Tanikella Bharani: తెలుగు సినీ రంగంలో తనికెళ్ళ భరణి అంటే తెలియని వారు ఉండరు. నటుడిగా, రచయితగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు తనికెళ్ల భరణి. నాటక రంగం నుండి సినీ ఇండస్ట్రీ వరకు ఆయన ప్రయాణం సాగింది. కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్, చెట్టు కింద ప్లీడర్, ఇలా ఎన్నో సినిమాలకు రచయిత గా పనిచేశారు. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్, ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం థగ్ లైఫ్. జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా తనికెళ్ల భరణి, మణిరత్నం సినిమాపై కామెంట్స్ చేసారు.ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..
అప్పుడు తీసేశారు.. కట్ చేస్తే..
టాలీవుడ్ లో కామెడీ కి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఓవైపు కామెడీ పాత్రలు చేస్తూ, విలన్ పాత్రలలోనూ తనికెళ్ల భరణి నటించి మెప్పించారు. తాజాగా ఆయన మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న థగ్ లైఫ్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. కమల్ హాసన్ గారి సినిమా మరోచరిత్ర నేను ఎన్నోసార్లు చూశాను. అది చూడడమే ఎంతో అదృష్టంగా అనుకుంటాను. అలాంటిది ఆయనతో కలిసి నటించడం అంటే నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. భారతదేశంలోని లోక నాయకుడు అంటే కమలహాసన్, ఓ క్యారెక్టర్ కోసం ఆయన పడే తపన, ఆయన పడే కష్టం, ఆయనను ఆ ప్లేస్ లో ఉంచాయి. కమలహాసన్ గురించి రాయమంటే ఓ పుస్తకం రాసేయొచ్చు. మణిరత్నం గారి సినిమాలు చూసి మేము పెరిగాను. ఒకప్పుడు ఆయనతో నేను ఓ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్నాను. రజినీకాంత్ సినిమా, మణిరత్నం దర్శకత్వంలో నన్ను సెలెక్ట్ చేశారు. డ్రెస్ అంతా వేసి ఈ క్యారెక్టర్ కి మీరు సూట్ కారు అని, వయసు సరిపోలేదని, వద్దని పంపించారు. ఆ తర్వాత 30 సంవత్సరాలకు ఆయన దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ మూవీలో తెలుగుకి స్క్రిప్ట్ రాసే అవకాశం వచ్చింది. అది నేను ఎంతో గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఆ సినిమా టైమ్ లోనే నేను ఆయన అడిగాను, ఎప్పుడో సినిమా మిస్ అయిపోయింది. ఒక చిన్న షార్ట్ మీ దర్శకత్వంలో చేయాలని ఉంది. ఇస్తారా అని అడిగితే, ఆయన నవ్వేసి వెళ్లిపోయారు అప్పుడు ఇవ్వరేమో అనుకున్నాను. కానీ తర్వాత ఫోన్ వచ్చింది ఈ చిత్రంలో ఓ మంచి క్యారెక్టర్ లో వీరందరితో కలిసి నటించే అవకాశం నాకు వచ్చింది. అని ఆయన తెలిపారు.
తెలుగు లో రిలీజ్ చేస్తుంది ..ఆ సంస్థ
ఇక థగ్ లైఫ్ మూవీ జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. లెజెండ్రీ దర్శకుడు మణిరత్నం హై వోల్టేజ్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. త్రిష శింబు, ఐశ్వర్య లక్ష్మి, నాజర్, తనికెళ్ల భరణి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. హీరో నితిన్ ఫాదర్ ఎం సుధాకర్ రెడ్డి శ్రేష్ట మూవీస్ ద్వారా ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నారు. గతంలో విక్రమ్, అమరన్ లాంటి బ్లాక్ బస్టర్లను ఈ సమస్థ తెలుగు లో విడుదల చేసింది.