Ashu Reddy: బిగ్ బాస్ అనే రియాలిటీ షోకు తెలుగులో పాపులారిటీ లభించింది. ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో ఎవరో ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడతారు. ఆ షో సాగుతున్నంత సేపు హైలెట్ అవుతారు. బయటికి రాగానే ఎవరి దారి వాళ్లు చూసుకుంటారు. ఇది కామన్‌గా జరుగుతున్నదే. కానీ ఒక బిగ్ బాస్ సీజన్‌లో హౌస్‌లో ఉన్నంత సేపు మాట్లాడుకోని జంట.. బయటికి రాగానే బాగా క్లోజ్ అయ్యారు. వాళ్లే రాహుల్ సిప్లిగంజ్, అషూ రెడ్డి (Ashu Reddy). తాజాగా ‘కిస్సిక్ టాక్స్’లో తమ మధ్య ఉన్న రిలేషన్‌పై స్పందించింది అషూ.
చాలా కష్టపడ్డాడు
బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్‌గా ప్రారంభించిన పోడ్కాస్ట్ ‘కిస్సిక్ టాక్స్’లో గెస్ట్‌గా వచ్చింది అషూ రెడ్డి. అందులో బిగ్ బాస్ గురించి ప్రస్తావన వచ్చింది. అసలు బిగ్ బాస్‌లో తన ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అని వర్ష అడగగా.. వెంటనే రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) పేరు చెప్పింది అషూ. తనంటే ఎందుకు ఇష్టమో కూడా కారణాలు చెప్పింది. ‘‘ఒక సింగర్ అంటే బాగా పాడతాడు అన్నంత వరకే చూస్తాం. కానీ ఒక చిన్న ఏరియా నుండి వచ్చి కష్టపడి, తనకు అవకాశాలు వచ్చినా వేరేవాళ్లు వాటిని లాగేసుకొని.. ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాంటివన్నీ వింటున్నప్పుడు అసలు ఇలాంటివి మనకు జరిగితే ఎలా ఎదుర్కుంటాం అనే ఆలోచన వస్తుంది’’ అంటూ రాహుల్ పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చింది.
అలా క్లోజ్ అయ్యాం
‘‘రాహుల్ గేమ్ ఆడిన విధానం కూడా నాకు చాలా నచ్చింది. తను ఫాస్ట్‌గా కోప్పడడు. మాట్లాడేటప్పుడు వింటాడు. తనలో నాకు అది నచ్చింది’’ అని బయటపెట్టింది అషూ రెడ్డి. బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు కంటే బయటికి రాగానే తను రాహుల్‌కు క్లోజ్ అయిన విషయం నిజమని చెప్పింది. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత మగవారి గ్రూప్‌తో కూడా క్లోజ్ అయ్యానని, అలా రాహుల్‌తో క్లోజ్ అయ్యానని తెలిపింది. రాహుల్‌తో ఎప్పుడూ ట్రిప్స్‌కు వెళ్లలేదు కానీ హైదరాబాద్‌లోనే చాలా తిరిగానని రివీల్ చేసింది అషూ రెడ్డి. ఇక వారిద్దరూ అనుకోకుండా దుబాయ్‌కు వెళ్లి అక్కడే కలిసిన సందర్భం గురించి చెప్పుకొచ్చింది.
Also Read: నా మనసు ముక్కలయ్యింది.. ఆవేదన వ్యక్తం చేస్తున్న మహానటి.!
అదే గుడ్ న్యూస్
‘‘ఒకసారి రాహుల్ దుబాయ్‌కు సాంగ్ షూటింగ్ కోసం వెళ్లాడు. అనుకోకుండా నేను నా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో అప్పుడే దుబాయ్‌కు వెళ్లాను. అప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ చూసి ఇక్కడే ఉన్నావా అని వెళ్లి కలిశాను. రాహుల్ స్టేజ్‌పై పాడడానికి సిగ్గు పడే టైప్. అందుకే నేనే పాడతాను, నాకు సింగర్‌గా అవకాశం ఇవ్వు అని అడుగుతాను’’ అని చెప్తూ నవ్వింది అషూ రెడ్డి. తనకోసం ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ అనే పాట డెడికేట్ చేసింది. త్వరలోనే రాహుల్ ఫ్యామిలీ ఒక గుడ్ న్యూస్‌తో రాబోతుందని రివీల్ చేసింది. ఆ గుడ్ న్యూస్‌ని నేను రీపోస్ట్ చేస్తానని చెప్పింది. అషూ చెప్పిన మాటలను బట్టి చూస్తే రాహుల్‌కు త్వరలోనే పెళ్లి కానుందనే విషయం అర్థమవుతోంది. కానీ పెళ్లికూతురు తనే అని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ఈ బీబీ బ్యూటీ.