BigTV English

Europe Techie Salary: ‘లండన్‌లో సాలరీ రూ.80 లక్షలు.. బెంగుళూరుకు వచ్చేయాలనుకుంటున్నాను’.. సోషల్ మీడియాలో భారత టెకీ వైరల్ పోస్ట్

Europe Techie Salary: ‘లండన్‌లో సాలరీ రూ.80 లక్షలు.. బెంగుళూరుకు వచ్చేయాలనుకుంటున్నాను’.. సోషల్ మీడియాలో భారత టెకీ వైరల్ పోస్ట్

Europe Techie Salary| ఒక ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యూరోప్ లోని లండన్ లో స్థిరపడ్డాడు. అక్కడ అతని వార్షిక జీతం రూ.80 లక్షలు. కానీ ఆ దేశంలో సంపాదనకు తగ్గ ఖర్చులున్నాయని.. తనకు ఏమీ మిగలడం లేదని అతను అసంతృప్తిగా ఉన్నాడు. ఈ క్రమంలో అతనికి భారతదేశంలోని బెంగుళూరు నగరంలో ఒక కంపెనీ నుంచి ఒక మంచి జాబ్ ఆఫర్ వచ్చింది. అయితే బెంగుళూరు కంపెనీ ఆఫర్ చేసిన జీతం రూ.50 లక్షలు.


ఇప్పుడా సాఫ్టమేర్ ఇంజినీర్ తాను లండన్ వదిలి రావాలా? లేదా? అనే సంశయంలో ఉన్నాడు. ఎందుకంటే బెంగుళూరులో లండన్ కంటే తక్కువ సంపాదన ఉన్నా.. అక్కడ ఖర్చులు తక్కువ. దీంతో బెంగుళూరులో కాస్త తక్కువ సంపాదన ఉన్నా సంతృప్తికరంగా జీవించవచ్చు అని ఆ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆలోచిస్తున్నారు. అయితే తాను ఏ నిర్ణయం తీసుకావాలో? సలహా ఇవ్వండి అని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ రెడ్డిట్ లో పోస్ట్ పెట్టాడు.

Also Read: విచిత్ర వివాహం.. 70 ఏళ్ల ముసలాడితో 25 ఏళ్ల యువతి పెళ్లి.. ఎలా కుదిరిందంటే?


పోస్ట్ లో తన పరిస్థితి మొత్తం వివరించాడు. యూరోప్ లో గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్న అతను బెంగుళూరులో కాస్త తక్కువ జీతం ఉన్నా.. అక్కడికి షిఫ్ట్ కావాలనుకుంటున్నట్లు తెలిపాడు. తన నిర్ణయం సరైనదేనా? అని రెడ్డిట్ లో బెంగుళూరు టెకీలను సలహా అడిగాడు. తన తల్లిదండ్రులు తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని.. ఇండియాలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ సరిగా లేదని కారణం చూపుతూ లండన్ లోనే ఉండి ఉద్యోగం చేసుకోవాలంటూ చెబుతున్నట్లు పోస్ట్ లో రాశాడు.

అయితే అతని పోస్ట్ కు రెడ్డిట్ ప్లాట్ ఫామ్‌లో విపరీతంగా యూజర్స్ రిప్లై ఇస్తున్నారు. ఒక యూజర్ సలహా ఇస్తూ.. ”భారతదేశంలో అవినీతి తారాస్థాయిలో ఉంది. ఇక్కడి భోజనం, గాలి, నీరు అంతా కలుషితమే. అవినీతి రాజకీయాలు, ఇవి ఉన్నాయి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అసలు లేదు” అని రాశడు.

మరొక యూజర్ అయితే.. “యూరోప్ లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అక్కడ కంపెనీలు కారణం లేకుండానే ఉద్యోగం నుంచి తొలగించలేవు. నీవు ఇండియా వచ్చి ఉద్యోగ భద్రత కోల్పోతావు. ఇక్కడ పని ఒత్తిడి, టాక్సిక్ కల్చర్ ఎక్కువ. అయినా ఇండియాలో సెటిల్ కావాలనుకుంటే రావచ్చు” అని కామెంట్ చేశాడు.

 

ఇంకొక యూజర్ కామెంట్ చేస్తూ.. “బెంగుళూరులో ప్రభుత్వ అధికారులతో డీల్ చేయాలి, ఆస్పత్రులు, ట్రైన్లు, రోడ్లు అంతా బాగుండవు. ఇండియాలో బాగా జీవించాలంటే కోట్ల రూపాయలు కావాలి లేదా నీకు బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉండాలి. అప్పుడే దేశంలో చట్టాలు ఉల్లంఘించినా దర్జాగా జీవించవచ్చు” అని రాశాడు.

చివరగా మరో నెటిజెన్ ఒక ఆసక్తికర కామెంట్ చేశాడు. ”యూరోప్ లో పనిచేస్తూ.. నువ్వు ఒక నెల మొత్తం సెలవు పెట్టి విదేశాలు తిరగవచ్చు. కానీ బెంగుళూరులో సంవత్సరానికి ఒక సారి 15 రోజులు సెలవు ఇస్తారు. బెంగుళూరుకు వచ్చే కంటే యూరోప్ లోనే నీ భవిష్యత్తు బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ” అని రెడ్డిట్ పోస్ట్ చేశాడు.

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×