E-Paper
Advertisement

Bengaluru Crime: దొంగతనం చేస్తూ చిక్కిన దొంగ.. కుమ్మేసిన ఇంటివాసులు, పోలీసులకు దొంగ ఫిర్యాదు

Bengaluru Crime: దొంగతనం చేస్తూ చిక్కిన దొంగ.. కుమ్మేసిన ఇంటివాసులు, పోలీసులకు దొంగ ఫిర్యాదు
Advertisement

Bengaluru Crime: బెంగుళూరులో ఊహించని ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు దొంగ. ఓ వ్యక్తిని చావబాదారు ఇంటివాసులు. తనపై దాడి చేశారంటూ ఇంటి యజమానులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన చిన్నన్నహళ్లిలోని సంపిగేహళ్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

బెంగుళూరులో పోలీసులకు ఊహించని ఘటన

Advertisement

బెంగుళూరు సిటీలోని ఆర్‌టీ నగర్‌లో నివాసం ఉంటున్నాడు అస్గర్ ఖాన్. వృత్తి రీత్యా ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడికి ధూమపానం, మద్యం సేవించే అలవాటు ఉంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగాయి. ఫలితంగా దొంగతనం చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో రజాక్, శ్యామ్ అనే ఇద్దరు వ్యక్తులతో అతడికి పరిచయం ఏర్పడింది.

స్క్రాప్ మెటీరియల్‌ను దొంగిలించి అమ్మడం అలవాటుగా మార్చుకున్నాడు. వచ్చిన డబ్బులతో మద్యం తాగేవాడు. ఇదే క్రమంలో ఈ ఏడాది జనవరి 31న రాత్రి 9.30 గంటల సమయంలో అస్గర్ ఖాన్, రజాక్, శ్యామ్‌లతో కలిసి దొంగతనానికి ప్లాన్ చేశారు. చొక్కనహళ్లి మెయిన్ రోడ్డులోని ప్రావిడెంట్ అపార్ట్‌మెంట్స్ ఎదురుగా ఉన్న ఇంటికి వెళ్లారు.

Advertisement

దొంగతనం చేస్తూ చిక్కిన దొంగ.. ఇంటివాసులపై దొంగ ఫిర్యాదు

అజ్గర్ ఇంటి కాంపౌండ్ గోడ ఎక్కి ఆవరణంలో ఉంచిన విద్యుత్ వస్తువులను దొంగిలించడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇంటివాసులకు పట్టుబడ్డాడు. దొంగను ప్రశ్నించినప్పుడు సహనం కోల్పోయిన బీరు బాటిల్‌తో దంపతులపై దాడి చేశాడు. దంపతుల అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని దొంగలను పట్టుకున్నారు.

ఆటో బయట ఉన్న రజాక్, శ్యామ్‌లు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే క్రమంలో గాయాలు పాలైన ఖాన్, ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. ఫలానా ఏరియాలోని దంపతులు తనపై దాడి చేశారని ఫిర్యాడు చేశాడు. దీంతో దర్యాప్తు మొదలు పెట్టారు పోలీసులు.

ALSO READ: జూబ్లీహిల్స్ లో రెచ్చిపోయిన దొంగలు.. ఆ గ్యాంగ్ పనేనా?

ఖాన్ మొదట దంపతులపై దాడి చేసినట్టు తేలింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. చిన్న చిన్న దొంగతనాలు చేయడం స్నేహితుల నుంచి ప్రేరణ పొందినట్టు నిజం అంగీకరించాడు. అస్గర్ ఖాన్ తోపాటు ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×