Assam: ట్రెండ్ మారింది.. హంగులు ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉన్నతవర్గాల వ్యక్తుల పుట్టినరోజు వేడుకలంటే చాలా సీక్రెట్‌గా జరిగేవి. దానికి కొంతమంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా గౌహతికి చెందిన ఓ వ్యాపారవేత్త ఫ్లైఓవర్‌పై తన భార్య పుట్టినరోజు వేడుకలను నిర్వహించి చిక్కుల్లో పడ్డాడు.
ఫ్లైఓవర్‌పై భార్యకు బర్త్‌డే పార్టీ వేడుకలు
గౌహతికి చెందిన ఓ వ్యాపారవేత్త కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌పై తన భార్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకులకు సంబంధించి వీడియో వైరల్ అయ్యింది. చివరకు పోలీసుల దృష్టికి వెళ్లింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు, వ్యాపారవేత్తతోపాటు మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.
కుమార్ భాస్కర్ వర్మ సేతు ఫ్లైఓవర్ ఇటీవల ఓపెన్ అయ్యింది. ఇది గౌహతి-ఉత్తర గౌహతిలను అనుసంధానం చేస్తోంది. మూడు రోజుల కిందట జూన్ 21 అర్ధరాత్రి ఊహించని ఘటన జరిగింది. గౌహతికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ బారువా తన భార్య పుట్టినరోజు వేడుకల కోసం ఫ్లైఓవర్‌పై ఘనంగా చేశారు.
అడ్డంగా బుక్కైన బిజినెస్‌మేన్, మరో 13 మంది అరెస్ట్
అక్కడ రెడ్ కార్పెట్ పరిచి, బెలూన్లు, ఇతర అలంకరణలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అంతేకాదు విలాసవంతమైన కార్లను వంతెనపై పెట్టారు. ఈ పార్టీ నేపథ్యంలో ఇతర వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అర్ధరాత్రి వేళ పార్టీ కావడంతో పోలీసులకు సమాచారం లేదు. వేడుకలకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి.
అలర్టయిన పోలీసులు ప్రజా జీవనానికి ఆటంకం కలిగించడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో వ్యాపారవేత్త గౌతమ్ బారువాతోపాటు దాదాపు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు, ఆ తర్వాత వారిని విడివిడిగా విచారించారు. వేడుకకు లగ్జరీ కార్లను ఉపయోగించారు. డిఫెండర్, మెర్సిడెస్, స్కార్పియో, హోండా సిటీ అనే నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ALSO READ: యూకేలో విచిత్రం.. మగాళ్ల నుంచి పాలు, నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
సోషల్ మీడియా వీడియో చూసే వరకు పుట్టినరోజు వేడుకల గురించి ఎలాంటి సమాచారం లేదని ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జయంత సారథి బోరా తెలిపారు.జూన్ 21, 22 మధ్య అర్ధరాత్రి కుమార భాస్కర్ వర్మ సేతుపై తన భార్య 42వ పుట్టినరోజును జరుపుకున్నట్లు తెలిసిందన్నారు. ప్రజా రవాణా కోసం నిర్మించిన ఫ్లైఓవర్‌ను వ్యక్తిగత వేడుకలకు వినియోగించడంపై విమర్శలు తీవ్రమయ్యాయి.
ప్రజా భద్రతకు ముప్పు కలిగించడమేనని, పౌర క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు నెటిజన్లు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో కుమార భాస్కర్ వర్మ సేతును ప్రారంభించారు. సుమారు రూ. 3,030 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. 6 లేన్ల ఎక్స్‌ట్రా డోస్డ్ ప్రీస్ట్రెస్డ్ కాంక్రీట్ వంతెన గౌహతి-ఉత్తర గౌహతితో కలుపుతుంది. ఈశాన్య భారత్‌లో ఇదే మొట్టమొదటి ఎక్స్‌ట్రా డోస్డ్ వంతెన.
Red Carpet Birthday Party on Flyover | ಫ್ಲೈಓವರ್ ಮೇಲೆ ರೆಡ್ ಕಾರ್ಪೆಟ್ ಹಾಸಿ
ಹೆಂಡತಿಯ ಬರ್ತ್ಡೇ ಆಚರಣೆ
.
.
.
.#Guwahati #FlyoverBirthday #AssamPolitics #GautamBaruah #ViralVideo #TrafficViolation #BreakingNews #KannadaNews pic.twitter.com/df4DcnAZSD— Sanjevani News (@sanjevaniNews) June 23, 2026