BigTV English
Advertisement

Hyderabad: ఘనంగా కాస్మో డెంటల్ గ్రూప్ ఫ్రాంచైజీ ప్రారంభోత్సవం!

Hyderabad: ఘనంగా కాస్మో డెంటల్ గ్రూప్ ఫ్రాంచైజీ ప్రారంభోత్సవం!

Hyderabad..భారతదేశంలో ప్రైవేట్ ప్రాక్టీస్ డెంటిస్ట్రీని విప్లవాత్మకంగా మార్చాలనే దృష్టితో డెంటల్ కేర్ నెట్వర్క్ లను వేగంగా విస్తరిస్తున్నారు. ఇందులో ఒకటైన కాస్మో డెంటల్ గ్రూప్ ఈరోజు హైదరాబాదులో ఘనంగా తన కొత్త ఫ్రాంచైజీని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజీవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవ్వగా.. ఆయనతోపాటు ముఖ్య అతిథిగా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ (IDA), తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ నరసింహస్వామి కూడా పాల్గొన్నారు.


అలాగే హైదరాబాద్లోని పలువురు సీనియర్ డెంటిస్టులతో పాటు విద్యావేత్తలు కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కాస్మో డెంటల్ గ్రూప్ తన ప్రత్యేకమైన FOFO (ఫ్రాంచైజీ – ఓన్డ్ , ఫ్రాంచైజీ- ఆపరేటర్) మోడల్ కింద హైదరాబాదులో మొత్తం ఐదు ఫ్రాంచైజీ క్లినిక్లను అధికారికంగా ప్రారంభించినట్లు స్పష్టం చేసింది. ఇకపోతే ఈ కాస్మో డెంటల్ గ్రూప్లో ప్రముఖ డెంటల్ వైద్యులు కూడా ఇప్పుడు భాగమైనట్లు ఆ సంస్థ వెల్లడించింది.

ఇకపోతే ఈ గ్రూపులో భాగమైన ప్రముఖ డెంటల్ వైద్యుల విషయానికొస్తే..


1.డాక్టర్ అరవింద్ యూడీ, అమీర్ పేట..

ఈయన వేలకొద్దీ విజయవంతమైన ఇంప్లాంట్లతో ప్రసిద్ధి చెంది ఇంప్లాంటాలజిస్ట్ గా పేరు సొంతం చేసుకున్నారు.

2.ప్రొఫెసర్ డాక్టర్ భద్ర రావు, బోడుప్పల్..

ఈయన మైక్రో ఎండోడాంటిస్ట్ మాత్రమే కాదు విద్యావేత్త కూడా..

3.డాక్టర్ అజయ్ మోహన్, అత్తపూర్..

ఈయన పిల్లల డెంటల్ కేర్లో పేరుపొందిన పీడోడాంటిస్ట్

4.డాక్టర్ సునీల్ మంగళం, మెహదీపట్నం..

ఈయనకు పలు ప్రసిద్ధ క్లినిక్ లలో మంచి పేరు ఉంది. అలా ప్రాక్టీస్ ఉన్న సీనియర్ మైక్రో ఎండోడాంటిస్ట్ గా పేరు సొంతం చేసుకున్నారు.

5.డాక్టర్ అర్చన, నల్లగండ్ల..

ఈమె డిజిటల్ డెంటిస్ట్రీ పట్ల అభిరుచి ఉన్న ఉత్సాహవంతమైన క్లినీషియన్.

ఇలా మొత్తం 5 మంది ఈ గ్రూపులో భాగమయ్యారు. ఈ సందర్భంగా కాస్మో డెంటల్ గ్రూప్ డైరెక్టర్ మాట్లాడుతూ.. “కాస్మో అనేది కేవలం ఒక ఫ్రాంచైజీ కాదు. ఇది ఇండియాలోని అత్యుత్తమ క్లినికల్ నిపుణులను ఒకే చోట చేర్చే బ్రాండ్. అత్యధిక టెక్నాలజీతో పేషెంట్స్ కి ఉత్తమ సౌకర్యాలను అందించడమే మా లక్ష్యం. ఇండియన్ డెంటిస్ట్రీలో కొత్త అధ్యయనానికి దారితీస్తుంది” అంటూ ఆయన స్పష్టం చేశారు.

అంతేకాదు ఈ సందర్భంగా నిర్వహించిన స్నాతకోత్సవ వేడుకలలో కాస్మోడెంటల్ క్లినికల్ మాస్టర్ షిప్ ప్రోగ్రాం నుండి గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న కొత్త బ్యాచ్ ని కూడా సన్మానించారు. కొత్తగా డెంటిస్ట్ గా మారుతున్న యంగ్ డెంటిస్ట్ లకు అడ్వాన్స్డ్ క్లినికల్ ట్రైనింగ్ కూడా ఈ గ్రూపు ఇవ్వనున్నట్లు తెలిపారు.

Related News

Viral Video: ఆఫీసులో తింగరి వేషాలేంటి? హీటెక్కిపోయిన బ్యాంక్ మేనేజర్, ఆ తర్వాత ఏం జరిగిందంటే

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Big Stories

×