Group-1 Results: తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు ఉగాది పండుగ పూట తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లను రిలీజ్ చేసింది. టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్ సైట్ లో ర్యాంకింగ్ లిస్ట్ అందుబాటులో ఉంచినట్టు చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. 20 రోజుల కింద గ్రూప్-1 ప్రొవిజనల్ మార్కుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే.
2024 ఫిబ్రవరి నెలలో 563 పోస్టులను భర్తీ చేసేందుకు రేవంత్ సర్కార్ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-1 పరీక్షలకు మొత్తం 4 లక్షల మందికి పైగా అప్లై చేసుకున్నారు. అయితే ప్రిలిమ్స్ పరీక్షలో 31,382 మంది అభ్యర్థులు పాసయ్యారు. వీరిలో మెయిన్స్ పరీక్షలకు 21,093 మంది అటెండ్ అయ్యారు. ఫలితాలు విడుదల చేసి.. ఇప్పటికే ప్రొవిజనల్ మార్కుల జాబితా విడుదల చేయగా, తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనరల్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. మార్చి 31వ తేదీలోపు గ్రూప్ 1 నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు గ్రూప్-1 ఫలితాలను విడుదల చేశారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతేడాది అక్టోబర్ నెలలో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో 67.17 శాతం హాజరు నమోదైంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల్లో అర్హత పొందిన అభ్యర్థులకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 46 పరీక్ష కేంద్రాల్లో ప్రధాన పరీక్షలు రాశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో మొత్తం ఏడు పేపర్లకు 21,093 మంది అభ్యర్థులు అటెండ్ అయ్యారు. అక్టోబర్ 21 నుంచి నిర్వహించిన పరీక్షలు అక్టోబర్ 27 తో ముగిశాయి. మొత్తం 563 పోస్టుల భర్తీకి నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు మొత్తం 31,403 మంది అర్హత సాధించిన విషయం తెలిసిందే. వీళ్లలో హైకోర్టు అనుమతితో పరీక్షలకు హాజరైన 20 మంది స్పోర్ట్స్ క్యాటగిరీ అభ్యర్థులు కూడా ఉన్నారు.
అయితే ఈ గ్రూప్-1 రిక్రూట్మెంట్ పూర్తి చేసిన తర్వాత.. రేవంత్ సర్కార్ మళ్లీ గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు గతంలోనే అధికారులు వెల్లడించారు. ఈ రెండు మూడు నెలల్లో గ్రూప్-1, 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానున్నట్లు ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ గ్రూప్-1 పరీక్షల్లో ర్యాంక్ రాని వారు.. మళ్లీ వచ్చే నోటిఫికేషన్ కు మంచిగా ప్రిపరేషన్ స్టార్ చేయండి. రేవంత్ సర్కార్ మరో భారీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గ్రూప్-2 నోటిఫికేషన్ కూడా మే లేదా జూన్ మాసంలో వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఏదేం.. అయినప్పటికీ తెలంగాణ సర్కార్ నిరుద్యోగుల గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 55వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి.. ఏ రాష్ట్రం సాధించని ఘనతను సాధించింది.
ALSO READ: ISRO Recruitment: ఐటీఐ, బీటెక్ అర్హతతో ఇస్రోలో ఉద్యోగాలు.. స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం.. ఇంకెందుకు ఆలస్యం
ALSO READ: NABARD Jobs: కొడితే ఈ జాబ్ కొట్టాలి భయ్యా.. రూ.70లక్షల జీతం.. దరఖాస్తుకు మాత్రం ఇంకా..?