BigTV English

Telangana : కాసేపట్లో ముహూర్తం.. పెళ్లికొడుకు జంప్.. మరో యువతితో..

Telangana : కాసేపట్లో ముహూర్తం.. పెళ్లికొడుకు జంప్.. మరో యువతితో..

Telangana : పెళ్లి పనులన్నీ పూర్తయ్యాయి. ఫంక్షన్ హాల్‌లో అరేంజ్‌మెంట్స్ అన్నీ రెడీ అయ్యాయి. మండపం డెకరేషన్ ధూంధాంగా చేశారు. కుర్చీలు గట్రా భారీగా వేశారు. వంటవాళ్లు విందు భోజనం రెడీ చేస్తున్నారు. అయ్యవార్లు, సన్నాయి మేళం.. అంతా పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. దూర ప్రాంతాల నుంచి బంధువులు, స్నేహితులు తరలివచ్చారు. పెళ్లి సమయం దగ్గర పడుతోంది. వధువు తరఫు వాళ్లంతా కల్యాణ మండపానికి వచ్చేశారు. కానీ.. పెళ్లి కొడుకు తరఫు వాళ్లు ఎవరూ ఇంకా రాలేదు. అరే, లేట్ అవుతోందేనని పెళ్లి వాళ్లు టెన్షన్ పడుతున్నారు. ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. అటునుంచి నో రెస్పాన్స్.


పెళ్లికొడుకు జంప్

మరికాసేపట్లో ముహూర్తం ఉండగా.. అప్పటికీ రాకపోయే సరికి డౌట్ వచ్చింది. అసలేమైందో అని పెళ్లికొడుకు ఊరికెళ్లి వివరాలు కనుక్కున్నారు కొందరు. అంతే. అంతా షాక్. అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. పెళ్లికొడుకు ముందురోజే మరో యువతితో జంప్. ఆమెను హడావుడిగా పెళ్లి కూడా చేసేసుకున్నాడట. ఆ ఫోటోలు చూపించే సరికి మైండ్ బ్లాక్.


సాఫ్ట్‌వేర్ వాళ్లను నమ్మొచ్చా?

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన మధుకర్ రెడ్డి హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు. అబ్బాయి చూట్టానికి బాగున్నాడు. మంచి జీతం కూడా ఉంది. ఫ్యామిలీ కూడా మంచిదే. తమ అమ్మాయికి తగిన వరుడు ఇతనేనని పెళ్లి కుదుర్చుకున్నారు. కట్నకానుకలూ బాగానే మాట్లాడుకున్నారు. 20 గుంటల భూమి, 10 లక్షల బంగారం, 6 లక్షలు క్యాష్ ఇచ్చేందుకు వధువు కుటుంబం ఓకే చెప్పింది. లగ్గంకోటు, ఎంగేజ్‌మెంట్, పసుపు కొట్టుడు, పెళ్లికూతుర్ని చేయడం గట్రా పెళ్లితంతు అంతా సరదాగా పూర్తి చేశారు. శుభలేఖలు అందరికీ పంచారు. మే 16న పెళ్లి. ఉదయం ఫంక్షన్ హాల్‌లో పెళ్లి కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ, పెళ్లికి డుమ్మా కొట్టాడు వరుడు మధుకర్‌రెడ్డి.

మరో యువతితో పెళ్లి..

మే 15నే అతను మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. లవ్ మ్యారేజో, ఎఫైరో, బెదిరించారో, ఇంకో పెళ్లో.. రీజన్ ఏదైనా కానీ.. పీటల మీద పెళ్లి ఆగిపోయేలా అన్యాయం చేశాడు. ఆ వధువుకు తీరని అన్యాయం చేశాడు. ఈ పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి. తాను ఈ పెళ్లి చేసుకోనని పద్దతిగా నచ్చజెప్పాలి. వినకపోతే కాళ్లు పట్టుకుని వేడుకోవాలి. తిడితే పడాలి. కొడితే కొట్టించుకోవాలి. అంతేకానీ, పీటల మీద పెళ్లికి రాకుండా పరారై ఆ అమ్మాయి జీవితంగా ఆడుకున్నాడు మధుకర్‌రెడ్డి. చేసేది లేక.. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు వధువు తరఫు వాళ్లు. అటు, వరుడి పేరెంట్స్ ఇంటికి తాళం వేసి ఎక్కడికో పారిపోయారు.

Related News

Himachal Pradesh News: మేనల్లుడుతో మేనత్త ఓయోలో కస్సమిస్సా.. ట్విస్ట్ ఏంటంటే..

Dinosaur Condom: డైనోసార్ కండోమ్.. రాయిని బద్దలకొడితే ఇది బయటపడింది, సైజ్ ఏంటీ సామి అంత ఉంది?

Viral video: రీల్స్ కోసం రైల్వే ట్రాక్‌పై రిస్క్ చేసిన దంపతులు.. దూసుకొచ్చిన వందే భారత్!

Woman Sprays Pepper: ప్రయాణికుల కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టిన మహిళ.. అలా ఎందుకు చేసిందంటే?

Viral News: బాల భీముడు మళ్లీ పుట్టాడు, బరువు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Software Engineer Journey: సెక్యూరిటీ గార్డ్ To సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్.. ఆకట్టుకునే జోహో ఎంప్లాయీ సక్సెస్ స్టోరీ!

Viral News: ఎంతకొట్టినా చావడం లేదని.. నోటితో కొరికి పాముని చంపేశాడు, వింత ఘటన ఎక్కడ?

Nose Drinks Beer: ఓరి మీ దుంపలు తెగ.. ముక్కుతో బీరు తాగడం ఏంటి?

Big Stories

×