Dulquer Salmaan: మామూలుగా ఒక సినిమాను సైన్ చేయగానే అప్పటివరకు చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తిచేసి ఆ సినిమాను మొదలుపెట్టాలంటే హీరోలకు చాలా సమయం పడుతుంది. అలా మూవీ గురించి అనౌన్స్‌మెంట్ వచ్చి చాలాకాలమే అయినా దాని రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి టైమ్ తీసుకుంటారు హీరోలు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ విషయంలో కూడా అదే జరుగుతోంది. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ఇండస్ట్రీలను చుట్టేస్తున్న దుల్కర్ సల్మాన్.. గతేడాది తన పుట్టినరోజుకు ఒక తెలుగు సినిమాను అనౌన్స్ చేశాడు. అది పట్టాలెక్కించడానికి ఇంత సమయం పట్టింది. ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం తాజాగా హైదరాబాద్‌లో జరిగింది.
పూజా కార్యక్రమాలు
మాలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో అరడజను సినిమాలను ఓకే చేసి మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. అలాంటి దుల్కర్.. గతేడాది తన బర్త్ డేకు ఒక తెలుగు సినిమా గురించి అనౌన్స్‌మెంట్ అందించాడు. అదే ‘ఆకాశంలో ఒక తార’. ఆ మూవీ ప్రకటించిన విషయం కూడా చాలామంది మర్చిపోయారు. ఆ తర్వాత పలు హిట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు దుల్కర్. ఇప్పుడు తన చేతిలోని సినిమాలు అన్నీ అయిపోయిన తర్వాత ‘ఆకాశంలో ఒక తార’ మూవీని పూజా కార్యక్రమాలతో ప్రారంభించాడు. ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పుట్టినరోజు సందర్భంగా
‘ఆకాశంలో ఒక తార’లో దుల్కర్ సల్మాన్‌కు జోడీగా సాత్వికా వీరవల్లి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఇక వీరితో పాటు నటించే నటీనటులు ఎవరు అనే విషయాన్ని అప్పుడే రివీల్ చేయలేదు మేకర్స్. గతేడాది జులై 28న దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ గురించి ప్రకటించారు మేకర్స్. అప్పటినుండి ఇప్పటివరకు అసలు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ బయటికి రాకపోవడంతో దీని గురించి దుల్కర్ ఫ్యాన్స్ సైతం మర్చిపోయారు. ఇది ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ప్రేమకథ అని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. పవన్ సాధినేని దీనికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. చాలాకాలం తర్వాత ‘ఆకాశంలో ఒక తార’తో ప్రేక్షకులను పలకరించనున్నాడు పవన్.
Also Read: అవకాశమిచ్చి పిలిచినా రావట్లేదు, అందుకే అలా చేశాను.. అవినాష్‌పై అమ్మ రాజశేఖర్ కామెంట్స్
మరో ప్రేమకథ
‘సావిత్రి’ లాంటి సినిమాతో పాటు ఎన్నో వెబ్ సిరీస్‌లకు దర్శకుడిగా వ్యవహరించాడు పవన్ సాధినేని. ఇప్పుడు దుల్కర్ సల్మాన్‌తో కలిసి ‘ఆకాశంలో ఒక తార’ (Aakasamlo Oka Tara) అనే ప్రేమకథతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. ఇది దేశమంతా తిరిగి చూసే ప్రేమకథ అవుతుందని పవన్ ఎప్పుడో ప్రకటించాడు. ఇప్పటికే దుల్కర్ సల్మాన్ హీరోగా పలు క్లాసిక్ లవ్ స్టోరీలు తెరకెక్కాయి. అందులో ‘సీతారామం’ మొదటి స్థానంలో ఉంటుంది. మరి ‘ఆకాశంలో ఒక తార’ కూడా అదే రేంజ్‌లో ఫ్యాన్స్‌ను మెప్పిస్తుందేమో చూడాలి. ఈ మూవీని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్‌తో పాటు స్వప్న సినిమా కలిసి తెరకెక్కిస్తోంది.
Smiles.
Blessings.
And a Sky full of dreams ❤️#AakasamLoOkaTara takes off with a Pooja Ceremony 📸💫#AOTMovie@dulQuer @GeethaArts @SwapnaCinema @Lightboxoffl @pavansadineni @sunnygunnam @Ramya_Gunnam @SwapnaDuttCh @sujithsarang pic.twitter.com/iGyNZml8CN— Geetha Arts (@GeethaArts) February 2, 2025