Rare Fish: సముద్రం.. ఇదొక ఎన్నో వింత జీవులు గల ఒక ఆవాసం. సునామీ వచ్చినా, భూకంపం ప్రభావం కనిపించినా ముందు సముద్రంలో అలజడి కామన్. అలాంటిది ఇప్పుడు సముద్రం మనకు కొన్ని సంకేతాలు ఇస్తుందని కొందరు నమ్ముతున్నారు. సముద్రం లోపల ఖజానాగా చెప్పుకొనే కొన్ని జలరాశులు ఇప్పుడు భూమిపైకి వచ్చేందుకు తెగ ఆరాట పడుతుండడంపై సర్వత్రా దేవుడా.. వాట్ నెక్స్ట్ అనే చర్చ ఊపందుకుంది. అయితే అసలు ఏ జీవులు బయటికి వచ్చాయి? నెక్స్ట్ ప్రళయం తప్పదా అనే విషయాల కోసం ఈ కథనం పూర్తిగా చదవండి.
భయపెడుతున్న జపాన్.. అదే జరిగేనా?
తమిళనాడు నుండి ఆస్ట్రేలియా వరకూ తీరాలకు కొట్టుకొస్తున్న అరుదైన ఆ చేపలు కనిపించటం ఇప్పుడు పెద్ద చర్చకు కారణమైంది. ఈ చేపలు సాధారణంగా సముద్రం లోతులలో ఉండే జీవులు. అయితే, ఇటీవల అవి విపరీతంగా తీరాలకు కొట్టుకు వస్తుండగా, స్థానికులే కాకుండా పర్యావరణ శాస్త్రజ్ఞుల మధ్య కూడా ఆందోళన పెరిగింది. జపాన్ పరిశోధకులు మాత్రం ఈ చేపలు తీరానికి వస్తే.. మహా విపత్తు, ప్రళయం దగ్గరపడినట్లు భావిస్తున్నారు. ఈ డూమ్‌డే ఫిష్ రకపు చేపలు ఇప్పుడు మన సముద్రతీరాల్లో కనిపించడంతో అదే సంకేతమనే చర్చ సాగుతోంది.
ఏంటా చేప? ఎందుకింత భయం?
ఓర్ ఫిష్ ఒక నెమ్మదిగా కదిలే, సోమరి సముద్ర జీవి. ఇది సాధారణంగా సముద్రం అట్టడుగున, వేల అడుగుల లోతుల్లో తేలుతూ, పాచిని ఆహారంగా తీసుకుంటూ జీవిస్తుంది. కానీ ఇది నీటి ఉపరితలానికి చేరితే మాత్రం ప్రకృతి అశాంతిగా మారుతుందని అనుమానాలు మొదలవుతాయి.
ఆ రోజు చేప వచ్చింది.. సునామీ వచ్చింది!
పాత జపనీస్ నమ్మకాల ప్రకారం, ఓర్ ఫిష్‌ను డూమ్స్‌డే ఫిష్ గా పరిగణిస్తారు. ఎందుకంటే, ఇది ఎప్పుడు తీరానికి దగ్గరగా కనిపించినా.. ఆ వెంటనే భారీ ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. 2011 జపాన్ భూకంపం ముందు కూడా ఇలా ఒడ్డుకు కొట్టుకుపోయిన ఓర్ ఫిష్‌లు కనిపించాయని స్థానికులు చెబుతారు. ఈ చేప భూకంపాల ముందు నీటిలో అలజడి, అద్భుతమైన కంపనాలను గ్రహించి, ఉపరితలానికి పైకి వస్తుందని విశ్వసించబడుతుంది. నిజమా? అపోహా? అనే ప్రశ్న పక్కనపెడితే.. ఓర్ ఫిష్ కనిపించిందంటే ప్రకృతిలో ఏదో మార్పు జరుగుతుందన్న ఉత్కంఠ మాత్రం తప్పదు.
ఎందుకు వస్తున్నాయి ఇవి?
