన విధంగా జీవుడు తన మరణానంతరం యమలోకానికి చేసే ప్రయాణంలో క్రౌంచపురం ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ ప్రయాణం అత్యంత కఠినంగా, వేదనాభరితంగా సాగుతుందని గరుడపురాణంలో చెప్పబడిందట.

Advertisement

ఆత్మ ఎన్ని రోజుల్లో క్రౌంచపురం చేరుకుంటుంది:  మరణించిన తర్వాత ఆత్మ తన యమలోక ప్రయాణాన్ని ప్రారంభించిన ఆరో నెలలో (దాదాపు 170 నుండి 180 రోజుల మధ్య) క్రౌంచపురాన్ని చేరుకుంటుందట. అంతకుముందు  శైలాగమం  అనే నగరాన్ని దాటి ఆత్మ ఇక్కడికి వస్తుందట.

క్రౌంచపురానికి ఎలా చేసుకుంటుంది: యమదూతలు ఆత్మను పాశాలతో బంధించి, విరామం లేకుండా తీసుకువెళ్తారు. ఆత్మ తన పాప పుణ్యాల భారంతో, ఆకలి దప్పులతో అలమటిస్తూ, వారు పెట్టే హింసలను భరిస్తూ నడవాల్సి ఉంటుందట. క్రౌంచపురానికి చేరుకునే మార్గం అత్యంత భయంకరంగా ఉంటుందట.. ఆత్మ తీవ్రమైన అలసటతో అల్లాడిపోతుందట.  ఆత్మ అత్యంత ఆకలి, దాహంతో నీరసించిపోతుందట. విశ్రాంతి తీసుకోవడానికి వీలులేకుండా యమదూతలు కొడుతూనే ఉంటారట. ఈ సమయంలో ఆత్మ మానసికంగా ఎంతో వేదన అనుభవిస్తుందట. భూలోకంలో ఉన్న తన బంధువులను, ఇంటిని గుర్తు చేసుకుంటూ ఆత్మ విలపిస్తుందట. తన వారు పెట్టే ‘మాసిక శ్రాద్ధం’ (నెలవారీ పిండం) వల్ల వచ్చే శక్తితోనే ఆత్మ ముందుకు కదలగలుగుతుందట. ఒకవేళ ఆ కర్మలు సరిగ్గా జరగకపోతే, ఆకలి బాధ వర్ణనాతీతం అవుతుందట. ఒకవైపు ఆకలి బాధలు మరోవైపు యమదూతల హింస తట్టుకోలేక ఆత్మ అల్లాడిపోతుందట. దారి పొడవునా యమదూతలు ఆత్మను భయపెడుతూ త్వరితగతిన నడవమని హింసిస్తుంటారట.

Advertisement

క్రౌంచపురంలో ఆత్మ అనుభవించే శిక్షలు: క్రౌంచపురానికి చేరుకున్న తర్వాత ఆత్మ తీవ్రమైన భీతికి లోనవుతుందట. భయంకరమైన గందరగోళంలో పడిపోతుందట. అక్కడకు చేరుకోగానే ఆత్మకు ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితి ఏర్పడుతుందట. ఈ నగరంలో ఆత్మను భయంకరమైన ఆయుధాలతో హింసిస్తారని, అక్కడ ఉండే శక్తులు ఆత్మను పీడిస్తాయని గరుడపురాణంలో చెప్పబడిందట. ఈ దశలో ఆత్మకు విపరీతమైన భయం కలుగుతుంది. ఇక్కడి శిక్షలు ఆత్మను మానసికంగా మరియు సూక్ష్మ రూపంలో శారీరకంగా కుంగదీస్తాయట.

NOTE: ఇక ఆత్మ తన యమలోక ప్రయాణంలో  ఏడవ  పట్టణమైన క్రూరపురానికి ఎలా చేరుకుంటుంది. ఎన్ని కష్టాలు, బాధలు అనుభవిస్తుంది. అక్కడ ఆత్మకు విధించే భయంకరమైన శిక్షలు ఏంటి..? అనే విషయాలు రేపటి కథనంలో తెలుసుకుందాం.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: నరకలోయ ప్రయాణంలో ఆత్మ చేరుకునే ఐదవ పట్టణం శైలాగమం – ఆత్మకు అసలైన నరకం ఇక్కడే కనిపిస్తుందట

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×