BigTV English

Ladhak landscape : భూమి భ్రమణాన్ని మీరెప్పుడైనా చూశారా.. లేదంటే ఈ ఖగోళ అద్భుతాన్ని మీరూ చూసేయండి

Ladhak landscape : భూమి భ్రమణాన్ని మీరెప్పుడైనా చూశారా.. లేదంటే ఈ ఖగోళ అద్భుతాన్ని మీరూ చూసేయండి

Ladhak landscape : భూభ్రమణం గురించి చాలా మందికి తెలుసు అయితే.. దాని చూడడం ఎలా అంటే  మాత్రం అంత సులువుగా సమాధానం దొరకదు. కానీ.. ఇటీవల సోషల్ మీడియాలో తన చుట్టూ తాను తిరుగుతున్న భూమి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతుంది. దీని చూసిన వారంతా.. తెలుసుకుంటే ఖగోళ అద్భుతాలు ఎంత బాగుంటాయో కదా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. సరిగ్గా వివరించే వాళ్లు ఉంటే ఖగోళ శాస్త్రం నిత్యం అబ్బురపరిచే.. విలక్షణ శాస్త్రం అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ.. ఆ వీడియో ఏంటి. అందులో ఏముందు అంటే..


ప్రకృతి అందాలకు పుట్టినిల్లు లద్ధాఖ్.. మాములుగా అయితే అక్కడ ప్రయాణించడం, నివసించడం సవాళ్లతో కూడకున్నది. కానీ.. అదో అద్భుత ప్రాంతం అంటుంటారు. అలాంటి చోట నుంచి భూ భ్రమణాన్ని అద్భుతంగా చిత్రీకరించారు.. భారతీయ ఖగోళ శాస్త్రవేత్త డోర్జే అంగ్‌చుక్ (Dorje Angchuk). హాన్లేలోని ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీలో ఇంజనీర్-ఇన్-ఛార్జ్‌గా పనిచేస్తున్న అంగ్‌చుక్..  పగలు నుంచి రాత్రి వరకు భూమి భ్రమణాన్ని వివరించేలా.. 24-గంటల వ్యవధిలోని మార్పులతో ఓ టైమ్ లాప్స్ వీడియోను రూపొందించారు. అందులో.. రికార్డైన విజువల్స్.. ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ వీడియోను మీరు చూసేయండి..

చూశారుగా.. భూమి ఎలా తిరుగుతుందో ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. భూమి తిరుగుతున్న అనుభూతి మనకు కలగదు. కానీ.. వాస్తవంలో పాలపుంత, ఇతర నక్షత్రాలు స్థిరంగా ఉన్నప్పుడు భూమి  మాత్రం చాలా వేగంగా తన చుట్టూ తాను తిరిగుతుంటుంది. ఈ వీడియోలోనూ ఆ దృశ్యాలే కనిపిస్తున్నాయి.

భూ భ్రమణం గురించి విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేలా వీడియో రూపొందించాలని తనకు వచ్చిన అభ్యర్థన మేరకు ఈ ప్రాజెక్ట్‌ చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. లద్దాఖ్‌లోని విపరీతమైన శీతల పరిస్థితులు ఉండడం వల్ల వీడియో చిత్రీకరిస్తున్న నాలుగు రాత్రుల్లో పలుమార్లు బ్యాటరీ వైఫల్యాలు, టైమర్‌ పని చేయకపోవడం వంటి ఎదురుదెబ్బలు తగిలాయని.. కానీ ఎలాగైనా వీడియో రూపొందించాలనే ఆలోచనతో ముందుకువెళ్లానని అన్నారు.

 

తాను ఈ ప్రాజెక్టు గురించి ప్రయత్నించినప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కున్నట్లు డోర్నే తెలిపారు. తొలుత ఓరియన్ రాశిని ఫ్రేమ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అంగ్‌చుక్.. ఎత్తైన పర్వత ప్రాంతంలో ఫోటోలు తీసేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడ్డాడు. లద్దాఖ్ లోని విపరీతమైన శీతల పరిస్థితుల కారణంగా కెమెరా బ్యాటరీలు త్వరగా ఛార్జ్ దిగిపోతాయి. దీంతో.. అతని పని చాలా ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు.

ఈ వీడియో కోసం భారతీయ ఖగోళ శాస్త్రవేత్త డోర్జే అంగ్‌చుక్ అనేక ఏకంగా నాలుగు రోజుల పాటు కష్టపడాల్సి వచ్చిందంట. అయితే.. ప్రతి సవాలు తనకి విలువైన పాఠాలు నేర్పించాయి అంటున్నాడు.. ఈ శాస్త్రవేత్త.

ఈ వీడియో రూపొందించడం వెనుక.. విద్యార్థులు భూమి భ్రమణాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడాలనే ఉద్దేశ్యం ఉందంటున్నారు. కొందరు విద్యార్థులు ఈ విషయాన్ని అర్థం చేసుకునేందుకు అభ్యర్థించడంతో.. తాను ఈ టైమ్-లాప్స్ వీడియో తీయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఎంతో కష్టపడి సాధించిన ఈ పుటేజ్ ను అతను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

Also Read : ఆ పాటకు డాన్స్ చేసిన వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు తండ్రి

విశాలమైన ఆకాశం కింద భూమి కదలికను పూర్తిగా, స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా.. ఖగోళ ఫోటోగ్రఫీ పట్ల అతని అంకితభావం లద్ధాఖ్ అందాలను తెలుపడంతో పాటు, రాత్రి పూట ఆకాశంలో జరిగే వింతల్ని వివరించడానికి ఉపయోగపడిందని అభినందిస్తున్నారు. అలాగే.. ఖగోళ శాస్త్రం, మన విశ్వంలోని అద్భుతాల గురించి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినివ్వడం లక్ష్యంగా ఉండడాన్ని కొనియాడుతున్నారు.

Related News

Viral Video: బ్యాట్ తో కుర్రాళ్లు, లోకల్ ట్రైన్ లో ఆడాళ్లు.. గర్బా డ్యాన్స్ తో అదరగొట్టారంతే!

Viral Video: చెంప మీద కొట్టి.. డబ్బులు లాక్కొని.. అమ్మాయితో టీసీ అనుచిత ప్రవర్తన, ట్విస్ట్ ఏమిటంటే?

Kerala: చోరీకి గురైన బంగారం దొరికింది.. కానీ, 22 ఏళ్ల తర్వాత, అదెలా? కేరళలో అరుదైన ఘటన!

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Big Stories

×