సాధారణంగా ఈ చేపలు సముద్రంలో అట్టడుగు తీరాలలో ఉండవు. అవి లోతైన, చల్లటి నీళ్లలో నివసిస్తాయి. కానీ ఇప్పుడు విపరీతంగా తీరాలకు చేరడం వలన సముద్ర వాతావరణంలో మార్పులు, సముద్ర స్థాయి పెరుగుదల వంటి విషయాలు దృష్టికి వస్తున్నాయి. ఇలాంటి మార్పులు మనకు పెద్ద విపత్తుల సూచన కావచ్చని అనుకుంటున్నారు నిపుణులు. ముఖ్యంగా జపాన్‌లో ఈ చేపలు తీరానికి చేరుకోవడం పూర్వకాల నుండి భవిష్యత్ మహా ప్రమాదాలకు సంకేతమని పరిగణిస్తున్నారు.
ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ అరుదైన చేపలు ఒక ప్రకృతి హెచ్చరికగా కనిపిస్తాయి. వీటి తీరానికి చేరకపోతే, ఈ ప్రాంతాల సముద్ర జీవవైవిధ్యంకు, వాతావరణ పరిస్థితులకు చాలా మేలైంది. కానీ ఇప్పుడు ఇది చోటుచేసుకోవడం వల్ల, స్థానిక మత్స్యకారులు, పర్యాటకులు, ప్రజలు అప్రమత్తంగా ఉండటం అవసరమని పర్యావరణ వేత్తలు అంటున్నారు.
Also Read: Vizag Caves: విశాఖ చుట్టూ సీక్రెట్ గుహలు.. ఇక్కడికి వెళ్లారో.. ఆ కథే వేరు!
శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
ఇలాంటి ప్రకృతి సంకేతాలను గుర్తించి, సైన్స్ ఆధారంగా పరిశీలించటం చాలా ముఖ్యమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ అరుదైన చేపతో పాటు ఇతర సముద్ర జీవుల కూడా తీరాలకు చేరడం, లేదా అందుబాటులోకి రావడం వలన భవిష్యత్ విపత్తులకు మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చట. ప్రభుత్వాలు, పర్యావరణ సంస్థలు ఈ విషయంపై మరింత పరిశోధనలు చేయడం, ప్రజలకు సరికొత్త సమాచారం ఇవ్వడం కీలకమని జపాన్ పరిశోధకులు అంటున్నారు.
Doomsday fish have been found in Tamil Nadu, India. pic.twitter.com/MQWurkE9ZN
— ಸನಾತನ (@sanatan_kannada) May 31, 2025
ప్రజలు ఈ విషయాన్ని చూసి పానిక్‌కి గురికావడం కాకుండా, సరైన సమాచారం ద్వారా ఆలోచించి, జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందట. తీర ప్రాంతాల్లో ఉండే వారు సహకార చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే, పెద్ద వరదలు, సునాములు, తుఫాన్లు తీర ప్రాంతాల్లో ప్రళయం తెచ్చే ప్రమాదం ఉంటుందని విదేశాల్లో ప్రచారం ఊపందుకుంది.
మొత్తానికి, తమిళనాడు నుంచి ఆస్ట్రేలియా వరకు ఈ అరుదైన చేపల కొట్టుకొస్తున్నదీ మనకు ప్రకృతి ఇచ్చే ఒక ముఖ్యమైన హెచ్చరికగా మత్స్యకారులు భావిస్తున్నారు. మనం దీన్ని సీరియస్‌గా తీసుకుని, భవిష్యత్ విపత్తులపై ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రజల భద్రతను కాపాడుకోవచ్చని వారు అంటున్నారు. ప్రకృతితో కలిసి జీవించి, ఈ సంకేతాలను అర్థం చేసుకోవడం ద్వారా మన భవిష్యత్ ను కాపాడుకోవడం సాధ్యమని పలువురి అభిప్రాయం.