BigTV English

Suicide Fail On Railway Track: రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లిన యువతి.. ట్రైన్ కోసం ఎదురుచూస్తూ..

Suicide Fail On Railway Track: రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లిన యువతి.. ట్రైన్ కోసం ఎదురుచూస్తూ..

Suicide Fail On Railway Track| జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కోలేక.. కొంతమంది బలహీన మనస్తత్వం కలవారు.. ఆత్మహత్య చేసుకుంటారు. ఈ లోకంలో వదిలి వెళ్లిపోవాలని ఎన్నో మార్గాలు అన్వేషిస్తారు. ఈ క్రమంలోనే చాలాసార్లు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారనే ఘటనల గురించి తరుచూ వింటూనే ఉంటాం. అయితే తాజాగా అలాంటిదే ఒక ఘటనలో ఒక యువతి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించగా.. ఆమెకు విచిత్ర అనుభవం ఎదురైంది.


వివరాల్లోకి వెళితే.. బిహార్ రాష్ట్రంలోని చకియా రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ పై ఆత్మ హత్య చేసుకోవాలని ఒక యువతి వెళ్లింది. అయితే రైల్వే ట్రాక్ పై ట్రైన్ కోసం ఎదురుచూస్తూ అలసిపోయి ఆమె నిద్రపోయింది. అలా కొంత సమయం తరువాత మృత్యదేవత రూపంలో ట్రైన్ రానే వచ్చింది. కానీ యువతికి ఇంకా ఆయుష్షు తీరలేదు. అందుకే రైల్వే ట్రాక్ పై నిద్రపోతున్న యువతి పై ట్రైన్ డ్రైవర్ (లోకో పైటల్) కన్ను పడింది. అది కూడా ఆమెకు అతిసమీపంగా వచ్చిన తరువాత అతను చూశాడు.

ఆ యువతిని కాపాడాలని అతను కష్టపడి ట్రైన్ ని ఆపాడు. కానీ ట్రైన్ ఆ యువతికి తల అంచున వచ్చి ఆగింది. దీంతో ఆమెకు ప్రాణాపాయం తృటిలో తప్పింది. వెంటనే ట్రైన్ డ్రైవర్ దిగి వచ్చి ఆమెను నిద్ర లేపాడు. యువతి నిద్రలేచి చూడగా.. ఆమెకు ఆనుకొని ట్రైన్ నిలబడి ఉంది. ఆ డ్రైవర్ ఆమెను లేపడానికి ప్రయత్నించగా ఆ యువతి అతడిని వదిలించుకొని ..”నన్ను వదిలేయండి, మీకెందుకు నేనేం చేసినా మీకెందుకు” అని చెబుతూ ఆ డ్రైవర్ తో కోపంగా మాట్లాడింది.


Also Read: విచిత్ర వివాహం.. 70 ఏళ్ల ముసలాడితో 25 ఏళ్ల యువతి పెళ్లి.. ఎలా కుదిరిందంటే?

అయినా డ్రైవర్ తో పాటు స్థానికులు అక్కడికి చేరుకొని ఆమెను బలపూర్వకంగా రైల్వే ట్రాక్ పై నుంచి పక్కకు తీశారు. ఆ తరువాత ఆ యువతికి నచ్చ జెప్పి ఇంటికి పంపించారని తెలసింది. ఈ ఘటన స్థానికులెవరో వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియోకు విపరీతంగా వ్యూస్ వస్తున్నాయి. దీనిపై కొందరు నెజిజెన్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు. కొందరు ఈ వీడియోపై సరదా కామెంట్స్ చేస్తుంటే .. మరికొందరు ఆ యువతికి వచ్చిన కష్టాల గురించి రాస్తున్నారు.

Related News

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Viral News: కెమెరాకు చిక్కిన రాక్షసుడు.. కుక్కతో ఆ విధంగా, జంతు ప్రేమికులు ఆగ్రహం

Washing Machine Mistake: వాషింగ్ మెషిన్‌లో బట్టలు వేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే..

Big Stories

×