E-Paper
Advertisement

హైదరాబాద్‌వాసులకు బిగ్ అలర్ట్.. నేడు-రేపు ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రోడ్లు పూర్తిగా క్లోజ్!

హైదరాబాద్‌వాసులకు బిగ్ అలర్ట్.. నేడు-రేపు ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రోడ్లు పూర్తిగా క్లోజ్!
Advertisement

Hyderabad City: హైదరాబాద్‌వాసులకు బిగ్ అలర్ట్. బోనాలు పండుగ సందర్భంగా ఆది, సోమవారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఆ ఈ రెండురోజులు ఆ ప్రాంతాల్లో రహదారులను క్లోజ్ చేయనున్నారు. ఈ విషయంలో ప్రజలు సహకరించాలని పోలీసులు ఓ ప్రకటకలో కోరారు. ఇంతకీ ఏయే ప్రాంతాలు తెలుసా?

 

హైదరాబాద్‌వాసులకు బిగ్ అలర్ట్

Advertisement

 

ఆషాడమాసం మాసం వేళ హైదరాబాద్‌లో బోనాలు ఫెస్టివల్ అంతరంగ వైభవంగా జరుగుతోంది. వీకెండ్ వస్తే చాలు వివిధ పండగ శోభ సంతరించుకుంటింది. తాజాగా బోనాల పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసుుల. ఆదివారం-సోమవారం ఈ రెండు రోజుల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని ఓ ప్రకటనలో వెల్లడించారు.

Advertisement

లాల్ దర్వాజా, దర్బార్ మైసమ్మ, కార్వాన్ బోనాల పండుగ నేపథ్యంలో పలుచోట్ల ఆంక్షలు విధించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. పాతబస్తీలో శ్రీ మహంకాళి‌లాల్ దర్వాజా బోనాల నేపథ్యంలో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ఊరేగింపు ముగిసేవరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.

 

బోనాలు పండుగ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

 

ఇంజిన్ బౌలి-ఫలక్‌నుమా వైపు నుండి వచ్చే వాహనాలను ఆలియాబాద్ వైపు అనుమతించరు. కొత్త షంషేర్‌గంజ్ T జంక్షన్ వద్ద గోశాల, తాడ్‌బన్ లేకుంటే గోశాల మిస్రీగంజ్, ఖిల్వత్ వైపు మళ్లించనున్నారు. మహబూబ్‌నగర్ ఎక్స్ రోడ్ నుంచి ఆలియాబాద్ వైపు వచ్చే వాహనాలను ఇంజిన్ బౌలి వద్ద జహానుమా, గోశాల, తాడ్‌బన్ లేదా ఖిల్వత్ వైపు మళ్లిస్తారు. బాలాగంజ్ నుండి లాల్ దర్వాజా ఆలయం వైపు వచ్చే వాహనాలను లక్ష్మీదేవి పాన్ షాప్ వద్ద నెహ్రూ స్టాచ్యూ నాగుల్ చింతా జంక్షన్ వైపు మీదుగా వెళ్లనున్నాయి.

 

ఆదివారం ఉదయం నుంచి సోమవారం వరకు ట్రాఫిక్ డైవర్ట్

 

గౌలీపురా నుంచి లాల్ దర్వాజా వైపు వచ్చే వాహనదారులను సుధా టాకీస్ వద్ద హరిబౌలి మీదుగా మీర్‌చౌక్ వైపు మళ్లిస్తారు. చార్మినార్-నాగుల్ చింతా వైపు వచ్చే వాహనాలను హరిబౌలి, వోల్గా హోటల్, మిస్రీగంజ్ వైపు అనుమతిస్తారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 9 వరకు ట్రాఫిక్​ ఆంక్షలు అమలులో ఉంటాయి. పురానాపూల్ జంక్షన్ నుండి జియాగూడ రోడ్డు మీదుగా వెళ్లే RTC బస్సులు.. పురానాపూల్ జంక్షన్ వద్ద మళ్లిస్తారు. యాదవ్ భవన్ నుండి కార్వాన్ రోడ్డు మీదుగా దర్బార్ మైసమ్మ ఆలయం వైపు వెళ్లే వాహనాలను ముర్గి చౌక్, తల్లాగడ్డ జంక్షన్ వద్ద మళ్లించారు.

ALSO READ: యువతకు కాంగ్రెస్ ఇచ్చిన గిఫ్ట్ ఇదేనా.. సర్కార్ పై రాంచందర్ రావు ఫైర్!

అంబర్‌పేట్ మహంకాళి ఆలయంలో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. పండగ నేపథ్యంలో ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్​ మళ్లిస్తారు. ఉప్పల్ నుంచి చాదర్‌ఘాట్, MGBS వైపు వెళ్లే జిల్లా బస్సులను అంబర్‌పేట్ ఫ్లైఓవర్ మీదుగా అనుమతిస్తారు. రామంతాపూర్ వైపు నుండి ఆలయానికి వెళ్లే భక్తులు అంబర్‌పేట్ ఫ్లైఓవర్ వద్ద ఎడమ బైలేన్ మీదుగా గాంధీ విగ్రహం వైపు వాహనాలు వెళ్లనున్నాయి.

 

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×