70 Snakes: మన కళ్ల ముందు ఒక్క పాము కనబడితేనే వెనక్కి తిరిగి ఒక్కటే పరుగులు తీస్తాం. పాము మనవైపు వస్తుందంటేనే గజగజ వణికిపోతాం. అలాంటిది 70 పాములు ఒక్కేచోట గుంపుగుంపులుగా కనిపిస్తే.. ఎట్లంటుది. గుండె దద్దరిల్లిపోదు. ఉత్తరప్రదేశ్ లో స్వయంగా ఒక్కేటోట గుంపుగుంపులుగా 70 కనిపించిన షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. యూపీలోని మహారాజ్ గంజ్ జిల్లా హరది డాలీ గ్రామంలో టాయిలెట్ పై నిర్మించిన ట్యాంక్ లో పాములు కనిపించాయి. టాయిలెట్ పై ఉన్న ట్యాంక్ ను నీటిగా కడగడానికి వెళ్లిన ఇంటి యజమాని వీరేంద్ర గుప్త పాములు గుంపును చూశాడు. అతడిని చూడగానే పాములన్నీ బుసలు కొట్టడం షురూ చేశాయి. దీంతో అతను అరచేతిలో ప్రాణాలను పెట్టుకుని అరుస్తూ పరుగలు తీశాడు.
ఎలా రెస్క్యూ చేశారంటే?
వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇచ్చాడు. వీరేంద్రగుప్తాకు సాయం చేసేందుకు వచ్చిన స్థానికులు ఆ పాములను చూసి దద్దరిల్లిపోయారు. పాములను చూడడానికి పెద్దసంఖ్యలో ప్రజలు గుమిగూడారు. స్థానికులు వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చాచరు. దీంతో అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు చాలా రెస్క్యూ చేసి 70పాములను పట్టి.. దగ్గరలోని అడవీలో వదిలిపెట్టారు. ఈ హరదీ విలేజ్ నేపాల్ దేశానికి అత్యంత దగ్గరలో ఉంది. ఈ విలేజ్ చుట్టూ దట్టమైన అడవి ఉంది.
🚨SHOCKING: 7️⃣0️⃣ snakes🐍 found inside a toilet🚽 tank. pic.twitter.com/p3lVMxnB4W
— Manobala Vijayabalan (@ManobalaV) May 21, 2025
సోషల్ మీడియాలో వీడియో వైరల్
హరది డాలీ విలేజీలో వీరేంద్ర గుప్తా కొత్త గృహాన్ని కట్టుకున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఆ ఇంటి పనులు పూర్తి చేసుకున్నాడు. బాత్రూంపై ఉన్న నీటి ట్యాంక్ ను క్నొ రోజుల కింద నీటితో నింపాడు. ఆ నీటిని వాడకుండా వదిలేశాడు. దీంతో ఆ నీటిని కడిగి శుభ్రం చేసేందుకు టాయిలెట్ పైకి ఎక్కాడు. దీంతో 70 పాములను చూసిన వీరేంద్ర గజగజ వణికిపోయాడు. గుండె దడ పుట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ALSO READ: Tamarind Tree: 150 మంది ప్రాణాలను కాపాడిన చింతచెట్టు.. ఇప్పటికీ సజీవంగా ఉంది.. ఎక్కడో తెల్సా
సైంటిస్టులు ఏమన్నారంటే..?
అయితే, అసలు ఇన్ని పాములు ఒకే చోట ఎలా చేరి ఉండొచ్చని .. సోషల్ మీడియా వేదికగా తెగ చర్చ జరుగుతోంది. పాములు ఒక్కదానికి ఒక్కటి చుట్టుకున్నట్టు వీడియోలో చాలా క్లారిటీగా కనిపిస్తోంది. అయితే చీకటిగా ఉండి.. మనుషులు ఉండని ప్రాంతాల్లోనే పాములు తన నివాసాలను ఏర్పాటు చేసుకుంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. వీరేంద్ర గుప్తా కట్టుకున్న కొన్ని రోజుల నుంచి ఖాళీగా ఉంటుంది. అందువల్లే అక్కడకి పాములు చేరాయని సైంటిస్టులు చెబుతున్నారు.
ALSO READ: NIACL Recruitment: ఇది సువర్ణవకాశం, డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్..