Big Stories

Hyundai Eexter Giving 33km Milage: 33 కిలో మీటర్లు మైలేజ్‌ ఇస్తున్న కారు.. ఇదిగో ప్రూఫు..!

Hyundai Eexter Giving 33km Milage: రోజులు గడిచే కొద్ది కార్లలో టెక్నాలజీ అప్‌డేట్ అవుతుంది. ఒకప్పుడు ప్రజలు కారు కొనాలంటే ముందుగా ధరను మాత్రమే చూసేవారు. ఫీచర్లు, సేఫ్టీ గురించి పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఆ రోజుల్లో కార్లు పెద్ద చెప్పుకోదగ్గా మైలేజ్ కూడా ఇచ్చేవి కాదు. కానీ ఇప్పుడు కార్లలో లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసింది. దీంతో ఫీచర్లతో పాటు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు అందుబాటులోకి వచ్చాయి. మరీ ముఖ్యంగా పెట్రోల్ కార్ల కంటే సీఎన్‌జీ వెహికల్స్ మైలేజ్ విషయంలో అందరి అంచనాలను తారుమారు చేశాయి. మైలేజ్ ఇవ్వడంలో పెట్రోల్ కార్లను మంచి పోయాయి.

- Advertisement -

దీంతో సీఎన్‌జీ కార్లను భారీ డిమాండ్ ఏర్పడింది. కొనుగోలుదారులు కూడా మైలేజ్ కార్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. కంపెనీలు సైతం సీఎన్‌జీ వాహనాలకు ఫుల్ పబ్లిసిటీ చేశారు. అయితే ఇటీవలే ఓ కంపెనీకి చెందిన సీఎన్‌జీ కారు 30 కిలో మీటర్ల మైలేజ్ సాధించింది. అధికూడా ఏసీ ఆన్‌లో ఉంచగా జరిగింది. ఏసీ ఆఫ్ చేయగా 33 కిలీమీటర్లు మైలేజ్ ఇచ్చింది. అంటే దగ్గరగా బైకులకు సమానంగా అని చెప్పాలి.

- Advertisement -

ఎస్‌‌యూవీ కార్లకు మార్కెట్‌లో డిమాండ్ పెరిగిపోతుంది. అయితే వీటి ధరలు ఎక్కువగా ఉండటంతో సేల్స్ కాస్త తక్కువగానే ఉంటుంది. దీంతో వినియోగదారులు మైక్రో ఎస్‌యూవీల వైపు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ మైక్రో ఎస్‌యూవీలలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ బెస్ట్ కారుగా ఉంది. ఈ కారు గతేడాది జూలైలో లాంచ్ అయింది. ఇందులో 1.2 లీటర్ నేచుర్ అస్పిరేటేడ్ పెట్రోల్ ఇంజన్ సెట్ ఉంటుంది. ఇది 82 బీహెచ్‌పీ పవర్, 113 ఎన్‌‌ఎమ్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లో 5 మాన్యువల్ ట్రాన్స్ మిషన్, ఆటోమేటేడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ గేర్ బాక్స్‌ను పొందుతుంది.

Also Read: ఈ ఏడాది లాంచ్ కానున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే!

ఈ వెహికల్‌లో ఎన్నో లేటెస్ట్, అడ్వాన్స్ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా 40 ప్లస్ సేఫ్లీ ఫీచర్లు ఉన్నాయి. అలానే టీపీఎంఎస్, బర్గ్‌లర్ అలారం, స్టైలిష్ హెడ్‌ల్యాంప్స్, ఆటో హెడ్ ల్యాంప్స్, స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్ రూప్, డ్యూయెల్ కెమెరాలు వంటి అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ సీఎన్‌జీ వేరియంట్ ధర రూ.8.23 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

Best Millage Car
Best Millage Car

ఇక ఈ వెహికల్ మైలేజ్ విషయానికి వస్తే పెట్రోల్ వెర్షన్ 17 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే.. సీఎన్‌జీ వెర్షన్‌లో 33 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఏసీ ఆన్‌లో ఉంటే 30 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని ఓ వినియోగదారుడు ట్వీట్‌లో వెల్లడించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News