Chinese Man: ప్రశాంతత లేదు.. నిద్ర రాదు.. బయటి ప్రపంచం కనిపించదు.. పక్కన ఏం జరుగుతుందో అర్థం కాదు. ఏదో అనుకొని పంతానికి పోతే.. ఇంకేదో అయిపోయింది. అంతే.. మళ్లీ మొదటికొచ్చాడు. నేషనల్ హైవే నిర్మిస్తున్నాం.. మీ ఇల్లు ఖాళీ చేయండి.. 2 కోట్లు ఇస్తామంటే వద్దన్నాడు. తీరా.. రోడ్డు వచ్చాక ఇప్పుడు బాధపడుతున్నాడు. చైనాలో జరిగిన ఈ ఎపిసోడ్.. ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
అభివృద్ధి కావాలనుకున్నప్పుడు.. ఆ అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని నిలదీసి అడిగే హక్కు ఎలా ఉంటుందో.. అందుకు సహకరించాల్సిన బాధ్యత కూడా పౌరులపై ఉంటుంది. అయితే.. సర్కారుకు సహకరించకుండా పంతానికి పోతే ఏం జరుగుతుందో.. ఎంత ఇబ్బందిపడాల్సి వస్తుందో.. చైనాలో జరిగిన ఈ ఇన్సిడెంట్ చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. జిన్సీ ప్రాంతంలో హువాంగ్ పింగ్ అనే వృద్ధుడు తన మనవడితో కలిసి నివసిస్తున్నాడు. ఆయనకు రెండంతస్తుల ఇస్లు ఉంది. అయితే.. ఈ ప్రాంతంలో చైనా ప్రభుత్వం నేషనల్ హైవే నిర్మించాలనుకుంది.
ఆ హైవే అలైన్‌మెంట్‌లో.. ఈ హువాంగ్ పింగ్ ఇల్లు కూడా ఉంది. రోడ్డు వేయాలంటే.. ఆ ఇంటిని తొలగించాల్సిందే. దాంతో.. ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని.. చైనా ప్రభుత్వం 2 కోట్లు ఆఫర్ చేసింది. కానీ.. ఆ పెద్దాయన వినలేదు. అధికారులు ఎంతో నచ్చజెప్పారు. 2 కోట్లు ఇస్తామన్నా.. ఆయన వెనక్కి తగ్గలేదు. దాంతో.. చేసేదేమీ లేక చైనా ప్రభుత్వం ఆయన ఇల్లు ఉన్న చోటుని వదిలేసి.. ఇంటి చుట్టూ హైవే నిర్మించింది. అది కూడా హువాంగ్ ఇంటి పైకప్పుతో సమానంగా ఉంటుంది. అంతే.. రోడ్డు పడ్డాక.. పెద్దాయనకు కష్టాలు మొదలైపోయాయి.
పంతానికి పోయిన హువాంగ్ పింగ్.. ఇప్పుడు రద్దీగా ఉండే ఆ రహదారి మధ్యలోనే నివసిస్తున్నాడు. తన ఇంటికి వెళ్లాలంటే.. ఓ పెద్ద పైపు గుండా వెళ్లాల్సి వస్తోంది. ఇదే పెద్ద ఇబ్బంది అనుకుంటే.. దానిని మించిన ఇరిటేషన్స్ ఇంకా చాలానే ఉన్నాయి. వాహనాల చప్పుడు.. కొన్నిసార్లు తన ఇల్లు కంపించినట్లుగా అనిపిస్తోందని కూడా చెబుతున్నాడు. అంతేకాదు.. నిత్యం దుమ్ము, వాహనాల సౌండ్, హారన్లు.. ఇలా ప్రతీది వాళ్లకు చికాకు తెప్పిస్తోంది. పైగా.. ఎటు చూసినా రోడ్డు తప్ప మరొకటి కనిపించదు. తన ఇంటికెళ్లాలన్నా.. ఆ రోడ్డు కింద ఏర్పాటు చేసి పైప్ నుంచే వెళ్లాలి. అదో.. సొరంగంలా ఉంది. అందులో నుంచే రాకపోకలన్నీ! ఈ నరకం చూశాక.. ఇప్పుడు తెగ బాధపడిపోతున్నాడు. అధికారులు అడిగినప్పుడే రోడ్డు కోసం తన స్థలం ఇచ్చేసి ఉంటే ప్రశాంతంగా ఉండేదనుకుంటున్నాడు. కూల్చివేత షరతులకు అంగీకరించపోవడంపై.. చింతిస్తున్నాడు.
Also Read: అగ్ర దేశాలకు భారత ఆయుధ సామగ్రి.. హైదరాబాద్ కంపెనీలే కీలకం
ఏదేమైనా.. ఇప్పుడు హువాంగ్ ఇల్లు ఓ టూరిస్ట్ అట్రాక్షన్‌గా మారిపోయింది. సరిగ్గా హైవే మధ్యలో ఉన్న ఈ ఇల్లు.. ఇంటర్నెట్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్లంతా తాత ఇంటి దగ్గరికొచ్చి.. ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. హైవే మధ్యలో ఇల్లు ఉండటం, అందులోకి టన్నెల్ లోపల్నించి వెళ్లాల్సి వస్తుండటం చాలా మందికి డిఫరెంట్‌గా అనిపిస్తోంది. దాంతో.. హువాంగ్ పింగ్ ఇంటిని చూసేందుకు టూరిస్టులు క్యూ కడుతున్నారు.
ప్రభుత్వాలు సుదీర్ఘ భవిష్యత్‌ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడు.. ఒకరిద్దరికి ఇబ్బంది కలగడం సహజం. అందుకు.. తగిన పరిహారం కూడా ప్రభుత్వం ఇస్తుంది. ముఖ్యంగా.. ఈ రోడ్డు వైడింగ్ పనులు జరిగేటప్పుడు, కొత్త రోడ్ల నిర్మాణం చేసేటప్పుడు.. ప్రజలకు సంబంధించిన ఆస్తులు పోవడం సహజమే. అలాంటప్పుడు తగిన పరిహారం కావాలని డిమాండ్ చేయడంలో న్యాయం ఉంది. ప్రభుత్వం ఇస్తామన్న పరిహారం సరిపోకపోతే.. ఇంకా ఎక్కువ డిమాండ్ చేసే హక్కు ఉంటుంది. అంతేగానీ.. ఇలా మొండికేసి అక్కడే ఉంటానంటే మాత్రం ఇబ్బందులు తప్పవు.
The stubborn old Chinese man who refused to sell his house for a government project now regrets his decision.
Huang Ping, from Hunan province, hoped for more money but lost everything. The government built a road around his house, leaving it in the middle of a busy street. Now,… pic.twitter.com/it0rYe2fhd
— Ibra ❄️ (@IbraHasan_) January 25, 2025