E-Paper
Advertisement

Gujarat Job Interview Video Viral: 10 ఉద్యోగాలకు 1800మంది..తొక్కిసలాట వీడియో వైరల్

Gujarat Job Interview Video Viral: 10 ఉద్యోగాలకు 1800మంది..తొక్కిసలాట వీడియో వైరల్
Advertisement

Gujarat Job Interview Video Viral: గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలో పది ఉద్యోగాల కోసం పద్దెనిమిది వందల మందికిపైగా అభ్యర్థులు తరలివచ్చారు. అంకలేశ్వర్‌లోని హోటల్ లార్డ్స్ ప్లాజాలో ఒక కెమికల్ సంస్థ వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించింది. అయితే అభ్యర్థులు ఒక్కసారిగా రావడంతో ఇంటర్వ్యూలో తొక్కిసలాట జరిగి గందరగోళం నెలకొంది.

భరూచ్ జిల్లాలో ఓ ప్రైవేట్ కెమికల్ కంపెనీలో 10 పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులను ఇంటర్వ్యూ కోసం ఆహ్వానించింది. దీంతో అభ్యర్థులు రెజ్యూమ్ కాపీలను చేతిలో పట్టుకొని క్యూలో నిల్చున్నారు. ఒక్కసారిగా అభ్యర్థుల సంఖ్య పెరిగిపోవడంతో గందరగోళం నెలకొంది. అందరూ ఒకేసారి హోటల్ గేటు నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉన్న రైలింగ్ ఒంగిపోయింది. కొంతమంది ఏకంగా కిందపడడంతో రైలింగ్ విరిగిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

ఉద్యోగాల విషయానికొస్తే.. షిఫ్ట్ ఇన్‌చార్జ్, ప్లాంట్ ఆపరేటర్, సూపర్ వైజర్, ఫిట్టర్, మెకానికల్, ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కోసం 1800మందికిపైగా తరలివచ్చారు. దీంతో అక్కడ పరిస్థితి గందరగోళానికి దారితీసుంది. ఈ ఉద్యోగాల కోసం కెమికల్ ఇంజనీరింగ్, బీఈ, ఐటీఐ చదివిన అభ్యర్థులు హాజరైనట్లు తెలుస్తోంది.

Tags

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×