BigTV English

Earthquake: ఢిల్లీలో వర్షం పడుతుండగా భూకంపం.. ఒకేసారి ఈ డబుల్ దాడి ఎలా జరిగింది? సైన్స్ ఏం చెబుతోంది?

Earthquake: ఢిల్లీలో వర్షం పడుతుండగా భూకంపం.. ఒకేసారి ఈ డబుల్ దాడి ఎలా జరిగింది? సైన్స్ ఏం చెబుతోంది?

ఢిల్లీలో ఒకవైపు వర్షం పడుతుండగా భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 9 గంటలకు ఈ సంఘటన జరిగింది. దీంతో ఢిల్లీ ప్రజలు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. వర్షం పడుతుండగా భూకంపం రావడం అనేది ఆశ్చర్యకరమైన విషయమే.


ఢిల్లీలో వచ్చిన భూకంపం కేంద్రం హర్యానాలోని గుర్వారా నుండి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు తెలుస్తోంది. దీని తీవ్రత 4.2గా గుర్తించారు.

భూకంపం ఎందుకు వస్తుంది?
భూకంపం రావడానికి ముఖ్య కారణం టెక్టోనిక్ ప్లేట్స్ లో వచ్చే కదలికలు. భూమి.. 12 టేక్టోనిక్ ప్లేట్లపై ఆధారపడి ఉంటుంది. ఇవి నిత్యం నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. ఈ ప్లేట్లు ఒక్కోసారి ఒకదాన్ని ఒకటి ఢీకొట్టడం వంటివి కూడా చేస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఒక రకమైన శక్తి విడుదలవుతుంది. దీని కారణంగానే భూకంప ప్రకంపనలు వస్తాయి. అధ్యయనాల ప్రకారం ఈ టెక్టోనిక్ ప్లేట్లు ప్రతి ఏడాది నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల మేరకు తమ స్థానాన్ని మార్చుకుంటాయని తెలుస్తోంది. అవి ఒకదాన్ని ఒకటి ఢీకొని ఉండటం వల్ల భూకంపం ఏర్పడుతుంది.


రింగ్ ఆఫ్ ఫైర్
ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. వీటిని రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారు. వాటిల్లో అమెరికా, జపాన్, ఇండోనేషియాలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా చూసుకుంటే భారతదేశంలో కూడా భూకంపాల సంఖ్య పెరిగిపోతోంది. అందుకే భారతదేశాన్ని కూడా ఐదు భూకంప జోన్లుగా విడదీశారు.

జోన్ 5
అత్యంత ప్రమాదకరమైన భూకంప ప్రాంతం జోన్ 5. ఇందులో ఈశాన్య భారతదేశంలో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్ లోని కచ్ ప్రాంతం, ఉత్తర బీహార్, అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. ఇక్కడ తరచూ భూకంపాలు వస్తూనే ఉంటాయి.

జోన్ 4
జోన్ ఫోర్ లో జమ్మూ కాశ్మీర్లోని మిగిలిన ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, సిక్కిం, బీహార్, పశ్చిమబెంగాల్, గుజరాత్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు ఈ పరిధిలోకి వస్తాయి.

జోన్ 3
కేరళ, బీహార్, పంజాబ్, పశ్చిమ రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, తూర్పు గుజరాత్, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో జోన్ 3 లో పెట్టారు.

జోన్ 2
ఈ జోన్లో తక్కువ భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. వీటిలో రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమబెంగాల్లోని కొన్ని ప్రాంతాలు, హర్యానాలోని కొన్ని ప్రాంతాలు మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి.

ఇక జోన్1లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తూర్పు మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్లోని పశ్చిమ ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ భూకంపాలు రావడం చాలా అరుదని చెప్పుకోవాలి.

వర్షం పడుతుండగా భూకంపం
ఈసారి ఢిల్లీలో వర్షం పడుతుండగా భూకంపం రావడం మాత్రం ఎంతోమందికి వింతగా అనిపించింది. ఇది వర్షం వల్ల సంభవించిన భూకంపం అనే సందేహం చాలా మందిలో వచ్చింది. అయితే వర్షానికి, భూకంపానికి మధ్య ఎటువంటి సంబంధం లేదు. కొన్నిసార్లు భారీ వర్షాలు పడుతున్నప్పుడు భూమి కింద టెక్టోనిక్ ప్లేట్స్ కూడా తమ స్థానాన్ని మార్చుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఇలా వర్షం పడుతుండగా భూకంపం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వర్షం వల్లే భూకంపం వచ్చింది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×