Yellamma Movie : 9 నెలల క్రితం ‘జనక అయితే గనుక’ అనే మూవీ వచ్చింది. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నిర్మాత దిల్ రాజు గెస్ట్‌గా వచ్చాడు. అలాగే ‘బలగం’ సినిమాతో తన ఫేట్ మార్చుకున్న వేణు కూడా వచ్చాడు. ఈవెంట్‌లో వేణు చేయబోయే ‘ఎల్లమ్మ’ మూవీ గురించి డిస్కషన్స్ వచ్చాయి. అప్పుడు వేణు… దిల్ రాజు ఇప్పుడు స్టార్ట్ చేయమంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తాను అని అంటాడు.
దీనికి దిల్ రాజు.. ఇప్పుడు కాదు కానీ, నెక్ట్స్ ఇయర్ ఫిబ్రవరిలో షూట్ స్టార్ట్ అవుతుందని చెప్తాడు. ఆ ఫిబ్రవరి వెళ్లి నాలుగు నెలలు గడుస్తుంది. అయినా… ఎల్లమ్మ మూవీ మోక్షం రాలేదు. ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన ఎల్లమ్మ మూవీ ఎందుకు స్టార్ట్ అవ్వలేదు..? ఎల్లమ్మకు అసలేం అయింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం…
బలగం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వేణు డైరెక్షన్‌లో మరో మూవీ ఉంటుందని స్వయంగా నిర్మాత దిల్ రాజే ప్రకటించాడు. ఆ సినిమా పేరు ఎల్లమ్మ అని చాలా స్టేజ్‌ల పైన చెప్పుకొచ్చారు. బలగం సినిమా లాగే, ఎల్లమ్మ మూవీ కూడా తెలంగాణ పల్లెటూరు నేపథ్యంలోనే ఉంటుందని కూడా చెప్పారు.
ఫస్ట్ హీరో సమస్య
ముందుగా ఈ సినిమాకు హీరోగా నేచురల్ స్టార్ నాని అని అనుకున్నారు. కానీ, నానికి ఇతర ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అలాగే ఈ ఎల్లమ్మ సినిమా కథ కొంత వరకు నాని ఇప్పటికే చేసిన దసరా సినిమా స్టోరీలా ఉంటుందని రిజెక్ట్ చేశాడట. నాని తర్వాత హనుమాన్ మూవీతో హిట్ కొట్టిన తేజా సజ్జను కూడా దిల్ రాజు టీం సంప్రదించారట. రీజన్స్ ఏంటో తెలీదు కానీ, తేజా సజ్జ కూడా ఈ ప్రాజెక్ట్ చేయలేదు. దీంతో తెలంగాణ హీరో నితిన్‌ను ఫైనల్ చేశారు. నిజానికి ఈ ఎల్లమ్మ ప్రాజెక్ట్ నాని కంటే ముందుగా నితిన్ దగ్గరకే వచ్చిందట. కానీ, ఏవో రీజన్స్ వల్ల నితిన్ చేయలేనని అన్నాడట. కానీ, నాని రిజెక్ట్ చేసిన తర్వాత దిల్ రాజు కల్పించుకుని నితిన్‌ను ఒప్పించాడు అనే టాక్ ఉంది.
హీరోయిన్ సమస్య
కొంత వరకు ఇబ్బందులు అయినా… ఫైనల్‌గా హీరోను సెట్ చేశారు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే… తెలంగాణ పల్లెటూరు నేపథ్యంలో సినిమా కాబట్టి.. హీరోయిన్ పాత్రకు సాయి పల్లవి సరిగ్గా సెట్ అవుతుందని అనుకున్నారట. ఈ విషయం ఆమెకు కూడా చెప్పారు. కథ నచ్చడంతో ఒకే చెప్పిందట. కానీ, అదే టైంలో బాలీవుడ్‌లో రామయణం సినిమా వస్తుంది. ఆ సినిమాలో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తుంది.
బాలీవుడ్ ప్రాజెక్ట్. అందులోనూ ఎంతో పవిత్రమైన సీత పాత్ర. చరిత్రలో నిలిచి పోయే ఛాన్స్ ఉన్న భారీ మూవీ. కాబట్టి.. తన ఫస్ట్ ఛాయిస్ ఆ బాలీవుడ్ ప్రాజెక్ట్‌కే ఇచ్చింది. దీంతో ఎల్లమ్మను రిజెక్ట్ చేయాల్సి వచ్చింది.
కీర్తి సురేష్ కోసం వెయిటింగ్ ?
ఇక సాయి పల్లవి తర్వాత మళ్లీ తెలంగాణ స్లాంగ్‌కు సెట్ అయ్యే అమ్మాయి అంటే కీర్తి సురేష్. ఈమె అటు బాలీవుడ్, ఇటు కోలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం తమిళంలో రివాల్వర్ రీటా, కన్నివేది సినిమాలు చేస్తుంది. ఈ సినిమా సెట్స్‌లో ఉన్నాయి కాబట్టి… ఇటు ఎల్లమ్మకు డేట్స్ ఇవ్వడం అంటే కష్టమైన పని. అందుకే ఎల్లమ్మ మూవీని హోల్డ్‌లో పెట్టింట.
ఆ సినిమాల్లో కీర్తి పార్ట్ కంప్లీట్ అయితే, ఎల్లమ్మకు డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ డైరెక్టర్ వేణు, ప్రొడ్యూసర్ దిల్ రాజు అందు కోసమే వెయిట్ చేస్తున్నట్టు సమాచారం. కీర్తి సురేష్ ఎప్పుడు వస్తే అప్పుడే ఎల్లమ్మ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ ఉంది.