E-Paper
Advertisement

Viral Video: ప్రేమించలేదని.. టీచర్‌ పెదవులు కోసేసిన.. క్లాస్ 12 స్టూడెంట్

Viral Video: ప్రేమించలేదని.. టీచర్‌ పెదవులు కోసేసిన.. క్లాస్ 12 స్టూడెంట్
Advertisement

Viral Video: ఉత్తర్ ప్రదేశ్‌లోని మెయిన్ పురి జిల్లాకు చెందిన ఓ విద్యార్థి.. పాఠాలు చెప్పే ఉపాధ్యాయురాలి పట్ల అత్యంత నీచంగా ప్రవర్తించాడు. తనను ప్రేమించాలంటూ వెంటపడటమే కాకుండా నడిరోడ్డుపై టీచర్ పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. కౌగిలించుకుంటూ ఇబ్బందులకు గురిచేశాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో భౌతిక దాడికి సైతం తెగబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.

వివరాల్లోకి వెళ్తే..

యూపీ మెయిన్ పురి జిల్లా కొత్వాలి ప్రాంతంలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. ప్రైవేటు ట్యూషన్ చెప్పడానికి వెళ్తున్న ఉపాధ్యాయురాలిని.. ఓ విద్యార్థి నడిరోడ్డుపై అడ్డగించాడు. తనను ప్రేమించాలంటూ బలవంతపెట్టాడు. ఈ క్రమంలో బలవంతంగా లోబరుచుకునేందుకు యత్నించాడు. తనవైపునకు లాక్కొని ముద్దులు పెట్టబోయాడు. దీంతో టీచర్ కు స్టూడెంట్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

పదునైన ఆయుధంతో దాడి..

Advertisement

అయితే తనకంటే వయసులో చిన్నవాడివని.. ఎట్టి పరిస్థితుల్లో ప్రేమించే ప్రసక్తే లేదని ఉపాధ్యాయురాలు తెగేసి చెప్పింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన 12వ తరగతి విద్యార్థి.. వెంట తెచ్చుకున్న ఆయుధంతో టీచర్ ముఖంపై దాడి చేశాడు. రెండు పెదవులను కోసేశాడు. అనంతరం ఘటనాస్థలి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన టీచర్ ను స్థానికులు హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు.

బాధితురాలి పరిస్థితి విషమం

తొలుత బాధితురాలిని మెయిన్ పురి జిల్లా ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి అగ్రాకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఉపాధ్యాయురాలి పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు దాడికి సంబంధించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఆ వీడియోలో టీచర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం గమనించవచ్చు. ఆమె మెడను బలంగా చేతితో బిగించి పక్కకు బలవంతంగా లాక్కెళ్లడం కూడా సీసీటీవీలో రికార్డు అయ్యింది.

Advertisement

Also Read: Viral Video: పట్టాలపై షాకింగ్ ఘటన.. రైలు ఢీకొట్టకుండానే.. మహిళకు తీవ్రగాయాలు

రంగంలోకి పోలీసులు..

వీడియోను షేర్ చేసిన ఆరవ్ అనే యూజర్.. సదరు విద్యార్థి చాలా కాలంగా టీచర్ ను వేధిస్తున్నట్లు ఆరోపించాడు. ఆమె మరో స్కూల్ మారినప్పటికీ, అతడికి కనిపించకుండా వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తున్నప్పటికీ నిందితుడు వదల్లేదని పేర్కొన్నాడు. సదరు విద్యార్థిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన చర్యలు తీసుకోలేదని ఆరవ్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికైనా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. కాగా, ఘటనపై కేసు నమోదు చేశామని.. పరారీలో ఉన్న విద్యార్థిని త్వరలోనే పట్టుకొని అరెస్టు చేస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి.

Also Read: Bengaluru Crime: దొంగతనం చేస్తూ చిక్కిన దొంగ.. కుమ్మేసిన ఇంటివాసులు, పోలీసులకు దొంగ ఫిర్యాదు

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×