BigTV English

Eblu Feo X EV Bike gives 110km Milage: ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 110 కి.మీ ప్రయాణం.. ధర తెలిస్తే ఎగబడి కొనేస్తారు..!

Eblu Feo X EV Bike gives 110km Milage: ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 110 కి.మీ ప్రయాణం.. ధర తెలిస్తే ఎగబడి కొనేస్తారు..!
Godavari Eblu Feo X
Godavari Eblu Feo X

Eblu Feo X Electric Bike gives 110km Milage in a Single Charge: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ త్వరలో తన ఇబ్ల్యూ ఫియో ఎక్స్ ‘eblu Feo X’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. పర్యావరణ అనుకూలమైన, అద్భుతమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ eblu Feo X ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకురానుంది. ఇప్పుడు ఈ స్కూటర్‌కు సంబంధించిన ధర, స్పెసిఫికేషన్ల వివరాలను తెలుసుకుందాం..


eblu Feo X ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన పనితీరును అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ గరిష్టంగా 110 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎకానమీ, నార్మల్, పవర్ అనే మూడు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంది. ఈ స్కూటర్‌ను ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 110 కి.మీ వరకు ప్రయాణాన్ని అందిస్తుంది.

అంతేకాకుండా ఈ స్కూటర్ రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ స్కూటర్ పనితీరు గురించి గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ సిఇఒ హైదర్ ఖాన్ మాట్లాడుతూ.. eblu Feo X ఎలక్ట్రిక్ స్కూటర్ సాటిలేని రైడింగ్ అనుభూతిని అందించడానికి అనేక కొత్త ఫీచర్లతో వస్తుంది. వినియోగదారుల సౌకర్యాలపై చాలా శ్రద్ధ చూపబడింది అంటూ తెలిపారు.


Also Read: బైకు కొనేందుకు ఇదే మంచి ఛాన్స్.. రూ.60 వేలు డిస్కౌంట్!

ఇకపోతే కంపెనీ ఈ స్కూటర్‌ను 5 కలర్ ఆప్షన్‌లతో అందించనుంది. సియాన్ బ్లూ, వైన్ రెడ్, జెట్ బ్లాక్, టెలి గ్రే, ట్రాఫిక్ వైట్ వంటి ఆప్షన్‌లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ స్కూటర్ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ప్రయాణీకుల భద్రతను పెంచడానికి ముందు, వెనుక భాగంలో CBS డిస్క్ బ్రేక్‌లు అందించబడ్డాయి.

అంతేకాకుండా రాత్రిపూట స్కూటర్‌పై ప్రయాణిస్తున్నప్పుడు హై రిజల్యూషన్ AHO LED హెడ్‌ల్యాంప్‌లు, LED టెయిల్ ల్యాంప్‌లు మంచి లైటింగ్‌ను అందిస్తాయి. సీట్లతో నావిగేషన్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. అలాగే ఇది 7.4 అంగుళాల డిజిటల్ ఫుల్-కలర్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఈ స్కూటర్‌తో పాటు 60 వోల్ట్‌ల సామర్థ్యం గల హోమ్ ఛార్జర్ అందించబడింది. దీని ఛార్జర్ ద్వారా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కేవలం 5. 25 గంటల పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇక దీని ధర విషయానికొస్తే.. కంపెనీ దీని ధరను రూ.1లక్షగా నిర్ణయించింది.

Tags

Related News

Gold Rate Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర..

Jio vs Airtel vs VI: జియో, ఎయిర్‌ టెల్, VI.. డైలీ డేటాలో బెస్ట్ మంత్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే!

Best BSNL Plans: నెల రోజుల వ్యాలిడిటీ.. అన్ లిమిటెడ్ కాల్స్.. రూ. 199 లోపు 5 బెస్ట్ BSNL ప్లాన్స్ ఇవే!

iPhone 17 launch: కొత్త ఐఫోన్ 17 డిజైన్, ఫీచర్స్ లీక్…ధర ఎంతంటే..? 

Best bikes under 1 lakh: ఒక్క లక్షలోపు బెస్ట్ బైక్‌లు.. 2025 టాప్ బైక్స్ ఇవే..

Flipkart Big Billion Days: కేవలం రూ.1కే ప్రీబుక్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025

×