Ikea Marriage Test: మీకు కాబోయే భాగస్వామి మీకు కరెక్ట్ సూట్ అవుతారో లేదో అని తెలుసుకోవాలని ఉందా..? అయితే మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ‘ఐకియా మ్యారేజ్ టెస్ట్’ గురించి తెలుసుకోండి.
మూములుగా ఎవరైనా పెళ్లి చేసుకునే ముందు భాగస్వామి గురించి ఊహించుకుంటారు. వీటిల్లో కొన్ని తమా షాగా ఉంటాయి. ఇందులో కొన్ని సీరియస్ గా, ఇంకొన్ని సింపుల్ గా, మరికొన్ని సరదాగా ఉంటాయి. అయితే, ప్రముఖ బిజినెస్ మ్యాన్, రచయిత సాహిల్ బ్లూమ్ మాత్రం సరికొత్తగా మ్యారేజ్ చేసుకోబోయే వారికి ఒక పరీక్షను సిఫార్సు చేశారు. దానికే ‘ఐకియా మ్యారేజ్ టెస్ట్’ అని పేరు పెట్టారు. ఈ టెస్ట్ తో మీరు.. మీ పార్ట్ నర్, మీకు సూట్ అవుతారా..? లేదా..? అనేది ఈజీగా తెలుసుకోవచ్చు.
ఐకియా మ్యారేజ్ టెస్ట్ అంటే ఏమిటి..?
ఈ ఐకియా టెస్ట్ గురంచి మనం ఇప్పుడు ఈ జీగా తెలుసుకుందాం. న్యూయార్క్ టైమ్స్ ‘ది 5 టైప్స్ ఆఫ్ వెల్త్’ పుస్తక రచయిత, ప్రముఖ బిజినెస్ మ్యాన్ సాహిల్ బ్లూమ్ ప్రకారం.. మ్యారేజీకి ముందు జంటలు ఐకియాకు వెళ్లి.. ఓ ఫర్నీచర్ పీసెస్ ను కొనాలి.. తర్వాత వాటికి కలిసి ఫిక్స్ చేయాలి.. అంతే ఐకియా మ్యారేజ్ టెస్ట్ అయిపోయినట్టే.
ఎలాంటి ఇష్యూలు లేకుండా.. కలిసిగట్టుగా మీరు ఫర్నీచర్ పీసెస్ ను విజయవంతంగా అమర్చుతారో.. వారు ఇక మ్యారేజీకి రెడీ ఉండాలి అని సాహిల్ బ్లూమ్ చెప్పుకొచ్చారు.
బిజినెస్ మ్యాన్, ఎకనామిస్ట్, సోషియాలజీలో డబుల్ మేజర్‌తో స్టాన్ఫోర్డ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సాహిల్ బ్లూమ్ ప్రకారం.. ‘ఈ భారీ స్వీడిష్ ఫర్నీచర్ స్టోర్ లో తిరిగి, ఇద్దరికి నచ్చిన వస్తువులు కొనుగోలు చేయాలి.. వాటిని కలిసి ఈజీగా అమర్చగలిగే ఈ టాస్క్‌ని విజయవంతంగా పూర్తి చేయగలిగితే దాంపత్య జీవితంలోనూ సవాళ్లను అధిగమిస్తారు’ అని చెప్పారు. ఈ విషయాన్ని బిజినెస్ మ్యాన్ సాహిల్ బ్లూమ్ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ అకౌంట్ ద్వారా చేేసిన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
మాజీ ఫైనాన్స్ ప్రొఫెషనల్ సాహిల్ బ్లూమ్ ఐకియా మ్యారేజ్ టెస్ట్ గురించి మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. ‘మీరు ఎవరినైనా పెళ్లి చేసుకునే ముందు ఐకియాకు వెళ్లి ఫర్నిచర్ కొనుగోలు చేయండి. ఇంటికి తీసుకువచ్చి కలిసి అమర్చండి’ అని గతంలోనూ సాహిల్ బ్లూమ్ పేర్కొన్నారు.
“మీరు ఒకరినొకరు పొట్లాడుకోకుండా మొత్తం ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయగలిగితే, మీరు వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు’ అని ఆయన ఫిబ్రవరి 2023 లో తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ పోస్ట్‌లో చెప్పుకొచ్చారు.
అయితే, కొంతమందికి ఈ సందేహం కూడా వస్తుంది. ఫర్నీచర్ అవసరం లేని వారి పరిస్థితేంటి..? అన్న క్వశ్చన్ కి కూడా సాహిల్ దగ్గర సమాధానం ఉంది.‘ఒక చిన్న పడవ తీసుకుని చెరువులో అడ్వెంచర్‌కి వెళ్లండి‘ అని ఆయన అన్నారు. అందులో సవాళ్లను అధిగమిస్తే ఇద్దరి మధ్య కంపాటబులిటీ ఉన్నట్టు అర్థం అని సాహిల్ పేర్కొన్నారు. అయితే, సాహిల్ బ్లూమ్ సిఫార్సులకు నెట్టింట విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి.
ALSO READ: Group-1 Results: పండుగ పూట గ్రూప్-1 అభ్యర్థులకు అదిరిపోయే న్యూస్.. జనరల్ ర్యాకింగ్స్ విడుదల
ALSO READ: Girls Boyfriend: అమ్మాయిలూ.. ఇలాంటి అబ్బాయిలతో జాగ్రత్తగా ఉండండి.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన