BigTV English

Job Security: ప్రభుత్వ ఉద్యోగమా లేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగమా.. ఏది బెటర్?

Job Security: ప్రభుత్వ ఉద్యోగమా లేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగమా.. ఏది బెటర్?

Job Security| ఇటీవల సోషల్ మీడియాలో కొత్తగా డిబేట్ ప్రారంభమైంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం రాత్రి పగలనకు కృషి చేస్తున్నవారిని సాఫ్ట్ వేర్ ఉద్యోగులు విమర్శిస్తుంటే.. మరోవైపు ఐటీ రంగంలో ఉద్యోగ భద్రత లేదని అందరూ వేలెత్తి చూపుతున్నారు. ఈ చర్చ ప్రారంభానికి కారణం ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడమే. ఏడాది కాలంగా చూస్తే మెటా, గూగుల్, అమెజాన్ లాంటి ఐటి దిగ్గజాలు ఉద్యోగాల్లో కోత విధించగా.. ఇటీవలే తెలుగు తేజం సత్య నాదెళ్ల నేతృత్వంలోని దిగ్గజ మైక్రోసాఫ్ సంస్థ కూడా వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.


ఈ నేపథ్యంలో ఉద్యోగ భద్రత, వేతనం దృష్ట్యా ఐటీ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలను పోల్చడంపై చర్చ జరుగుతోంది. అమెరికాలోని మైక్రోసాఫ్ట్ సంస్థ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఒక యువకుడు ఉద్యోగం కోల్పోయి సమస్యలు ఎదుర్కొంటున్నాడని అతని సోదరి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ పోస్ట్ పై స్పందిస్తూ. . గూగుల్ కంపెనీలు టెక్ ఇంజినీర్ గా పనిచేస్తున్న ఒక యువకుడు చేసిన కామెంట్ వైరల్‌గా మారింది.

మైక్రోసాఫ్ట్‌లో జరిగిన ఉద్యోగ తొలగింపుల సందర్భంగా స్నేహ అనే మహిళ ‘ఎక్స్’ ప్లాట్‌ఫామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది. ‘అమెరికాలో పనిచేస్తున్న నా కజిన్ బ్రదర్‌ను మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. టెక్ రంగం అనేది స్థిరత్వం ఉండే రంగం కాదు. అందుకే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని, కనీసం అక్కడైనా ఉద్యోగ భద్రత ఉంటుందని మా పెద్దలు చెబుతుంటారు’ అని ఆమె రాసింది.


అయితే స్నేహ చేసిన పోస్ట్‌కు స్పందిస్తూ.. బెంగళూరుకు చెందిన గూగుల్ ఇంజినీర్ రాహుల్ రాణా సమాధానం ఇచ్చాడు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనను ఖండించాడు. టెక్ పరిశ్రమలో పనిచేసే వారి వేతనం ప్రభుత్వ ఉద్యోగం కంటే 5 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఎత్తి చూపాడు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే ఉద్యోగ భద్రత ప్రయోజనాల కంటే అధిక ఆదాయం ద్వారా కలిగే ప్రయోజనానికి ప్రాధాన్యం ఇవ్వాలని వాదించాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన జీవితకాలంలో సంపాదించే మొత్తం కంటే ఐదు రెట్లు ఎక్కువ సొమ్మును ఒక టెక్ ఉద్యోగి కేవలం కొన్ని సంవత్సరాల్లోనే సంపాదించగలడని ఆయన పేర్కొన్నాడు.

Also Read: సరదా కోసం సింహాన్నిపెంచుకున్న వ్యక్తి.. ఇంట్లో అంతా రక్తపాతం

ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. మరికొంతమంది యూజర్లు కూడా దీనిపై స్పందించారు. టెక్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల మధ్య లాభనష్టాలను విశ్లేషిస్తూ.. ఉద్యోగ భద్రత, ఆర్థిక ప్రయోజనాలు, కెరీర్ స్థిరత్వంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తన వాదనను మరింత బలపరుస్తూ.. స్నేహ మళ్లీ ట్వీట్ చేసింది. భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు వేతనానికి మించిన గణనీయమైన ప్రయోజనాలను అందిస్తాయని, గృహ నిర్మాణం, విద్యుత్, ఇతర సౌకర్యాల కోసం అలవెన్సులతో సహా, ఇవి గణనీయమైన సంపద సేకరణకు దోహదపడతాయని వివరించింది.

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×