Fake News: నిజం తెలుసుకునే లోపు.. అబద్దం గుమ్మం దాటి పోతుంది. ప్రస్తుతం అదే ట్రెండ్ కొనసాగుతోంది. అరచేతిలోకి టెక్ విప్లవం వచ్చాక, ఓ వైపు ఐఏ, ఇంకోవైపు ఫేక్ వీడియోలు రకరకాలుగా హంగామా చేస్తున్నాయి. అహ్మదాబాద్ విమాన ఘటనలోనూ కొందరు వ్యక్తులు అదే చేశారు. వారికి చెక్ పడింది.
సోషల్‌మీడియాలో పాపులర్ కావాలని కొందరు పిచ్చోళ్లు తెగ ఉబలాట పడుతుంటారు. సమయం, సందర్భానికి అనుగుణంగా ఘటనకు సంబంధించి వేరే వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నారు. అది తెలియక నిజమేనని చాలామంది నమ్మేస్తున్నారు. వాటిని షేర్ చేస్తున్నారు. అసలు కంటే ఫేక్ వీడియోల వ్యవహారం అధికమవుతోంది. చివరకు అదంతా అబద్దమని తేలిపోతుంది.
గురువారం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఎయిరిండియా విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 242 మంది మృత్యువాతపడ్డారు. ఈ సమయంలో ఘటనకు ఓ ట్రావెలర్ తన గోడును వెల్లబోస్తూ వీడియోలు బయటకు వచ్చాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పని పాటా లేని కొందరు కుర్రాళ్లు ఫేక్ వీడియోలను షేర్ చేయడం మొదలుపెట్టారు.
ఆ వీడియోలను చూసి చాలామంది షాక్ అయ్యారు. ఘటన అలాంటిది కావడంతో నిజమేకావచ్చని నమ్మేశారు. కరెక్టుగా అలాంటి వారిని ఓ కంట కనిపెట్టింది పీఐబీ ఫాక్ట్ టీమ్ చెక్ పెట్టింది. అదంతా అబద్దమని తేల్చేసింది.
ALSO READ: విమాన ఘటనపై ముందే వార్నింగ్.. 6 నెలల ముందే ఆ యువతి హెచ్చరిక
అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదంపై సోషల్ మీడియాలో ఫేక్ వీడియలు హల్‌చల్ చేస్తున్నాయి. ఓ వ్యక్తి.. విమాన ప్రమాదానికి ముందు తీసిన వీడియో అని చెబుతూ వాటిని వైరల్ చేయబోయాడు. దీనికి పీఐబీ ఫాక్ట్ చెక్ టీమ్ గమనించింది. ఆ వీడియోను క్షుణ్నంగా పరిశీలించిన ఫాక్ట్ చెక్ టీమ్, క్లారిటీ ఇచ్చింది. ఇది రెండేళ్ల కిందట అంటే 2023 నేపాల్‌లో జరిగిన విమాన ప్రమాద ఫుటేజీగా గుర్తించింది. ఇలాంటి ఫేక్ వీడియోలను షేర్ చేయవద్దని పీఐబీ టీమ్ యువతకు సూచన చేసింది.
గతంలో కూడా ఇలాంటివి జరిగాయి. దాయాది దేశం పాకిస్తాన్‌పై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ఆపరేషన్ చేపట్టింది. అప్పట్లో ఇరాన్ యుద్దానికి సంబంధించిన ఫోటోలను అప్‌లోడ్ చేయడం మొదలుపెట్టారు కొందరు యువకులు. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నం చేశారు. వీటిని జాగ్రత్తగా గమనించిన పీఐబీ ఫాక్ట్ చెక్ టీమ్, వాటికి ఫుల్‌స్టాప్ పెట్టేసింది. రానున్న రోజుల్లో ఇలాంటి వాటిపై దృష్టి పెట్టకుంటే దీనివల్ల ఎక్కువగా నష్టం జరిగే అవకాశముందని అంటున్నారు.
सोशल मीडिया पर एक पुरानी वीडियो को अहमदाबाद विमान हादसे से जोड़कर साझा किया जा रहा है। #PIBFactCheck
▶️ वीडियो नेपाल में जनवरी 2023 में हुए विमान हादसे की है।
▶️ आधिकारिक स्त्रोतों से प्राप्त सूचनाओं पर ही भरोसा करें।
▶️ अहमदाबाद विमान हादसे से जुड़ी प्रामाणिक जानकारी के… pic.twitter.com/5YUtbGbsa7
— PIB Fact Check (@PIBFactCheck) June 12, 2025