Big Stories

Viral Video: ఫ్లైఓవర్‌పై కారు ఆపి రీల్స్‌.. ఆ తర్వాత ఏమైందంటే..

Delhi man who stopped car on flyover for reel stunt arrested, fined Rs 36,000

- Advertisement -

Triple Blow For Instagram Reel Stunt: ఈ మధ్య రీల్స్ పిచ్ పీక్స్ స్టేజ్ కు వెళ్తున్నాయి. ఎక్కడి బడితే అక్కడ .. ఇష్టం వచ్చినట్లు రీల్స్ చేస్తూ జనాల్ని ఇబ్బంది పెడుతున్నారు. వ్యూస్ రావడం కోసం ఫేమ్ రావడం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఈ మధ్యనే నోయిడాలోని ఓ మెట్రోలో ఇద్దరు అమ్మాయిలు చేసిన రొమాన్స్ ఘటన వైరల్ అయిన సంగతీ అందరికీ తెలిసిందే.. అయితే తాజాగా అలాంటి ఘటన ఢిల్లీలో జరిగింది.

- Advertisement -

ఇద్దరు ఆకతాయిలు ట్రాఫిక్ మధ్యలో కారు ఆపి రీల్స్ చేయడం వివాదస్పదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ పశ్చిమ విహార్ లో గల ఫ్లై ఓవర్ మీద ప్రదీప్ ఢాకా అనే వ్యక్తి అతని స్నేహితుడుతో కలిసి ట్రాఫిక్ ఉన్న సమయంలో కారును ఆపి రీల్స్ చేయడం మొదలు పెట్టారు. ఫోటోలకు ఫోజులిస్తూ .. ఆపై కారు డోర్ తీసి మరి కారు నడిపాడు. వాళ్లు ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని కూడా ఆలోచించలేదు. ఆ తర్వాత పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్ కు నిప్పంటించారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీన్ని గమనించిన ట్రాఫిక్ పోలీసులు ఆ ఇద్దరిని ఆపి నిలదీశారు. నిబంధనలు ప్రకారం వారికి రూ.36,000 జరిమానా విధించారు.

Also Read: పిచ్చి పీక్స్.. అమ్మాయి చేసిన రీల్స్‌కు అంతా షాక్!

దీంతో కోపంతో  ఆకతాయిలు ఇద్దరు పోలీసులపై దాడి చేసారు. పైగా తామేదో ఘనకార్యం వెలగబెట్టినట్టు దీన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోలీసులపై దాడి చేసినందుకు ప్రదీప్ ఢాకా అనే వ్యక్తిని అరెస్టు చేశారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రదీప్ ఢాకాపై పలు ఐసీపీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రదీప్ ఢాకా తన సోషల్ మీడియా స్టంట్స్ కోసం ఉపయోగించిన కారు అతని తల్లి పేరుతో రిజిస్టర్ అయినట్లు తేలింది. వాహనంలో కొన్ని నకిలీ ప్లాస్టిక్ ఆయుధాలను కూడా పోలీసులు గుర్తించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News