Donald Trump : టైటిల్ చూసి కంగారు పడకండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు యూఏఈలో ఆసక్తికర రీతిలో స్వాగతం లభించింది. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో సౌదీ అరేబియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కు చేరుకున్న ట్రంప్‌కు.. స్వయంగా ఎయిర్‌పోర్టుకు వచ్చి ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఘనంగా వెల్‌కమ్ చెప్పారు. అయితే ఆ స్వాగతం పూర్తిగా యూఏఈ సంప్రదాయ బద్దంగా సాగింది. అది చూట్టానికి చాలా విచిత్రంగా ఉంది.
అల్ అయ్యాలా..
ఒక్క ప్రాంతంలో ఒక్కో తరహా కల్చర్ ఉంటుంది. నృత్యాలలోనూ రకరకాలు. ఇండియాలాంటి దేశాల్లో అయితే వందలాది వేరియేషన్స్ ఉంటాయి. మన దగ్గర ఒక్కో రాష్ట్రంలో రెండు మూడు రకాల సంప్రదాయాలు కూడా ఉంటాయి. కేరళలో ఒక విధంగా, ఆంధ్రాలో మరో రకంగా, కన్నడిగులు ఇంకోలా.. ఉత్తరాది వారు మరోలా.. ఒక్క భారత్‌లోనే అనేక వింత వింత ఆచారాలు కనిపిస్తాయి. అలాంటిదే యూఏఈలోనూ ఓ సంప్రదాయం ఉంది. దాని పేరు “అల్ అయ్యాలా”. అదేంటంటే…
తెల్లటి డ్రెస్సు.. పొడగాటి జుట్టు..
యువతులంతా తెల్లని దుస్తులు ధరిస్తారు. పొడగాటి జుట్టును విరబోసుకుంటారు. బ్యాగ్రౌండ్‌లో సంగీతం ప్లే చేస్తుంటే.. ఆ మ్యూజిక్‌కు అనుగుణంగా తలలు ఊపుతుంటారు. శరీరం కదలదు.. కేవలం తల, జుట్టు మాత్రమే ఆడిస్తారు. పెళ్లి వేడుకల్లో ఎక్కువగా ‘అల్ అయ్యాలా’ కనిపిస్తుంటుంది. అందరూ ఒకచోట చేరి ఇలా సందడి చేస్తుంటారు. ఈ సంప్రదాయరీతిలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు స్వాగతం పలికింది యూఏఈ.
అవాక్కైన ట్రంప్..
ట్రంప్ వస్తుండగా ముందు వరుసలో మ్యూజిక్ బ్యాండ్ వెల్‌కమ్ చెప్పింది. ఆ తర్వాత యువతులంతా తెల్లని పొడగాటి డ్రెస్ ధరించి.. జుట్టు విరబోసుకుని.. తలలు ఊపుతూ ట్రంప్‌కు స్వాగతం పలికారు. వాళ్లను చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు అమెరికా అధ్యక్షుడు. అక్కడే నిలబడిపోయారు. అంతలోనే తేరుకున్నారు. కాస్త భయపడ్డట్టున్నారు కూడా. పక్కనే ఉన్న యూఏఈ అధ్యక్షుడుని ఆపి మరి.. ఇదేంటని అడిగారు. ఆయన లైట్ తీసుకోండి అనే ధోరణిలో ట్రంప్ భుజంపై చేయి వేసి.. ముందుకు సాగారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వెల్‌కమ్ వింతగా, ఆసక్తిగా, కాస్త భయంగా కూడా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తెల్ల దుస్తులు, జుట్టుతో తలూపుతూ.. వాళ్లు చూట్టానికి దెయ్యాల్లాగా ఉన్నారని.. ట్రంప్‌కు దెయ్యాలతో స్వాగతం పిలికారంటూ కొందరు నెటిజన్లు కామెడీగా కామెంట్స్ చేశారు. ఏది ఏమైనా ట్రంప్ అంటే ఆమాత్రం సాదర స్వాగతం ఉండాలి లేండి.
.@POTUS bids President Mohammed bin Zayed Al Nahyan farewell after receiving a royal welcome at Zayed International Airport in Abu Dhabi 🇺🇸🇦🇪 pic.twitter.com/NnIf6MYp44
— Rapid Response 47 (@RapidResponse47) May 15, 2025