Uzbek – Vaishali: టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ లో భారత చెస్ ప్లేయర్ ఆర్ వైశాలికి చేదు అనుభవం ఎదురయింది. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ వైశాలితో కరచాలనం చేసేందుకు ఉజ్బెకిస్తాన్ గ్రాండ్ మాస్టర్ నొడిర్బేక్ యాకూబ్ బొయెవ్ నిరాకరించడం వివాదాస్పదంగా మారింది. వైశాలి.. యాకూబ్ బోయేవ్ తో నాలుగవ రౌండ్ లో పోటీకి ప్రారంభానికి ముందు తన చేతిని చాచి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించింది.
Also Read: WTC – Pakistan: విండీస్ చేతిలో ఓటమి.. WTC లో అట్టడుగున పాకిస్థాన్ !
కానీ అతడు దానిపై స్పందించకుండా కూర్చుండిపోయాడు. దీంతో అతడి తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇంత అహంకారం ఎందుకని సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో వెంటనే స్పందించాడు ఉజ్బెకిస్తాన్ గ్రాండ్ మాస్టర్ యాకూబ్. దీంతో వెంటనే సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలియజేశాడు.
తనకు వైశాలి సహా భారత ఆటగాళ్లు అంటే చాలా గౌరవం ఉందని.. కానీ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు తన మత విశ్వాసాలు అంగీకరించవని వివరణ ఇచ్చాడు. మతపరమైన కారణాలవల్ల తాను ఇతర మహిళలను తాకనని.. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలనుకుంటున్నానని ట్విట్ చేశాడు. రొమేనియా క్రీడాకారిణి ఇరీనా తో జరిగిన ఎనిమిదవ రౌండ్ గేమ్ లో మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు తన మత విశ్వాసాల గురించి ముందుగానే తెలియజేసినట్లు యాకూబ్ చెప్పాడు.
కాగా.. ఈ గేమ్ లో ఆర్ వైశాలి సునాయసంగా గెలుపొందింది. 2019లో గ్రాండ్ మాస్టర్ అయిన 23 ఏళ్ల యాకూబ్.. ఈ మ్యాచ్ లో ఓడిపోయాడు. ప్రస్తుతం చాలెంజర్స్ విభాగంలో 8 రౌండ్ల తర్వాత అతడు మూడు పాయింట్లతో ఉన్నాడు. ఈ గేమ్ లో 8 రౌండ్లు ముగిసి.. మరో ఐదు రౌండ్లు మిగిలి ఉండగానే నాలుగు పాయింట్లతో వైశాలి లీడ్ లోకి వచ్చింది. మరోవైపు ఎనిమిదవ రౌండ్ తర్వాత భారత గ్రాండ్ మాస్టర్, ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ 5.5 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్త ఆధీనంలో ఉన్నాడు.
Also Read: Boxer Mary Kom: కుంభమేళాలోనే మేరీకోమ్ బాక్స్ంగ్ పంచ్ లు !
భారత్ కి చెందిన మరో గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందతో ఆదివారం జరిగిన ఎనిమిదవ రౌండ్ గేమ్ లో గుకేష్.. 33ఎత్తుల్లో గేమ్ ని డ్రా చేసుకున్నాడు. నొదిక్ బేక్ ( ఉజ్బెకిస్తాన్ ), ప్రజ్ఞానంద (భారత్) 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. ఇక పెంటెల హరికృష్ణ (భారత్), అనీష్ గిరి (నెదర్లాండ్) మధ్య జరిగిన గేమ్ 30 ఎత్తుల్లో డ్రా గా ముగిసింది. మొత్తం 14 మంది మేటి గ్రాండ్ మాస్టర్ల మధ్య 13 రౌండ్ల పాటు ఈ టోర్నీ జరుగుతోంది.
టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ ప్రతి ఏడాది నెదర్లాండ్స్ లోని విజ్క్ ఆన్ జీ లో జనవరిలో జరుగుతుంది. ఇది 1938లో ప్రారంభమైంది. మొదట దీనిని హుగోవెన్స్ టోర్నమెంట్ అని పిలిచేవారు. ఆ తర్వాత కోరస్ చెస్ టోర్నమెంట్ అని, 2007 నుంచి టాటా స్టీల్ యూరప్ గా పిలుస్తున్నారు.
A renowned Uzbek chess Grandmaster, Nodirbek, refused to shake hands with India's Women's Grandmaster Vaishali.
Does religion influence sports? However, he was seen shaking hands with other female players earlier. pic.twitter.com/fGR61wvwUP
— Ayushh (@ayushh_it_is) January 27, 2025