E-Paper
Advertisement

Temple Hundi: దేవుడి హుండీలో ప్రేమలేఖలు, ఇదెక్కడి వింతరా మావా?

Temple Hundi:  దేవుడి హుండీలో ప్రేమలేఖలు, ఇదెక్కడి వింతరా మావా?
Advertisement

“పద్మా.. నువ్వు మళ్లీ రా పెళ్లి చేసుకుంటా”.. “నేను ప్రేమించిన అమ్మాయి పేరెంట్స్ కు మంచి బుద్ధిని ఇవ్వు. నాతో పెళ్లి జరిపించేలా చూడు”.. “నా కొడుకు బాగా చదవుకోవాలి. మంచి ఉద్యోగం సంపాదించాలి”.. ఇవి ఆటో వెనుక కొటేషన్లు, దసరా పండుగ రోజు జమ్మి చెట్టు మీద రాసి ఉంచే కోరిక చిట్టా కాదు. ఓ ఆలయం హుండీలో భక్తులు వేసిన విన్నపాల తాలూకు రాతలు. ఒకరిది ప్రేమ కోసం పాకులాట అయితే, మరొకరిది పిల్లలు ప్రయోజకులు కావాలనే ఆరాటం. తాజాగా హుండీ లెక్కింపు సందర్భంగా ఈ కోరికల పత్రాలు చూసి ఆలయ అధికారులు షాకయ్యారు. ప్రస్తుతం ఈ లేఖలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ లేఖలు ఏ ఆలయంలో దొరికాయంటే?

సాధారణంగా భక్తులు తమ తమ బాధలు చెప్పుకొని, వాటి నుంచి గట్టెక్కించాలని దేవుడిని వేడుకుంటారు. కోరికలు నెరవేరిన భక్తులు స్వామివారికి కానుకలు సమర్పిస్తారు. హుండీలో కొందరు డబ్బులు వేస్తే, మరికొందరు వెండి, ఇంకొందరు బంగారం సమర్పిస్తారు. తాజాగా కర్నాటక చిక్కబళ్లాపుర తాలూకా నంది గ్రామంలోని చారిత్రాత్మక శ్రీ భోగనందీశ్వర ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డబ్బులు, వెండి, బంగారంతో పాటు వింత కోరికలతో కూడిన చిట్టీలు దొరికాయి. ఒకరు తమ ప్రేమ గెలవాలని స్వామి వారికి విన్నవించుకుంటే, ఒకరు తమ భర్తకు మంచి ఉద్యోగం రావాలని కోరుకున్నారు. ఇంకొకరు తమ కొడుకు బాగా చదివి ఉద్యోగం సాధించాలని వేడుకున్నారు.

దేవుని హుండీలో ప్రేమలేఖలు

Advertisement

శ్రీ భోగనందీశ్వర ఆలయాన్ని ప్రేమికులు ఎక్కువగా ఇష్టపడుతారు. పక్కనే నంది కొండ ఉంటుంది. కొండ కింద ఈ ఆలయం ఈ ఆలయ ప్రాంగణంలో హుండీ ఉంటుంది. తాజాగా దీని లెక్కింపు చేపట్టారు. ఈ సందర్భంగా ఆసక్తికర కోరికలతో కూడిన లేఖలు బయటకు వచ్చాయి. ప్రేమికుల ఫోటో కూడా కనిపించింది. దాని వెనుక..”పద్మా, మళ్ళీ తిరిగి రా.. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను” అని ఆ ఫోటో వెనుక రాశారు. మరో యువకుడు “స్వామీ.. నేను ప్రేమిస్తున్న అమ్మాయి తల్లిదండ్రుల మనసు మారేలా చూడు. మా పెళ్లికి  మనస్ఫూర్తిగా ఒప్పుకునేలా చేయండి” అని వేడుకున్నాడు.

నా భర్తకు మంచి ఉద్యోగం రావాలి!

అటు హుండీలో దొరికిన మరో లేఖ.. ప్రేమ గురించి కాకుండా.. ఒక వివాహిత రాసినట్లుగా ఉంది. ఆ లేఖలో ఆమె తన కొడుకు బాగా చదువుకోవాలని, మంచి ఇంజినీర్ కావాలని కోరుకుంది. ఇంకో మహిళ తన భర్తకు మంచి ఉద్యోగం రావాలని కోరుకుంది. చక్కగా డబ్బులు సంపాదించి, పెద్ద ఇల్లు కట్టుకోవాలని కోరుకుంది. ప్రస్తుతం ఈ కోరికల లేఖలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు క్రేజీగా కామెంట్స్ పెడుతున్నారు. కొంత మంది వారి కోరికలు నెరవేరాలని కోరకుంటే, మరికొంత మంది హుండీలో లేఖలేంటని విమర్శిస్తున్నారు.

Advertisement

Read Also: అరే మీరు స్నేహితులేనా? ఫ్రెండ్ బర్త్ డే కేకులో బాంబులు పెట్టి..

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×