Viral News: అహ్మదాబాద్ విమానం ఘటనపై కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విమాన ప్రమాదం గురించి ఆరు నెలల కిందట ఓ యువతి ట్వీట్ చేసింది. ఆమె ఎక్స్ వేదికగా చేసిన ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనను ఆమె ఎలా అంచనా వేయగలిగింది?
ఆస్ట్రో షర్మిష్టా ఇండియా జ్యోతిష్కురాలు. అహ్మదాబాద్ విమాన ఘటన తర్వాత ఆమె ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె పోస్టు చేసిన ట్వీట్‌లో ఏం చెప్పిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విమాన ఘటన జరుగుతుందని ఆరునెలల కిందట అంచనా వేసిందట ఆమె. అదెలా సాధ్యం అన్నది చాలామంది రైజ్ చేస్తున్న ప్రశ్న.
గతేడాది అంటే 2024, డిసెంబర్ 29న ఆస్ట్రో షర్మిష్టా ఓ ట్వీట్ చేసింది. మృగశిర, ఆర్ద్ర నక్షత్రాలలో బృహస్పతి అంటే గురువు ఉండడంతో ఈ ఏడాది పౌర విమానయాన రంగం అభివృద్ధి చెందుతుందని అంచనా వేసింది. కాకపోతే సేఫ్టీ, సెక్యూరిటీ విషయంలో ఇబ్బందులు తప్పవని చెప్పకనే చెప్పింది. అంతేకాదు విమానం కూలిపోయిందనే వార్త వినాల్సి వస్తుందని ముందుగానే ఆమె అంచనా వేసింది.
విమాన ఘటనపై పైన రాసిన ట్వీట్ మొదటిది. సరిగ్గా ఈ ఏడాది జూన్ 5 అదే ట్వీట్‌ను రీ ట్వీట్ చేసింది. విమాన ప్రమాదం గురించి తనకు బలమైన అంచనా ఉందని ప్రస్తావించింది. గతేడాది నక్షత్రాలు సంచారం ద్వారా అంచనా వేసినట్టు పేర్కొంది. అలాగే టాటా హైదరాబాద్‌లో రాఫెల్ ఫ్యూజ్‌లేజ్‌ను తయారు చేస్తుందని ప్రస్తావించింది.
ALSO READ: విమానం కూలింది అర నిమిషంలోనే.. అక్కడ జరిగిన విధ్వంసం ఇదే
ఇది కేవలం విమానయాన విస్తరణ, రాబోయే రెండేళ్లలో అంతరిక్షం, ఉపగ్రహ ఇంజనీరింగ్, అంతరిక్ష పర్యాటకంలో ఇస్రో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుందని చెప్పకనే చెప్పింది. అహ్మదాబాద్ ఘోర విమాన ఘటన తర్వాత గురువారం సాయత్రం నాలుగున్నర గంటల సమయంలో ఆస్ట్రో షర్మిష్టా ఓ ట్వీట్ చేసింది.
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరమని ప్రస్తావించింది. బృహస్పతి ఇంకా ఆర్ద్రలోకి ప్రవేశించలేదని వివరించింది. దేశంలో అంగారక మహాదశ ఇంకా ప్రారంభం కాలేదు.. ఇంకా చాలా ఇప్పటికే ప్రారంభమైందని తెలిపింది. దానికి జూన్ 5న చేసిన ట్వీట్, దానికి లింకు గతేడాది డిసెంబర్ 29న చేసిన ట్వీట్లను జత చేసింది.
ఆస్ట్రో షర్మిష్టా ట్వీట్‌పై చాలా మంది అతి విశ్వాసంతో స్పందించారు. నక్షత్రాలు మన విమానాల మార్గాన్ని నిర్ణయిస్తున్నాయా? అంటూ ప్రశ్నలు రైజ్ చేశారు. మరొకరు మాత్రం ఇంత ఖచ్చితమైన అంచనా? తాను నక్షత్రరాశుల గురించి భయపడటం ప్రారంభించానని అన్నారు. కొంతమంది జ్యోతిష్కురాలు దూరదృష్టిని ప్రశంసించారు.
మరి కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో ఆస్ట్రో షర్మిష్టా పేరు మార్మోగుతోంది. గురువారం అంటే జూన్ 12న ఎయిరిండియా విమాన ప్రమాదంలో 242 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 81కి పైగా మృతదేహాలను గుర్తించినట్టు నివేదికలు చెబుతున్నాయి.
It is very unfortunate that we lost so many lives in Air India crash in Ahmedabad today. Jupiter is yet to enter Ardra, and India’s Mars Mahadasha is yet to begin—yet so much has already started. So many taggings, so many RTs, I’m unable to reply to everyone. Apologies for that.… https://t.co/OMMkUIaxTk
— Astro Sharmistha (@AstroSharmistha) June 12, 2025