Lee Shau Kee: ఆసియా వారెన్ బఫెట్‌గా పిలవబడే హాంకాంగ్ రియల్ ఎస్టేట్ టైకూన్ లీ షావ్ తన కోడలు హాంకాంగ్ నటి కేతీ చుయికి వేలకోట్ల విలువైన కానుకలను ఇచ్చారు. మొత్తంగా వాటి వాల్యూ ఎంతనో తెలిస్తే షాక్ అవుతారు. అక్షరాల 257 మిలియన్ డాలర్లు. అంటే భారత్ కరెన్సీలో రూ.2209 కోట్లు అన్నమాట.
ఈ ఏడాది మార్చి 17న మృతిచెందిన ఆయనకు 29.2 బిలియన్ డాలర్లు విలువైన ఆస్తిపాస్తులు ఉన్నాయి. లీ షావ్ చనిపోయే నాటికి అతని వయసు 97 ఏళ్లు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు పీటర్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారంతా సరోగసీ ద్వారా జన్మించారు.
చిన్నకుమారుడు మార్టిన్ లీ భార్య పేరు కేతీ చుయి. ఆమె ఒక నటి. తర్వాత సామాజిక కార్యకర్తగా మంచి పేరు తెచ్చుకున్నారు. మార్టిన్ లీ ను 2006లో పెళ్లి చేసుకుంది. ఆమెకు నలుగురు పిల్లలున్నారు. మ్యారేజీకి ముందు వరకు నటిగా ఉన్న ఆమె.. ఆ తర్వాత సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఇలానే గొప్ప సామాజిక కార్యకర్తగా మరింత గుర్తింపు పొందారు. ఒక మార్గదర్శిగా నిలిచారు. ఆమె చేసిన సేవలకుగానూ చాలా అవార్డులు వచ్చాయి.
Also Read: Railway Jobs: ఇంటర్, ఐటీఐతో రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఇదే?
లీ షావ్‌కీ చనిపోయే వరకు కోడలికి చాలా బహుమతులు ఇచ్చారు. మొత్తంగా 257 మిలియన్ డాలర్ల విలువైన కానుకలు ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. వాటిలో ఒక యాచ్, ఒక విలాస భవనం, ఆమె పిల్లల చదువు కోసం ఎడ్యుకేషన్ ఫండ్, మిలియన్ల డాలర్ల విలువైన భూమి ఇచ్చారని తెలుస్తోంది.
Also Read: 70 Snakes: టాయిలెట్ ట్యాంక్‌లో 70 పాములు.. వీడియో చూస్తే వణికిపోతారు!
కేతీ చుయి తన బిడ్డకు జన్మనిచ్చిన ప్రతిసారి విలువైన బహుమతులు ఇచ్చారు. 2015లో ఆమె చివరి బిడ్డ జన్మించిన సమయంలో తన ఉద్యోగులకు భారీ నగదును లీ షావ్‌కీ బహుమతిగా ఇచ్చినట్టు వార్తలు వైరల్ అవుతున్నామి. దాంతో కేతీ చుయి పేరు మీడియాలో ‘హండ్రెడ్ బిలియన్ డాటర్-ఇన్-లా’గా వైరల్ అవుతోంది.