E-Paper
Advertisement

Safilguda Incident: దారుణం, సఫిల్‌గూడలో ఆలయం ముందు మల విసర్జన.. నిందితుడు అరెస్ట్

Safilguda Incident: దారుణం, సఫిల్‌గూడలో ఆలయం ముందు మల విసర్జన.. నిందితుడు అరెస్ట్
Advertisement

Safilguda Incident: సఫిల్‌ గూడలోని కట్ట మైసమ్మ గుడి వద్ద ఓ వ్యక్తి దుశ్చర్యకు పాల్పడ్డాడు. శనివారం రాత్రి ఆలయ ప్రాంగణంలో మూత్ర విసర్జన చేయడంతో స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. దీంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ ఘటన నేపథ్యంలో ఉదయం నుంచి సఫిల్‌గూడ కట్ట మైసమ్మ గుడి వద్ద నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీంతో.. సఫిల్‌గూడ నుంచి నేరేడ్‌మెంట్ వెళ్లే రోడ్డును పోలీసులు మూసివేశారు. దీంతో ఈ అరచానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. అతడు కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన అల్తాఫ్‌గా గుర్తించారు.

Advertisement

అంతేకాకుండా నేరెడ్‌మెట్ ప్రాంతంలో రోజు కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. అయితే అతడు మత విశ్వాసాలను అవమానించాడంటూ 333, 196(2), 298, 299 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు పోలీసులు. అలాగే అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు..

ఈ ఘటనపై స్పందించి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు. రాష్ట్రంలో ఆలయాలపై, హిందువులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతన్నాయని అన్నారు. ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు రాంచందర్ రావు.

Advertisement

Also Read: తిరుమల తిరుపతి తాగునీటి సమస్యకు చెక్.. త్వరలో వెంకన్న పాదాలను తాకనున్న కృష్ణమ్మ..

అంతేకాకుండా సఫిల్‌గూడ ఆలయ ఘటనపై ఫైరయ్యారు బీజేపీ నేత చికోటి ప్రవీణ్. హిందూ ఆలయం ముందు ఇలా చేయడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో మత ఘర్షణలు సృష్టించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. అతడి వెనుక ఎవరెవరు ఉన్నారు..? ఎక్కడి నుంచి వచ్చాడు..? అనేది పోలీసులు బహిర్గతం చేయాలన్నారు చీకోటి ప్రవీణ్.

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×