E-Paper
Advertisement

Gen Z intelligence: జెన్ జెడ్ తెలివైనోళ్లు కాదట.. ముందు తరాలే బెటరట.. స్టడీలో షాకింగ్ నిజాలు!

Gen Z intelligence: జెన్ జెడ్ తెలివైనోళ్లు కాదట.. ముందు తరాలే బెటరట.. స్టడీలో షాకింగ్ నిజాలు!
Advertisement

Gen Z intelligence: సాధారణంగా 1997-2012 మధ్య జన్మించిన వారిని జెన్ జెడ్ (Gen Z – Generation Z) అని పిలిస్తుంటారు. డిజిటల్ యుగంలో పుట్టి.. సాంకేతికతతో పెరుగుతున్న వీరికి గత తరాలతో పోలిస్తే విజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సహజంగానే జెన్ జెడ్ యువత చాలా తెలివిగా ఉంటారని.. ప్రతీ విషయం పట్ల పూర్తి అవగాహన వీరికి ఉంటుందని అంతా భావిస్తుంటారు. అయితే రీసెంట్ స్టడీస్ లో ఇందుకు భిన్నమైన ఫలితాలు వచ్చాయని తెలుస్తోంది. అసలు వీరు మేధస్సు కలిగిన వారే కాదని నమ్మలేని విషయాలు బయటపడ్డాయి.

ఈ లోపాలు గుర్తింపు..

జెన్ జెడ్ యువతపై నిర్వహించిన రీసెంట్ స్టడీస్ లో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. Gen Z యువతీ, యువకులు.. ముందు తరం కంటే తక్కువ తెలివి తేటలు కలిగిన ఏకైక తరం అని అవి సూచిస్తున్నాయి. ఒక న్యూరో సైంటిస్ట్ ప్రకారం.. విద్యా సాంకేతికత” (EdTech) వాడకం వల్ల Gen-Zలో సొంతంగా ఆలోచించే శక్తి తగ్గిపోయింది. మునుపటి తరంతో పోలిస్తే జ్ఞానం, ఆలోచన శక్తిలో తక్కువ స్కోరును గ్రూప్ జెన్ నమోదు చేసింది. జెన్ జెడ్ కు ముందు తరం మిలేనియల్స్ (1981 – 1996 మధ్య జన్మించినవారు)తో పోలిస్తే.. తక్కువ ఏకాగ్రత, సమస్యను పరిష్కరించే సామర్థ్యం లేకపోవడం, గణిత నైపుణ్యం కొరవడటం, నేర్చుకోవాలన్న తపన మందగించడం వంటి సమస్యలను వారిలో గుర్తించారు.

మేధా శక్తి కోల్పోతున్నారట..

Advertisement

ఉప్యాధ్యాయుడి నుంచి శాస్త్రవేత్తగా మారిన డాక్టర్ జారెడ్ కూనీ హోర్వత్ (Dr Jared Cooney Horvath) ప్రకారం.. విజ్ఞానం పెంచుకునేందుకు ఎక్కువ అవకాశం ఉన్నప్పటికీ జెన్ జెడ్ మేధస్సు స్థాయి చాలా తక్కువే ఉంది. ఇదే విషయాన్ని ఆయన యూఎస్ సెనేట్ కమిటీ ఆన్ కామర్స్: సైన్స్ అండ్ ట్రాన్స్ పోర్టేషన్ (US Senate Committee on Commerce, Science and Transportation)కు కూడా తెలియజేశారు. ప్రతీ చిన్న విషయానికి జెన్ జెడ్ తరం సాంకేతికతపై ఆధారపడుతోందని.. ఫలితంగా స్వతహాగా ఆలోచించే మేధా శక్తిని వారు కోల్పోతున్నారని హోర్వత్ అభిప్రాయపడ్డారు. 2010 నుంచి వారిలో మేధస్సు తగ్గిపోతుందని చెప్పేందుకు అవసరమైన డేటాను సైతం ఈ సందర్భంగా హోర్వత్ పంచుకున్నారు.

Also Read: Mahindra XUV 7XO: అదిరిపోయే మ్యూజిక్, ఆహా అనిపించే విజువల్స్.. వచ్చేస్తోంది కొత్త మహీంద్రా XUV 7XO!

ఆన్ లైన్ క్లాసుల వల్లే..!

Advertisement

ఒక టీనేజర్ నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకూ ఉన్న సమయంలో సగానికి పైగా స్క్రీన్ (స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్) వైపు చూస్తూ గడిపేస్తున్నారని న్యూయార్క్ పోస్టు కథనంలో హోర్వత్ పేర్కొన్నారు. మానవ పరిణామ క్రమం ముఖాముఖి చర్చల ద్వారానే పురగోతి సాధించిందని.. ప్రస్తుతం పెరిగిపోతున్న స్క్రీన్ ఆధారిత అభ్యాసం (ఆన్ లైన్ క్లాసులు) గత తరాల నుంచి కొనసాగుతూ వస్తోన్న ఈ ప్రక్రియను దెబ్బతీస్తున్నట్లు హోర్వత్ తో పాటు పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా మానవులు.. ఏ విషయాన్నైనా లోతైన అధ్యయనం ద్వారానే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని.. బుల్లెట్ పాయింట్ సారాంశాల వల్ల వారిలో చెప్పుకోతగ్గ స్థాయిలో అవగాహనం పెరగడం లేదని హోర్వత్ చెప్పుకొచ్చారు. జెన్ జెడ్ లో పెరుగుతున్న ఈ సమస్యను అమెరికా సహా 80పైగా దేశాల్లో గుర్తించామని ఆయన స్పష్టం చేశారు.

Also Read: Gujarati Sweets: నోరూరించే గుజరాతీ స్వీట్స్.. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×