E-Paper
Advertisement

Viral Video: హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఒంటరిగా సైకిల్ తొక్కిన మహిళా వ్యాపారవేత్త, కారణం ఇదేనట!

Viral Video: హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఒంటరిగా సైకిల్ తొక్కిన మహిళా వ్యాపారవేత్త, కారణం ఇదేనట!
Advertisement

హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా వ్యాపారవేత్త తెల్లవారుజామున 2 గంటలకు సైకిల్ తొక్కుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కావ్య మేథి ఖండేల్వాల్ తన  స్మార్ట్‌ బైక్ కొద్ది మంది ఫ్రెండ్స్ తో కలిసి సైకిలింగ్ చేసింది. వీడియోలో వాహనాలు లేని రోడ్డు పక్కన ట్రాక్ లో హ్యాపీగా.. కూల్ వెదర్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇంకో  సైకిల్‌ మీద తన సోదరితో రేసింగ్‌ చేస్తున్నట్లు చూపించింది. అర్థరాత్రి సమయంలో మహిళలు అంతా సేఫ్ గా హ్యాపీగా హైదరాబాద్ వీధుల్లో సైకిల్ తొక్కిన విజువల్స్ చూసి ఇతర నగరాల ప్రజలు క్రేజీగా రియాక్ట్ అవుతున్నరు. హైదరాబాద్ ఎంత సేఫ్ సిటీనో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇంటర్నెట్ లో వీడియో వైరల్

కావ్య ఖండేల్వాల్ ఈ వీడియోను తన ఇన్‌ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆమె ఫస్ట్ ఒంటరిగా సైక్లింగ్ మొదలు పెడుతుంది. కూల్ వెదర్ ను ఎంజాయ్ చేస్తూ ముందుకు కదులుతుంది. సైక్లింగ్ ట్రాక్‌పై వేగంగా దూసుకెళ్తుంది. కొద్ది సేపటి తర్వాత ఆమె స్నేహితులు కూడా తనతో జాయిన్ అయ్యారు. అందరూ నవ్వుతూ హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్లారు. రేసింగ్ చేస్తూ, హైదరాబాద్ రాత్రి పూట అందాలను ఆస్వాదించారు. ఆమె విశాలమైన ఖాళీ ట్రాక్‌లు, శుభ్రమైన పరిసరాలు, ప్రశాంతమైన వాతావరణాన్ని చూపించింది. “హైదరాబాద్ లో నేను తెల్లవారుజామున 2 గంటలకు సైకిల్ తొక్కుతున్నాను. వాతావరణం చాలా బాగుంది. నా జీవితంలో ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి అనుభూతిని ఆస్వాదించలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది” అని వీడియోలో చెప్పుకొచ్చింది.

Advertisement

నెటిజన్లు ఏమంటున్నారంటే?

ఈ ఇన్ స్టా వీడియోను చూసి నెటిజన్లు క్రేజీగా రియాక్ట్ అయ్యారు. “హైదరాబాద్ గురించి ఎవరు పాజిటివ్ గా మాట్లాడినా సంతోషంగా ఉంటుంది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “ఇండియాలోని ప్రతి సిటీలో రహదారులు ఇలాగే ఉండాలి. ప్రజలు అర్థరాత్రి కూడా ఇంత సేఫ్ గా తిరుగుతూ కనిపించాలి” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. “ఇలాంటి వీడియోలు ఎక్కువగా చేయకండి. నార్త్ ఇండియా వాళ్లు ఇక్కడికి వచ్చేస్తారు” అని మరో నెటిజన్ వార్నింగ్ ఇచ్చాడు. “విద్యావంతులు, సృజనాత్మకత, దార్శనిక నాయకుల ఆలోచనలకు ఫలితాలు ఇలాగే ఉంటాయి” అని అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “వారి సైకిల్ 5 కిలో మీటర్ల దూరం వెళ్లాక ఛార్జింగ్ అయిపోతుంది. ఆ తర్వాత తెలుస్తుంది అసలు సైకిలింగ్ కష్టం ఏంటో?” అని మరో నెటిజన్ పోస్టు పెట్టాడు.

సైక్లింగ్ ట్రాక్ గురించి..

Advertisement

ఈ వీడియోను హైదరాబాద్‌ హెల్త్‌ వే సైక్లింగ్ ట్రాక్‌ లో షూట్ చేశారు. దేశంలో తొలి సోలార్ ప్యానల్స్ తో కప్పబడిన ట్రాక్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇది 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఈ 23 కి.మీ మార్గం ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంటుంది. పర్యావరణ అనుకూల ప్రయాణం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ఈ సైకిలింగ్ ట్రాక్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది.

Read Also: అరే మీరు స్నేహితులేనా? ఫ్రెండ్ బర్త్ డే కేకులో బాంబులు పెట్టి..

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×