Big Stories

China Temple: చైనాలో విచిత్ర ఆలయం.. వెళ్లాలంటే సాహసమనే చెప్పాలి

China Temple: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని మతాల వారికి తాము కొలిచే ప్రతీ దేవుడి ఆలయాలు ఉన్నాయి. అందులోను కొన్ని చారిత్మక దేవాలయాలు ఉంటే మరికొన్ని నూతనంగా నిర్మించిన అద్భుతమైనవి కూడా ఉన్నాయి. అయితే పూర్వం నిర్మించిన ఆలయాల్లో చాలా వరకు కొన్ని ఆలయాల గురించి ఎవరికి తెలిసి ఉండదు. భారతదేశంలోనే దాదాపు లక్షల్లో ఆలయాలు ఉంటాయి. అలాంటిది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎన్నో ఆలయాలు ఉంటాయి. అందులోను కొన్ని ఆలయాలు పర్యాటక ప్రాంతాల్లాగా కూడా ఉంటాయి. అయితే తాజాగా చైనాలోని ఓ ఆలయంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

- Advertisement -

చైనాలో మౌంట్ తైవాన్ అనే ఓ ప్రదేశంలో చారిత్రాత్మక ఆలయం ఒకటి ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే సాహసం అనే చెప్పాలి. ఇక్కడికి వెళ్లిన వారంతా ఆలయాన్ని చేరుకోవడానికే నానా తంటాలు పడాల్సి ఉంటుంది. అలాంటిది దానిని దర్శించుకుని తిరిగి రావడం అంటే అదొక సాహసమనే చెప్పాలి. దాదాపు 6 వేల మెట్లు ఉంటాయి. 6,600 మెట్లు ఉంటాయి. 200 మెట్లు ఎక్కాలంటేనే కళ్లు తిరిగి కింద పడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటిది దాదాపు 6వేల మెట్లు ఎక్కడం అంటే మాటలా. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కొంతమంది చైనీయులు ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లిన తీరు భయానకంగా ఉంది.

- Advertisement -

ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్న వారంతా మార్గం మధ్యలోనే కాళ్లు కూప్పకూలిపోయి, నెమ్మదిగా కర్ర సహాయంతో నడుస్తూ వెళ్తున్నారు. ఈ తరుణంలో వారికి అక్కడి మెడికల్ సిబ్బంది చికిత్స ఇవ్వడం లేదా సహాయం చేయడం వంటివి చేస్తున్నారు. ఓ వ్యక్తి అయితే కాళ్ల నొప్పితో కింద పడిపోగా అతడిని స్టెర్చర్ పై తీసుకెళ్లారు. దీంతో ఈ ఆలయానికి వెళ్లడం కంటే మన వీధిలో ఉండే దేవుడికి దండం పెట్టుకోవడం మేలు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News